సారథి న్యూస్, ఖమ్మం: ఖమ్మం పోలీస్ హెడ్ క్వార్టర్ పరేడ్ మైదానంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. జెండాను ఆవిష్కరించిన పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ పోలీసుశాఖ,జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా లాక్ డౌన్ అంక్షల అమలులో ప్రతిఒక్కరూ అహర్నిశలు కష్టపడి పనిచేశారని, ఇదే స్ఫూర్తితో భవిష్యత్లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. పోలీస్ కమిషనర్ ఆఫీసులోఅడిషనల్ డీసీపీ ఇంజరాపు పూజ […]
సారథి న్యూస్, గోదావరిఖని: రాష్ట్రంలో టీఆర్ఎస్ 20 వసంతాలు పండుగను ఘనంగా నిర్వహించేందుకు గులాబీ దళం కసరత్తు చేసుకుంటుండగా పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలో ఆధిపత్య పోరు రచ్చకెక్కింది. ప్రొటోకాల్ పాటించాలని కొందరు, స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వాలని మరికొందరు ఆవిర్భావ దినోత్సవం సాక్షిగా వాగ్వాదానికి దిగారు. ‘పార్టీ జెండాను మేము ఎగరవేస్తామంటే మేమంటూ’ రచ్చ రచ్చ చేశారు. గులాబీలో గలాట కార్యకర్తలు కలిసి పనిచేస్తూ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని సీఎం కేసీఆర్ చెప్పిన మాటలను ఆవిర్భావ […]
సారథి న్యూస్, నర్సాపూర్: నియోజకవర్గకేంద్రమైన నర్సాపూర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డి పార్టీ జెండాను ఎగరవేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి సునీతారెడ్డి, మున్సిపల్ చైర్మన్ మురళీధర్ యాదవ్ ఇతర నాయకులు పాల్గొన్నారు.