సామాజిక సారథి, ఐనవోలు : హన్మకొండ జిల్లా ఐనవోలు లోని మల్లికార్జున స్వామి దేవస్థానంలో జనవరి 13 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఐనవోలు దేవస్థానం లో విధులు నిర్వహిస్తున్న 11 నుండి 13 మంది పోలీస్ సిబ్బందికి కరోనా పరీక్షలు చేస్తే పాజిటివ్ గా నిర్ధారణ జరిగిందని వైద్యులు తెలిపారు. థర్డ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో స్థానిక ప్రజలు భక్తులు అప్రమత్తంగా ఉండాలని, భక్తులు మాస్కు ధరించి సామాజిక దూరం పాటించాలని అధికారులు సూచించారు.
సామాజిక సారథి, ఐనవోలు: హన్మకొండ జిల్లా ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా భోగి పండుగను పురస్కరించుకొని స్వామి వారిని మంత్రి సత్యవతి రాథోడ్ , ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్, జెడ్పీ చైర్మన్ సుధీర్ బాబు మేయర్ గుండు సుధారాణి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో నాగేశ్వర్, అర్చుకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి స్వామి వారి ఆశీర్వచనలు అందించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులను మంత్రి సత్యవతి రాథోడ్, […]