Breaking News

వాజేడు

ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు

ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు

సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. కరోనా కారణంగా 9 రోజులుగా సంబరాలు అంతంత మాత్రంగానే జరుపుకున్నా, చివరిరోజు ఉత్సవాలు వైభవంగా జరిగాయి. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ప్రతిఒక్కరూ వేడుకల్లో పాల్గొన్నారు. ఏ పల్లెలో చూసినా సంబరాల ఉత్సాహమే కనిపించింది. డీజే పాటలు, డోలు వాయిద్యాలతో సందడిగా కనిపించింది. మహిళలంతా బతుకమ్మను పోయిరా.. గౌరమ్మా పోయిరా.. అంటూ సాగనంపారు.

Read More
నిరుపేద యువతికి సాయం

నిరుపేద యువతికి సాయం

సారథి న్యూస్, ములుగు: ఓ నిరుపేద యువతికి మహిళా అధికారి సాయం అందించారు. తిండిలేక అల్లాడిపోతున్న యువతి మంగళవారం ములుగు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు వచ్చింది. ఆమె పరిస్థితిని చూసి చలించిపోయిన సబ్​రిజిస్ట్రార్​ తస్లీమా మహమ్మద్ ​రూ.మూడువేలు, 25కేజీల బియ్యం అందజేశారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండల కేంద్రానికి చెందిన మురారి సుధాకర్, స్వరూప దంపతులకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. తల్లి నాలుగేళ్ల క్రితం చనిపోవడంతో వారి కుటుంబ పోషణ భారంగా మారింది. తండ్రి పిల్లలను పట్టించుకోకపోవడంతో […]

Read More
ఏజెన్సీలో నూతన రెవెన్యూ చట్టాన్ని నిలిపేయాలి

ఏజెన్సీలో నూతన రెవెన్యూ చట్టాన్ని నిలిపేయాలి

సారథి న్యూస్, వాజేడు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీ చట్టాలను నిర్వీర్యం చేస్తూ ఆదివాసీల మీద అత్యంత పాశవికంగా దమనకాండ కొనసాగిస్తోందని ఆదివాసీ నవ నిర్మాణసేన రాష్ట్ర అధ్యక్షుడు పూనేం సాయి విమర్శించారు.ఏజెన్సీ నూతన రెవెన్యూ చట్టాన్ని, ఎల్ఆర్​ఎస్​ను నిలిపివేయకపోతే ఆదివాసీ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, సర్పంచ్​లు, ఎంపీటీసీలు, తమ పదవులకు రాజీనామా చేయాలని సాయి డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. 1970కు ముందు ఉన్న గిరిజనేతరులందరికీ భూములపై […]

Read More
చల్వాయి నర్సరీని పరిశీలించిన డీఎఫ్వో

చల్వాయి నర్సరీని పరిశీలించిన డీఎఫ్ వో

సారథి న్యూస్, వాజేడు: పస్రా ఫారెస్ట్​రేంజ్ పరిధిలో ఉన్న చల్వాయి నర్సరీ కేంద్రాన్ని గురువారం ములుగు డీఎఫ్ వో ప్రదీప్ కుమార్ శెట్టి ఆకస్మిక తనిఖీ చేశారు. నర్సరీలో ఉన్న మొక్కల వివరాలను అడిగి తెలుసుకుని కొన్ని సూచనలు చేశారు. అనంతరం లక్నవరంలోని ఎకో పార్క్ ను సందర్శించిన డీఎఫ్ వో ప్రదీప్ కుమార్ శెట్టి సిబ్బందిని ఫుడ్ కోర్ట్ ఏర్పాటుచేయాలని ఆదేశించారు. అలాగే పర్యాటకుల కోసం మరిన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. అనంతరం లక్నవరంలోని వాచ్ టవర్ […]

Read More
బొగత జలపాతం ఓపెన్​

బొగత జలపాతం ఓపెన్​

సారథి న్యూస్, వాజేడు(ములుగు): ములుగు జిల్లాలోని వాజేడు మండలం చికుపల్లి అటవీ పాంత్రంలో ఉన్న బొగత జలపాతాన్ని వెంకటాపురం రేంజ్ ఆఫీసర్, వాజేడు ఎస్సై తిరుపతి రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. బొగత జలపాతానికి వచ్చే పర్యాటకులు అటవీ అధికారులు చెప్పిన జాగ్రత్తలు పాటించాలన్నారు. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటించాలని, మాస్క్ తప్పనిసరి కట్టుకుని బొగత జలపాతం సందర్శనకు రావాలని సూచించారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. […]

Read More
మూరుమూరులో ‘ఫ్రై డే.. డ్రై డే’

మూరుమూరులో ‘ఫ్రై డే.. డ్రై డే’

సారథి న్యూస్, వాజేడు: వానాకాలంలో నిల్వ ఉన్న నీటితో అంటువ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు శుక్రవారం ములుగు జిల్లా వాజేడు మండలం మూరుమూరు పంచాయతీలో ఫ్రై డే.. డ్రై డే కార్యక్రమం నిర్వహించారు. నిల్వ ఉన్న నీటిని తొలగించారు. సీజనల్​ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సర్పంచ్ పూసం నరేష్, హెల్త్ పర్యవేక్షకుడు కోటిరెడ్డి, శేఖర్, కన్యాకుమారి, ఛాయాదేవి, లలిత కుమారి, అంగన్​వాడీ టీచర్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More
టేకులగూడెంలో కరోనా టెస్టులు

టేకులగూడెంలో కరోనా టెస్టులు

సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా పేరూరు ఆరోగ్య కేంద్రం పరిధిలోని టేకులగూడెంలో డాక్టర్ సీతారామరాజు ఆధ్వర్యంలో శుక్రవారం కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. 61మందికి వైద్యపరీక్షలు చేయగా.. అందరికీ నెగెటివ్​ రిపోర్టు వచ్చింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా వ్యాధి నిర్ధారణ టెస్టులు చేస్తున్నామని తెలిపారు. ఫార్మసిస్ట్ యాలం సతీశ్, హెల్త్ అసిస్టెంట్ కె.తిరుపతి రావు, ఎస్ఎన్ఎం జి.రజిత, ఎల్టీకే.అశ్విని, సర్పంచ్ వాసం కృష్ణవేణి, కార్యదర్శి యాలం వినోద పాల్గొన్నారు.

Read More
దోమ తెరలు పంపిణీ

దోమ తెరలు పంపిణీ

సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలోని పెనుగోలు కాలనీ, మండపాక గ్రామాల్లో వాజేడు వైద్యబృందం ఆధ్వర్యంలో దోమ తెరలను పంపిణీ చేశారు. అనంతరం ‘ఫ్రై డే.. డ్రై డే’ కార్యక్రమాన్ని నిర్వహించి నిల్వ ఉన్న నీటిని పారబోశారు. మెడికల్​ ఆఫీసర్​ మంకిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ మాస్కులు కట్టుకుని, భౌతికదూరం పాటించాలని, జలుబు, దగ్గు, జ్వరం ఇతరత్రా వ్యాధులతో బాధపడుతున్నవారు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి వైద్యాధికారిని సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో సబ్ యూనిట్ […]

Read More