సారథి, వేములవాడ: కరోనాను వ్యాప్తిని అరికట్టేందుకు రాజన్నసిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్హెగ్డే ఆదేశాల మేరకు వేములవాడ రూరల్ఎస్సై మాలకొండ రాయుడు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది హన్మజిపేట గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతిఒక్కరూ తప్పకుండా మాస్కులు కట్టుకోవాలని, శానిటైజర్వాడాలని, తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. భౌతికదూరం పాటించాలని మాట, పాటల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు.
సారథి, వేములవాడ: వేములవాడ రాజన్న ఆలయంలో వివిధ హోదాల్లో విధులు నిర్వహించిన పలువురు ఉద్యోగులు బుధవారం రిటైర్డ్ అయ్యారు. ఆలయ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో వారిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో చంద్రమౌళి, అర్చక, ఉపప్రధాన అర్చక గొప్పన్నగారి నాగన్న, ఈఏవో సంకేపల్లి హరికిషన్, ఉద్యోగ సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్, గౌరవాధ్యక్షుడు సిరిగిరి శ్రీరాములు, కార్యదర్శి పేరుక శ్రీనివాస్ తో పాటు ఏఈవో బి.శ్రీనివాస్, పర్యవేక్షకులు గోలి శ్రీనివాస్, నాగుల మహేష్, వరి నరసయ్య, స్థానాచారి […]
సారథి, వేములవాడ: దక్షిణకాశీ క్షేత్రంగా వెలుగొందుతున్న వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయాన్ని తొగుట పీఠం శ్రీశ్రీశ్రీ మాధవానందస్వామి సోమవారం దర్శించుకున్నారు. ఆలయ ఈవో సంప్రదాయబద్ధంగా ఘనస్వాగతం పలికారు. స్వామి వారికి పూజల అనంతరం కల్యాణమండపంలో పాదపూజ చేశారు. వారి వెంట బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, అర్చకస్వాములు పాల్గొన్నారు. అలాగే ఒకేరోజు సుమారు 25వేల మంది భక్తులు దర్శించుకుని ప్రత్యేకపూజలు చేశారు. ఆలయానికి రూ.20లక్షల ఆదాయం వచ్చిందని ఈవో తెలిపారు.
సారథి, వేములవాడ: రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయాన్ని సినీనేపథ్య గాయకుడు, ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ గురువారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు సాదరస్వాగతం పలికారు. శాలువతో సన్మానం చేసి స్వామి వారి అభిషేకం లడ్డూప్రసాదంతో పాటు స్వామివారి ప్రతిమలను అందజేశారు. అంతకుముందు పట్టణంలోని సాయిబాబా ఆలయాన్ని ఏనుగు మనోహర్ రెడ్డి దర్శించుకున్నారు.
సారథి, వేములవాడ: దక్షిణకాశీగా పేరొందిన వేములవాడ రాజారాజేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు రాకపోకలు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగానే మంగళవారం స్వామివారిని కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ దర్శించుకుని ప్రత్యేకపూజలు చేశారు. ఆయనకు అర్చకులు ఘనస్వాగతం పలికారు. తదనంతరం వారికి స్వామివారి అభిషేకం లడ్డూ ప్రసాదం అందజేశారు. పొన్నం వెంట పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
సారథి, వేములవాడ: ప్రతి సంవత్సరం మృర్గశిర కార్తెలో బోనాల పండగ జరుపుకోవడంతో పాటు పెద్దమ్మ, దుర్గమ్మ దేవతలను దర్శించుకోవడం ఆనవాయితీ. అందులో భాగంగానే శుక్రవారం బోనాల పండగను ఘనంగా జరుపుకున్నారు. అమ్మవార్ల వద్దకు వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. వేములవాడ పట్టణంలోని ముదిరాజ్ కులస్తుల బోనాల వేడుక సందర్భంగా అమ్మవార్లను ఏనుగు మనోహర్ రెడ్డి దర్శించుకొని ప్రత్యేకపూజలు చేశారు.
సారథి, వేములవాడ: పేదల పెన్నిధి, నిస్వార్థసేవాపరుడు, మనసున్న మారాజు, టీఆర్ కే చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు తోట రామ్ కుమార్ జన్మదిన వేడుకలు శుక్రవారం వేములవాడ పట్టణంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి రాజన్న ఆలయం ఎదుట కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఆలయ సమీపంలో వంద మంది యాచకులకు అన్నదానం చేశారు.
సారథి, వేములవాడ: సిరిసిల్ల రాజన్న జిల్లా వేములవాడ పట్టణానికి చెందిన తిరుపతి, శ్రీనివాస్ అక్రమంగా నిల్వ ఉంచిన నిషేధిత గుట్కా ప్యాకెట్ అమ్ముతున్నట్లు తెలుసుకున్న పట్టణ ఇన్ స్పెక్టర్ వెంకటేష్ వారి నుంచి రూ.5,050 విలువైన గుట్కా ప్యాకెట్ లను పట్టుకున్నారు. ఎవరైన నిషేధిత గుట్కా ప్యాకెట్లను విక్రయిస్తే కఠిన చట్టలు తీసుకుంటామని హెచ్చరించారు. అమ్మే వారి సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.