న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రపంచదేశాలన్నింటిని వణికిస్తున్నది. దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న కేసులతో సర్వత్రా ఆందోళన నెలకొన్నది. తాజాగా ఢిల్లీ సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఓ మానసిక వికలాంగుల ఆశ్రమంలో 8 మంది పిల్లలతోపాటు 23 మందికి కరోనా సోకింది. ఈ ఆశ్రమంలో 960 మంది మానసిక వికలాంగులు ఉంటున్నారు. ఈ నెల 5నుంచి 20వతేదీ వరకు మానసిక వికలాంగుల ఆశ్రమంలో కరోనా పరీక్షలు చేయగా 23 కరోనా పాజిటివ్ అని తేలింది. ఇందులో ముగ్గురు […]