సారథిన్యూస్, హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో మరో 12 మంది జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ వచ్చింది. వారికి ఒక్కొక్కరికి 20 వేల రూపాయలు, హోంక్వారైంటైన్లో మరో ఐదుగురికి రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నట్టు మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ వెల్లడించారు. ఇప్పటి వరకు 99 మంది జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ రాగా ఒక్కొక్కరికి రూ. 20 వేల చొప్పున 19 లక్షల 80 వేలు రూపాయలు ఆర్థికసాయం అందించామని చెప్పారు. హోంక్వారంటైన్లో ఉన్న 52 మందికి […]
సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా బారినపడిన జర్నలిస్టులకు తక్షణ సహాయం కింద రూ.20వేలు, క్వారంటైన్లో ఉన్న జర్నలిస్టుకు రూ.10 వేల సాయం అందిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. జర్నలిస్టు వివరాలను వెంటనే 8086677444, 9676647807 నంబర్లకు పంపించి సహాయం పొందగలరని కోరారు.
సారథి న్యూస్, హైదరాబాద్: జర్నలిస్టులందరికీ కరోనా వైద్యపరీక్షలు చేయించాలని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ను కోరారు. సోమవారం బీఆర్కే భవన్ లో మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. విధుల నిర్వహణలో జర్నలిస్టులు జాగ్రత్తగా ఉండాలని మంత్రి సూచించారు. భౌతిక దూరం పాటించడంతో పాటు మాస్క్లు కచ్చితంగా కట్టుకోవాలని కోరారు.
సారథి న్యూస్, హైదరాబాద్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా(కోవిడ్19) నుంచి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే మంచిదని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు, వీడియో, ఫొటోగ్రాఫర్లకు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సూచించారు. ఈ మేరకు బుధవారం ప్రకటనలో కోరారు. జర్నలిస్టులు విధుల నిర్వహణలో జాగ్రత్తగా ఉండాలని, వార్తల సేకరణ, ఆఫీసులో విధులు నిర్వహించే సమయంలో సోషల్ డిస్టెన్స్ పాటించాలని కోరారు. మాస్క్లు, శానిటైజర్ ను వెంట తప్పనిసరిగా తీసుకెళ్లాలని కోరారు. ఆయా సంస్థలు కూడా వారికి […]