సారథి, చొప్పదండి: భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర శాఖ, జిల్లా శాఖ పిలుపుమేరకు చొప్పదండి మండల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కొలిమికుంట గ్రామంలో భిక్షాటన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేవైఎం మండలాధ్యక్షుడు మొగిలి మహేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో భర్తీచేయాల్సిన రెండు లక్షల ఉద్యోగాలను వెంటనే నింపాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ప్రకటించినట్లు రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు […]
సారథి, చొప్పదండి: తెలంగాణలో గోహత్యలు, గోరక్షకులపై దాడులకు నిరసనగా విశ్వహిందూ పరిషత్(వీహెచ్పీ) చొప్పదండి శాఖ ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వీహెచ్పీ మండలాధ్యక్షుడు పడకంటి కృష్ణ మాట్లాడుతూ.. గోరక్షకుడు సంజయ్ పై హత్యాయత్నం చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గోహత్య నిరోధక చట్టాలను కఠినంగా అమలుచేయాలని, గో అక్రమ రవాణా గ్యాంగ్ ల పై పీడీ యాక్టు నమోదు చేయాలని, […]
సారథి, చొప్పదండి: కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల కేంద్రంలో తెలంగాణ పోరాట వీరుడు దొడ్డి కొమురయ్య వర్ధంతిని బీజేపీ ఓబీసీ మోర్చా మండలాధ్యక్షుడు పెద్ది వీరేశం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ట్యాంక్ బండ్ పై అమరుడి విగ్రహం లేకపోవడం విచాకరమన్నారు. దొడ్డి కొమురయ్య భవనాలు నిర్మిస్తామని హామీ ఇచ్చి ఇప్పటికీ నెరవేరలేదన్నారు. కొమురయ్య విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై […]
సారథి, చొప్పదండి: కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం కొలిమికుంట గ్రామంలో పల్లెప్రగతి పనులను జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య ఆదివారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రహదారుల ఇరువైపులా మొక్కలు నాటాలని సూచించారు. ప్రతి ఆవరణలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి గ్రామస్తులను కోరారు. ప్రతి ఇంటికి ఆరు మొక్కలు ఇవ్వాలని ఆదేశించారు. గ్రామాల్లో పెండింగ్ పనులు ఉండకూడదని సూచించారు. ఆయన వెంట సర్పంచ్ తాళ్లపల్లి సుజాత శ్రీనివాస్ గౌడ్, ఎంపీపీ చిలుక రవిందర్, ఎంపీటీసీ తోట […]
సారథి, చొప్పదండి: ఏబీవీపీ చొప్పదండి శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్ చౌరస్తా వద్ద అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగర కార్యదర్శి గుడెల్లి లక్మిపతి మాట్లాడుతూ.. తెల్లదొరల పాలిట సింహస్వప్నంగా నిలిచారని కొనియాడారు. శక్తివంతమైన మహాసామ్రాజ్యాన్ని గడగడలాడించి, బానిసత్వపు సంకెళ్లు తెంచి, మాతృదేశ విముక్తికి వీరోచితంగా పోరాటం చేశారని గుర్తుచేశారు. కార్యక్రమంలో కార్తిక్, సంకేర్త్, అక్షయ్, చందు, వేణు, రాజు, ఉప్పి, అజయ్, ప్రమోద్ పాల్గొన్నారు.
సారథి, చొప్పదండి: గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కరీంనగర్జిల్లా చొప్పదండి ఎంపీపీ చిలుక రవీందర్ పిలుపునిచ్చారు. మండలంలోని రుక్మాపూర్ గ్రామంలో 4వ విడత పల్లెప్రగతి గ్రామసభ ముద్దసాని చిరంజీవి సర్పంచ్ అధ్యక్షతన గురువారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీపీ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. పది రోజుల కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తూ 10వ రోజు గ్రామ సభలో అభివృద్ధిని చూపించాలని గ్రామపంచాయతీ పాలకవర్గాన్ని ఆదేశించారు. అనంతరం గ్రామ […]
చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ సారథి, చొప్పదండి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న పల్లెప్రగతి ద్వారా గ్రామాలు మరింత అభివృద్ధి సాధిస్తాయని కరీంనగర్జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. గురువారం కాట్నపల్లి గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పచ్చదనం, పారిశుద్ధ్యం పల్లెప్రగతి ముఖ్య లక్ష్యమన్నారు. ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డ్, పల్లె ప్రకృతి వనం, శ్మశానవాటికల నిర్మించుకున్నామని చెప్పారు. తల్లిదండ్రుల చనిపోయి అనాథలుగా మారిన సమత, మమతకు దాతల నుంచి రూ.16లక్షలను వారి బ్యాంకు […]
సారథి, చొప్పదండి: లయన్స్ క్లబ్ ఆఫ్ చొప్పదండి ఆధ్వర్యంలో గురువారం డాక్టర్స్ డే సందర్భంగా చొప్పదండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 8 మంది డాక్టర్లను సన్మానించారు. అనంతరం ఆస్పత్రిలోని 20మంది రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అలాగే పోస్టల్ వర్కర్స్ డే సందర్భంగా చొప్పదండి పోస్ట్ ఆఫీసులోని ముగ్గురు పోస్టల్ వర్కర్లను సత్కరించారు. అనంతరం కరీంనగర్ లోని చార్టర్ అకౌంటెంట్ నాగేశ్వర శర్మ, పావని కిశోర్ ను చార్టర్ అకౌంటెంట్ డే సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఆయా […]