Breaking News

మానవపాడు

పుష్కరాలకు కార్తీక శోభ

పుష్కరాలకు కార్తీక శోభ

సారథి న్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): తుంగభద్ర పుష్కరాలకు కార్తీక శోభ సంతరించుకుంది. పవిత్ర సోమవారం కావడం, పుష్కరాలు 11వ రోజు కావడంతో పలు ఘాట్లకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు ఉమ్మడి మండల పరిధిలోని పుల్లూరు పుష్కర ఘాట్ కు తాకిడి పెరిగింది. ఇక్కడ వేలసంఖ్యలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు జిల్లా పరిధిలోని ఘాట్లలో నదీస్నానాలకు అనుమతి లేకపోవడంతో అలంపూర్ పుష్కర ఘాట్ కు భక్తులు పెద్దసంఖ్యలో వస్తున్నారు. కొందరు నదిలో […]

Read More

పుష్కరుడి చెంతకు భక్తజనం

సారథి న్యూస్, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ జోగుళాంబ అమ్మవారి సన్నిధిలోని పుష్కర ఘాట్ కు భక్త జనసందోహం రోజురోజుకు పెరుగుతోంది. మంగళవారం రోజు ఐదో రోజుకు పుష్కరాలు చేరాయి. తెల్లవారుజామున 5గంటల నుంచే భక్తులు తుంగభద్ర నదిలో పుష్కర స్నానాలు ఆచరించి జోగుళాంబ అమ్మవారిని, బాలబ్రహ్మేశ్వరుణుడిని దర్శించుకున్నారు. సుమారు 15వేల మంది భక్తులు నదీ స్నానాలు ఆచరించి ఉంటారని అధికారులు అంచనా వేశారు. మాననపాడు మండలం పుల్లూరు గ్రామశివారులోని తుంగభద్ర నది తీరాన ఏర్పాటుచేసిన […]

Read More
పుష్కరాల భక్తులకు బస్సు ఏర్పాటు

పుష్కరాల భక్తులకు బస్సు ఏర్పాటు

సారథి న్యూస్​, అలంపూర్​(మానవపాడు): తుంగభద్ర నది పుష్కరాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం పార్కింగ్ స్థలం నుంచి జోగుళాంబ ఆలయం వరకు ఉచిత బస్సు సర్వీసును అలంపూర్ మున్సిపాలిటీ వారు, జోగుళాంబ ఆలయం ట్రస్ట్ బోర్డు వారు కలిసి సంయుక్తంగా మంగళవారం ఏర్పాటుచేశారు. సెట్వీన్ బస్సు సర్వీసులను మున్సిపల్ చైర్ పర్సన్ మనోరమ వెంకటేష్, టెంపుల్ బోర్డ్ చైర్మన్ రవిప్రకాష్ గౌడ్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఏఎస్పీ కృష్ణ, డీఎస్పీ యాదగిరి, మధుసూదన్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ శేఖర్ […]

Read More
అమ్మవారికి పుష్కర స్నానం

అమ్మవారికి పుష్కర స్నానం

సారథి న్యూస్, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు ఉమ్మడి మండలంలోని పుల్లూరు గ్రామంలో ఏర్పాటుచేసిన పుష్కర ఘాట్ లో బుధవారం ఏకాదశి రోజున ప్రభాత సంకీర్తనం, అమ్మవారి పుష్కరస్నానం కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తున్నామని సర్పంచ్ నారాయణమ్మ, గ్రామస్తులు గిరిధర్ రెడ్డి, పరమేశ్వర్​ రెడ్డి, గజేందర్ రెడ్డి, ఏకాంత్, నీలప్ప తెలిపారు. జ్యోతిర్వాస్తు పీఠాధిపతి మహేశ్వర సిద్ధాంతి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. రెండొందల మంది బ్రాహ్మణులతో ప్రత్యేకపూజలు, అమ్మవారికి పుష్కరస్నానం ఉంటుందని పేర్కొన్నారు. […]

Read More
ఇంటింటా దీపావళి

ఇంటింటా దీపావళి

సారథి న్యూస్​, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలోని అన్ని గ్రామాల్లో దీపావళి పండుగను సంతోషాల మధ్య జరుపుకున్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆస్పత్రి సిబ్బంది ఉత్సవాల్లో పాల్గొన్నారు.

Read More
రైతుల అభ్యున్నతి కోసమే రైతువేదికలు

రైతుల అభ్యున్నతి కోసమే రైతువేదికలు

సారథి న్యూస్, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలోని నారాయణపురం, మద్దూరు, కలుగొట్లలో రైతు వేదిక భవనాలను బుధవారం వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే అబ్రహం ప్రారంభించారు. రైతుల అభ్యున్నతి కోసమే రైతు వేదికలను నిర్మిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 60లక్షల రైతు కుటుంబాలకు మేలు జరుగుతుందన్నారు. రైతు వేదికల వద్ద రైతాంగం సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు. అన్నదాతల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్​పర్సన్ ​సరిత, కలెక్టర్ శృతిఓజా, సర్పంచ్ లక్ష్మీదేవి, […]

Read More
హామీలు నెరవేర్చకపోతే రాజీనామా చేయండి

హామీలు నెరవేర్చకపోతే రాజీనామా చేయండి

సారథి న్యూస్, జోగుళాంబ గద్వాల జిల్లా: రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ ​ఇచ్చిన హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ డిమాండ్​ చేశారు. సోమవారం ఆయన జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు అమరవాయి గ్రామంలో మాజీ ఎంపీపీ జయమ్మ ప్రకాష్ గౌడ్ ​నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలుచేయలేదని మండిపడ్డారు. ఈరోజు తెలంగాణ నీళ్లను ఆంధ్రప్రదేశ్ ఎత్తుకుపోతుంటే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తుంగభద్ర నదికి […]

Read More
రైతు వేదికలు ముస్తాబు

రైతు వేదికలు ముస్తాబు

దసరా రోజున భవనాల ప్రారంభోత్సవం జోగుళాంబ గద్వాల జిల్లాలో నిర్మాణాలు పూర్తి సారథి న్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): వ్యవసాయమే పరమావధిగా భావించే రాష్ట్ర రైతాంగానికి టీఆర్ఎస్ ప్రభుత్వం మరింత చేయూతనందిస్తోంది. రైతుల ఆలోచనలు, అధికారుల సూచనలను పంచుకునేందుకు వీలుగా సీఎం కేసీఆర్​రైతు వేదికల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కనీసం రెండువేల మంది రైతులు ఒకేసారి ప్రభుత్వం ఏర్పాటుచేసే అవగాహన సదస్సుకు హాజరయ్యేలా అన్ని హంగులతో తీర్చిదిద్దుతున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలోని 12 మండలాల్లో సుమారు 97భవనాల నిర్మాణాలు […]

Read More