భారీగా పోలీసుల మోహరింపు సామాజిక సారథి, కరీంనగర్: జీవోనం.317ను సవరించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు సంఘీభావంగా కరీంనగర్‌లో ఆదివారం రాత్రి ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన క్యాంపు కార్యాలయం వద్ద జాగరణ దీక్ష చేపట్టారు. కొవిడ్ ఆంక్షల నేపథ్యంలో దీక్షకు అనుమతి లేకపోవడంతో పోలీసులు భారీగా మోహరించారు. పోలీసుల వలయాన్ని ఛేదించుకొని ఎంపీ బండి సంజయ్ బైక్ పై క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. […]
జూబ్లీహిల్స్‌లోని ఇంటివద్ద ఉద్రిక్తత ఉదయం నుంచే మోహరించిన పోలీసులు ఎర్రవెల్లి వెళ్లేందుకు ప్రయత్నించగా అదుపులోకి జగిత్యాలలో జీవన్ రెడ్డి, శ్రీధర్‌బాబు కూడా అరెస్ట్ సామాజికసారథి, హైదరాబాద్: తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎర్రవెల్లికి వెళ్లకుండా జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటివద్దకు ఉదయం నుంచే పోలీసులు చేరుకుని నిర్బంధించారు. దీంతో కాంగ్రెస్కార్యకర్తలు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకుని సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ కు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. సోమవారం ఎర్రవల్లిలో […]
లక్నో: దళిత యువతిపై లైంగికదాడి, హత్యతో యూపీలో హత్రాస్ ప్రాంతం అట్టుడుకుతోంది. మరోవైపు దేశవ్యాప్తంగా పలు చోట్ల దళితసంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. అయితే గురువారం బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు హత్రాస్ వెళ్లన కాంగ్రెస్ యువనేత రాహుల్, ప్రియాంకా గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాహుల్ అరెస్ట్‌తో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార‍్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు.శాంతియుతంగా హత్రాస్ వెళ్తున్న తమపట్ల పోలీసులు అమానుషంగా వ్యవహరించారని […]
అనంతపురం: టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి మళ్లీ అరెస్టయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్రమ వాహనాల కేసులో ఆయన కొంతకాలం క్రితం అరెస్టయిన జేసీ.. కోర్టు బెయిల్ ఇవ్వడంతో గురువారం జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా కడప సెంట్రల్ జైలు వద్ద జేసీ అనుచరులు రెచ్చిపోయారు. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించి భారీగా జైలు వద్దకు చేరుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఓ సీఐ దేవేంద్రపై జేసీ ప్రభాకర్‌రెడ్డి దురుసుగా ప్రవర్తించాడు. […]