అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. శనివారం కొత్తగా 8,732 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 2,81,817కు చేరింది. తాజాగా 87మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటి దాకా మృతుల సంఖ్య 2,562కు చేరింది. మొత్తం 53,712 నమూనాలను పరీక్షించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 88,138గా నమోదైంది. ఇప్పటివరకు 1,91,117 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఈ మేరకు ఏపీ వైద్యారోగ్యశాఖ హెల్త్‌బులెటిన్‌ను విడుదల చేసింది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో శుక్రవారం 8,943 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,70,190 కు చేరింది. తాజాగా మహమ్మారి బారినపడి 97 మంది మృతిచెందారు. ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 2,475కు చేరింది. వ్యాధి నుంచి కోలుకుని తాజాగా 9,779 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు వ్యాధి నయం అయినవారు 1,80,703 మంది ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 89,907 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 27,58,485 కరోనా పరీక్షలు చేశారు. […]
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గురువారం కొత్తగా 9,996 కరోనా కేసులు నమోదయ్యాయి. వ్యాధిబారిన పడి తాజాగా 82 మంది మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 2,378కు చేరింది. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు 2,64,142కు చేరాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 90,840కు చేరింది. వ్యాధిబారిన పడి 24 గంటల్లో 9,499 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 1,70,924 మంది కోలుకున్నారు. ఇక వ్యాధి తీవ్రతను జిల్లాల వారీగా పరిశీలిస్తే.. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1,504 […]
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం 9,597 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారినపడి తాజాగా 93 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 2,296కు చేరింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,54,146కు చేరింది. ఈ మేరకు ఏపీ వైద్యారోగ్యశాఖ హెల్త్‌బులెటిన్‌ను విడుదల చేసింది. గత 24 గంటల్లో 57,148 నమూనాలు పరీక్షించారు. తాజాగా వ్యాధిబారిన నుంచి 6,676 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 1,61,425కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం […]
అమరావతి: ప్రొబేషనర్(2018 బ్యాచ్) ఐఏఎస్‌లను సబ్ కలెక్టర్‌లుగా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 12 మందిని సబ్ కలెక్టర్‌లుగా నియమించింది. చిత్తూరు డీఆర్డీఏ పీవోగా ఎంఎస్ మురళి నియమితులయ్యారు. అలాగే ప్రస్తుతం రాజంపేట, నరసరావుపేట, కందుకూరు, నూజివీడు, నంద్యాల, టెక్కలి, నర్సీపట్నంలో కొనసాగుతున్న డిప్యూటీ కలెక్టర్‌లను జీఏడీకు రిపోర్ట్ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. సబ్ కలెక్టర్లుగా నియమితులైన వారి వివరాలు పృథ్వీ తేజ్ ఇమ్మడి – సబ్ కలెక్టర్ కడప (కడప), ప్రతిష్ఠ […]
అమరావతి: మూడు రాజధానుల బిల్లుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈనెల 14 వరకూ రాజధానుల బిల్లుపై హైకోర్టు స్టే విధించింది. రాజధాని విభజన పిటిషన్లపై హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. బిల్లులు రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోర్టులో వాదించారు. పిటిషన్ల తరఫున శ్యామ్ దివాన్, ఉన్నవ మురళీధర్ వాదనలు వినిపించారు. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కౌంటర్దాఖలుకు 10 రోజుల సమయం కోరారు. విచారణను ఈనెల 14కు […]
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉపరితల ఆవర్తన ద్రోణీతో పాటు ఉత్తర బంగాళాఖాతంలో ఆగస్టు 4న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండడంతో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర కోస్తాంద్రా, యానాం తదితర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ తెలిపింది.
అమరావతి: సీఆర్డీఏ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అధారిటీ(ఏఎంఆర్‌డీఏ) కమిషనర్‌గా పి.లక్ష్మీనరసింహంను నియమించారు. ఈ మేరకు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన సీఆర్డీఏ కమిషనర్‌గా కొనసాగుతున్నారు.