Breaking News

ములుగు

కూంబింగ్​అందుకోసమేనా?

కూంబింగ్​ అందుకోసమేనా?

దండకారణ్యంలో విస్తృతంగా తనిఖీలు భారీ సంఖ్యలో పోలీసు బలగాల మోహరింపు సారథి న్యూస్, వాజేడు: కొంతకాలంగా నిశ్శబ్దంగా ఉన్న దండకారణ్యంలో మళ్లీ అలజడి మొదలైంది. మావోయిస్టులు తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నారన్న ఇంటలిజెన్స్​సమాచారం మేరకు పోలీసులు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానికుల్లో కలవరం నెలకొంది. ములుగు జిల్లా, చత్తీస్​గఢ్ ​సరిహద్దు ప్రాంతంలో కొద్దిరోజులుగా పెద్దసంఖ్యలో పోలీసు బలగాలు కుంబింగ్ ​నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం సీఐ శివప్రసాద్ నేతృత్వంలో సివిల్ […]

Read More
కొంగాలలో హెల్త్ క్యాంప్

కొంగాలలో హెల్త్ క్యాంప్

సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలం కొంగల గ్రామంలో గురువారం హెల్త్ క్యాంప్ నిర్వహించారు. వర్షాకాలంలో వచ్చే వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అందరూ కచ్చితంగా మాస్కులు కట్టుకోవాలని, సామాజిక దూరం పాటించాలని డాక్టర్లు సూచించారు. బీపీ, షుగరు, టీబీ ఉన్నవారు, 60 ఏళ్లు పైబడిన అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ యమున, కోటిరెడ్డి, ఛాయాదేవి, ఆశావర్కర్లు, 104 వాహన సిబ్బంది పాల్గొన్నారు.

Read More
గేదెలను ఢీకొట్టిన ట్రావెల్స్​బస్సు

గేదెలను ఢీకొట్టిన ట్రావెల్స్​ బస్సు

సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం సాయంత్రం కలకత్తా నుంచి హైదరాబాద్ కు ఛత్తీస్ గఢ్ మీదుగా వెళ్తున్న ట్రావెల్స్​ బస్సు వాజేడు మండలం గుమ్మడిదొడ్డి గ్రామం వద్ద పాడి గేదెలను ఢీకొట్టింది. ఈ ఘటనలో మూడు గేదెలు మృతిచెందాయి. డ్రైవర్, క్లీనర్​పరారీలో ఉన్నారు.

Read More
వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలి

వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలి

సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వాజేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని కొంగాల గ్రామంలో మంగళవారం వైద్యశిబిరం నిర్వహించారు. కాలానుగుణంగా వచ్చే వ్యాధులు, ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా గురించి అవగాహన కల్పిస్తూ డాక్టర్ యమున సూచనలు చేశారు. ప్రతిఒక్కరూ భౌతిక దూరం పాటించాలని, మాస్క్ లు కట్టుకోవడంతో పాటు చేతులను ఎప్పటికప్పుడు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు.

Read More

చెట్లే ప్రాణాధారం

సారథి న్యూస్,ములుగు: చెట్లే మానవజాతికి ప్రాణాధారమని రాష్ట్ర మహిళా​​, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్​ పేర్కొన్నారు. ఆరోవిడుత హరితహారంలో భాగంగా శుక్రవారం ఆమె ములుగు జిల్లా అటవీశాఖ కార్యాలయంలో మొక్కలు నాటారు. ములుగు మండలం జాకారం, బండారుపల్లి, వెంకటాపూర్ మండలంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లడుతూ.. అటవీ సంపదను పెంచేందుకే సీఎం కేసీఆర్​ హరితహారం కార్యక్రమాన్ని తలపెట్టారని చెప్పారు. కార్యక్రమంలో ములుగు జెడ్పీ చైర్మన్​ కుసుమ జగదీశ్, కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఎమ్మెల్యే […]

Read More

వైద్యసేవలు బాగుండాలె

సారథి న్యూస్, ములుగు: ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఏటూరునాగారం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి హన్మంత్ శుక్రవారం వెంకటాపురం తహసీల్దార్ ఆఫీసు మరమ్మతులు పరిశీలించారు. అనంతరం ఎదిరా ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేశారు. అలుబక గ్రామంలో నర్సరీ మొక్కలు పరిశీలించారు. హరితహారం కింద అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టి, ట్రీ గార్డ్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ ఖాళీ స్థలాలకు ఫెన్సింగ్​ చుట్టాలన్నారు. గ్రామాల్లో వైకుంఠధామం, డంపింగ్ యార్డ్, సెగ్రిగేషన్ షెడ్లు, ఇంకుడుగుంతలు పనులను కంప్లీట్​ చేయాలన్నారు. పంచాయతీలకు […]

Read More

సబ్ రిజిస్ట్రార్ చేయూత

సారథి న్యూస్, ములుగు: రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితి, తినడానికి తిండి లేదు. నిలువ నీడ లేదు, విధి వెక్కిరించి వీధినపడ్డ ఓ నిరుపేద కుటుంబానికి చేయుతనందించి సహృదయాన్ని చాటుకున్నారు సబ్ రిజిస్ట్రార్ తస్లీమా. ములుగు మండలం జంగాలపల్లి గ్రామానికి చెందిన రెడ్డబోయిన రాజు, మానస దంపతులకు వైష్ణవి, తేజశ్విని ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. వారికి ఉండడానికి ఇల్లు లేకపోవడంతో కూలీ పనులు చేసుకుంటూ కిరాయి ఇంట్లో జీవనం సాగిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం ప్రమాదంలో రాజు కాలు […]

Read More

మాస్కులు పంపిణీ

సారథి న్యూస్, వాజేడు(ములుగు): వాజేడు మండలం బాలలక్ష్మీపురం గ్రామంలో ఎస్సై తిరుపతిరావు బుధవారం మాస్కులు పంపిణీ చేశారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడమే కాకుండా భౌతికదూరం పాటించాలని, వ్యక్తిగత శుభ్రత పాటించాలని సూచించారు. గ్రామంలో ఎవరికైనా దగ్గు, జ్వరం, శ్యాసతీసుకోడం ఇబ్బందులు కలిగితే వెంటనే వైద్యులను సంప్రదించాలని గ్రామస్తులకు సూచించారు.

Read More