సారథి న్యూస్, మక్తల్: షేర్ మార్కెట్ బూచి చూపి జనాన్ని దోచుకున్న షేక్ మహబూబ్ సుభానీ తాను కూడా దోపిడీకి గురయ్యాడు. షేర్‌మార్కెట్ పేరుతో ప్రజల నుంచి రూ.100 కోట్లు వసూలు చేసి ఉడాయించినట్లు డిపాజిట్ దారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏజెంట్లుగా పోలీసులు, విలేకరులు, పలుకుబడి ఉన్న రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లను పెట్టుకున్నాడు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన షేక్ మహబూబ్ సుభానీ ఏడాది క్రితం మక్తల్‌కు వచ్చి స్థిరపడ్డాడు. ప్రజలను […]
తెలుగులో పలుచిత్రాల్లో హాస్యం పండించిన నటుడు కోసూరి వేణుగోపాల్ కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. కోసురు వేణుగోపాల్.. మర్యాద రామన్న, విక్రమార్కుడు, భలేభలే మగాడివోయి వంటి చిత్రాల్లో నటించారు. అయితే ఆయనకు కరోనా సోకడంతో గచ్చిబౌలిలో ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితి విషమించి బుధవారం రాత్రి కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన వేణుగోపాల్ ఎఫ్‌సీఐలో మేనేజర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. సినిమాల మీద ఆసక్తితో ఉద్యోగం చేస్తున్నప్పుడే సినిమాల్లో నటించేవారు. వేణుగోపాల్ […]
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా తూర్పు ఏజెన్సీలో గురువారం సాయంత్రం ఘోరప్రమాదం చోటుచేసుకుంది. చింతూరు సమీపంలోని శబరి నది బ్రిడ్జిని ఢీకొని లాంచీ నీటిలో మునిగిపోయింది. కల్లేరు వరద బాధితులకు నిత్యావసర వస్తువులను అందించేందుకు వెళ్తున్న క్రమంలో ఈ అపశ్రుతి చోటుచేసుకుంది.లాంచీ సిబ్బంది రాంబాబు, సత్తిబాబు, పెంటయ్య నీటిలో మునిగిపోయారు. అక్కడే ఉన్న మరో లాంచీ సిబ్బంది ఇద్దరినీ రక్షించారు. వీరిలో పెంటయ్య కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. గోదావరి లాంచీ సిబ్బంది మాత్రమే ఉండడంతో ఘోర ప్రమాదం తప్పినట్లయింది.