సారథి న్యూస్, నాగర్కర్నూల్: తేనె సేకరణకు వెళ్లిన ఇద్దరు చెంచు యువకులు చెట్టుకు కట్టిన తాగు తెగిపోయి లోయలోపడి చనిపోయారు. ఈ దుర్ఘటన శనివారం నాగర్కర్నూల్జిల్లా అమ్రాబాద్ మండలం జంగంరెడ్డిపల్లి సమీప అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఆదివాసీ చెంచులు దాసరి బయన్న(35), దాసరి పెద్దలు(28), దాసరి వెంకటయ్య కలిసి నల్లమల అటవీ ప్రాంతంలోకి తేనె సేకరణకు వెళ్లారు. చెట్టుకు కట్టిన తాడు ప్రమాదవశాత్తు తెగిపోవడంతో ముగ్గురూ లోయలో పడిపోయారు. వారిలో దాసరి బయన్న, దాసరి […]
సారథి న్యూస్, ఖమ్మం: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం చెరుకుపల్లి పంచాయతీ తుమ్మలనగర్ లో స్నేహ స్వచ్ఛంద సేవా సంస్థ సహకారంతో సుమారు 30 మంది ఆదివాసీ పేద కుటుంబాలకు టీఆర్ఎస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ ఆధ్వర్యంలో మాస్క్ లు, నిత్యావసర సరుకులు, బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. కరోనా నేపథ్యంలో పేదలకు ఇబ్బందులు కలగకూడదనే సరుకులు పంపిణీ చేసినట్లు తెలిపారు.