Breaking News

ఆంధ్రప్రదేశ్

‘వైఎస్సార్ చేయూత’ మహిళలకు వరం

‘వైఎస్సార్ చేయూత’ మహిళలకు వరం

సారథి న్యూస్, ఎమ్మిగనూరు: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో వైఎస్సార్ చేయూత పథకాన్ని ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసి, మైనారిటీ అక్కాచెల్లెళ్లకు దశలవారీగా రూ.75వేలు ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు. కార్పొరేషన్లను ప్రక్షాళన చేసి వారి ఆర్థిక ప్రగతికి బాటలు వేస్తామన్నారు. మహిళలకు మొదటి విడత కింద ఒక్కొక్కరికీ రూ.18,750 చొప్పున మొత్తం 9,949 మంది లబ్ధిదారులకు రూ.18.65కోట్ల మెగా చెక్కును లబ్ధిదారులకు […]

Read More
అక్కాచెల్లెళ్లకు వైఎస్సార్​చేయూత

అక్కాచెల్లెళ్లకు వైఎస్సార్ ​చేయూత

సారథి న్యూస్, కర్నూలు: రాష్ట్రంలో సుమారు 23లక్షల మంది అక్కాచెల్లెళ్లకు నాలుగేళ్లలో రూ.17వేల కోట్ల ఆర్థికసాయం వైఎస్సార్​చేయూత పథకం ద్వారా అందుతుందని సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్, ప్రభుత్వ ఎక్స్ అఫీషియో ప్రత్యేక కార్యదర్శి, కోవిడ్-19 రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎం ఈ పథకాన్ని బుధవారం ప్రారంభించనున్నారు. 45 ఏళ్ల నుంచి 60 […]

Read More
కృష్ణా నీటి పంపకాల్లో ప్రతికూలత ఉండదు

కృష్ణా నీటి పంపకాల్లో ప్రతికూలత ఉండదు

అమరావతి: కృష్ణానది నీటి పంపకాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​రాష్ట్రాల మధ్య ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండబోదని ఏపీ సీఎం వైఎస్ ​జగన్​మోహన్​రెడ్డి స్పష్టంచేశారు. కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్‌ రాసిన లేఖపై మంగళవారం ప్రత్యుత్తరమిచ్చారు. కేంద్రం రాసిన లేఖలో ప్రస్తావించిన ప్రాజెక్టులు కొత్తవి కాదని వివరించారు. మొదట అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో కృష్ణా జలవివాదాల ట్రిబ్యునల్‌ ఇచ్చిన నీటి వాటాకు బద్ధులై ఉంటామని తెలంగాణ చెప్పిందని గుర్తుచేశారు. రెండో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశానికి సంబంధించి అజెండా ఖరారు చేశామని వివరించారు. […]

Read More
ఏపీ ప్రభుత్వం కెలికి కయ్యం పెట్టుకుంటున్నది

ఏపీ ప్రభుత్వం కెలికి కయ్యం పెట్టుకుంటున్నది

నీటి వాటా ప్రకారమే తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మిస్తున్నం కేంద్రం, ఏపీ ప్రభుత్వానికి సమాధానం చెబుతం తెలంగాణ ప్రాజెక్టులపై ఫిర్యాదులు చేయడం సరికాదు అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో వాస్తవాలు వెల్లడిస్తాం జలవనరులశాఖ అధికారులతో సీఎం కె.చంద్రశేఖర్​రావు సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్థం పర్థం లేని, నిరాధారమైన, అనవసర రాద్ధాంతం చేస్తోందని, కేంద్ర ప్రభుత్వం కూడా తప్పుడు విధానం అవలంభిస్తోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో జరిగే […]

Read More
ఏపీలో 7,665 కరోనా కేసులు

ఏపీలో 7,665 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం 7,665 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా 80 మంది మృతిచెందారు. మృతుల సంఖ్య 2,116కు చేరింది. ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 2,35,525కు చేరింది. గత 24 గంటల్లో 46,699 కరోనా టెస్టులు చేశారు. కొత్తగా 6,924 మంది వైరస్‌ బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఆంధ్రప్రదేశ్​లో ప్రస్తుతం కోలుకున్నవారి మొత్తం సంఖ్య 1,45,636కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 87,112 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 25,34,304 కరోనా నిర్ధారణ పరీక్షలు […]

Read More
శ్రమించారు.. సాధించారు

శ్రమించారు.. సాధించారు

తెలుగు రాష్ట్రాల నుంచి పలువురికి టాప్​ ​ర్యాంక్​లు పాలమూరు బిడ్డకు 272వ ర్యాంకు, 135వ ర్యాంక్ సాధించిన కర్నూలు యువకుడు కానిస్టేబుల్​ కుమారుడికి 516వ ర్యాంకు సారథి న్యూస్, నారాయణపేట, కర్నూలు, పెద్దశంకరంపేట: యూపీఎస్సీ నిర్వహించిన 2019 సివిల్‌ సర్వీసెస్‌ ఫలితాల్లో తెలుగు తేజాలు విశేషప్రతిభ చూపారు. ఆలిండియా స్థాయిలో ఉత్తమ ర్యాంకులతో తాము ఆశించిన గోల్​సాధించారు. ఐఏఎస్​గా ఎంపికై తల్లిదండ్రుల కలలను సాకారం చేశారు. కరీంనగర్ ఎన్‌సీసీ తొమ్మిదో బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ అజయ్ […]

Read More
3 రాజధానుల బిల్లుపై హైకోర్టు స్టే

3 రాజధానుల బిల్లుపై హైకోర్టు స్టే

అమరావతి: మూడు రాజధానుల బిల్లుపై ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈనెల 14 వరకూ రాజధానుల బిల్లుపై హైకోర్టు స్టే విధించింది. రాజధాని విభజన పిటిషన్లపై హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. బిల్లులు రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోర్టులో వాదించారు. పిటిషన్ల తరఫున శ్యామ్ దివాన్, ఉన్నవ మురళీధర్ వాదనలు వినిపించారు. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కౌంటర్​దాఖలుకు 10 రోజుల సమయం కోరారు. విచారణను ఈనెల 14కు […]

Read More
ఏపీలో మహిళల కోసం ఎన్నో పథకాలు

ఏపీలో మహిళల కోసం ఎన్నో పథకాలు

సారథి న్యూస్, కర్నూలు: రక్షాబంధన్ ​సందర్భంగా సోమవారం మాజీ ఎమ్మెల్యే ఎస్​వీ మోహన్ రెడ్డికి వైఎస్సార్​సీపీ మహిళా నేతలు రాఖీలు కట్టి ఆయన మిఠాయిలు తినిపించారు. రక్షాబంధన్ సోదరిసోదరుల బంధాన్ని తెలియజేస్తుందన్నారు. సీఎం వైఎస్​జగన్​మోహన్​రెడ్డి మహిళలకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో భారతి, సుమలత, లలితమ్మ పాల్గొన్నారు.

Read More