Breaking News

వరంగల్

కరోనా లక్షణాలతో యువతి మృతి

సారథి న్యూస్, వరంగల్ రూరల్: కరీంనగర్​ జిల్లా చెన్నరావుపేట మండలం పాపయ్యపేటకు చెందిన ఓ యువతి కరోనా లక్షణాలతో మృతిచెందింది. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న సదురు యువతిని గురువారం తల్లిదండ్రలు వరంగల్​లోని ఎంజీఎం ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె నుంచి శాంపిల్స్​ సేకరించే లోపే మృతిచెందిందని వైద్యులు తెలిపారు. కాగా పాపయ్యపేటలో యువతి అంత్యక్రియల్లో పాల్గొన్నవారిని హోంక్వారంటైన్​లో ఉంచారు. గ్రామస్థులంతా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని అధికారులు కోరుతున్నారు.

Read More

పనుల్లో వేగం పెంచండి

సారథిన్యూస్​, వరంగల్ అర్బన్: సకాలంలో పనులు పూర్తిచేయకపోతే ఉపేక్షించేది లేదని వరంగల్​ అర్బన్​ కలెక్టర్​ రాజీవ్​గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. జిల్లా లో వైకుంఠ దామాలు, కంపోస్టు ( సెగ్రిగేశాన్) షెడ్లు నిర్మాణా పనులను జూలై చివరి వరకు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఆరో విడత హరిత హరంలో భాగంగా హసన్ పర్తి మండలం పెంబర్తి గ్రామ శివారు ఆయన మాట్లాడారు.

Read More
వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలి

వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలి

సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వాజేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని కొంగాల గ్రామంలో మంగళవారం వైద్యశిబిరం నిర్వహించారు. కాలానుగుణంగా వచ్చే వ్యాధులు, ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా గురించి అవగాహన కల్పిస్తూ డాక్టర్ యమున సూచనలు చేశారు. ప్రతిఒక్కరూ భౌతిక దూరం పాటించాలని, మాస్క్ లు కట్టుకోవడంతో పాటు చేతులను ఎప్పటికప్పుడు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు.

Read More

ముమ్మరంగా హరితహారం

  • June 30, 2020
  • Comments Off on ముమ్మరంగా హరితహారం

సారథిన్యూస్​, మహబూబాబాద్​: హరితహారం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరంగా సాగుతున్నది. ఆరోవిడుత హరితహారంలో భాగంగా మహబూబాబాద్​ జిల్లా పోలీస్​ కార్యాలయంలో ఎస్పీ కోటిరెడ్డి మొక్కలు నాటారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో హరితహారం నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ప్రభాకర్, డీఎస్పీ నరేశ్​కుమార్, ఏఆర్ డీఎస్పీ జనార్దన్​రెడ్డి, ఆర్ఐలు నరసయ్య, పూర్ణచందర్, సురేశ్​, లాల్ బాబు, ఐటీ కోర్ ఇన్స్​స్పెక్టర్​ రాజయ్య, సీఐ సాగర్, సీసీఎస్​ సీఐ ఏ వెంకట్రావు, ఆర్మూడ్ రిజర్వ్ పోలీస్ సిబ్బంది, స్పెషల్ […]

Read More

చెట్లే ప్రాణాధారం

సారథి న్యూస్,ములుగు: చెట్లే మానవజాతికి ప్రాణాధారమని రాష్ట్ర మహిళా​​, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్​ పేర్కొన్నారు. ఆరోవిడుత హరితహారంలో భాగంగా శుక్రవారం ఆమె ములుగు జిల్లా అటవీశాఖ కార్యాలయంలో మొక్కలు నాటారు. ములుగు మండలం జాకారం, బండారుపల్లి, వెంకటాపూర్ మండలంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లడుతూ.. అటవీ సంపదను పెంచేందుకే సీఎం కేసీఆర్​ హరితహారం కార్యక్రమాన్ని తలపెట్టారని చెప్పారు. కార్యక్రమంలో ములుగు జెడ్పీ చైర్మన్​ కుసుమ జగదీశ్, కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఎమ్మెల్యే […]

Read More

పేదలకు వరం సీఎం రిలీఫ్ ఫండ్

సారథి న్యూస్, రామాయంపేట: సీఎం రిలీఫ్​ ఫండ్​ పేదలకు వరం లాంటిదని నిజాంపేట ఎంపీపీ సిద్దరాములు పేర్కొన్నారు. మెదక్​ జిల్లా నిజాంపేట మండలం తిప్పనగుళ్ల గ్రామానికి చెందిన నీలం నర్సయ్య ఇటీవల అనారోగ్యానికి గురికాగా అతడికి రూ. 60 వేల సీఎం రిలీఫ్​ఫండ్​ చెక్కును అందించారు. కార్యక్రమంలో తహసీల్దార్​ జయరాం, ఎంపీటీసీ రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read More

రెవెన్యూశాఖలో భారీగా అక్రమాలు

సారథిన్యూస్​, ఖమ్మం: రెవెన్యూశాఖ అధికారులు భారీగా అక్రమాలకు పాల్పడుతున్నారని గోండ్వానా సంక్షేమపరిషత్​ నాయకుడు విద్యాసాగర్​ ఆరోపించారు. గురువారం ఆయన ఖమ్మం జిల్లా కోయవీరాపురంలో పర్యటించి ప్రజల భూసంబంధిత సమస్యలు తెలుసుకున్నారు. ఆదివాసి గ్రామమైన కోయవీరాపురం రెవెన్యూ అధికారుల అక్రమాలతో కొట్టుమిట్టాడుతున్నదని చెప్పారు. ఆదివాసులు సాగుచేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వకుండా రెవెన్యూ అధికారులు వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. రెవెన్యూ అధికారులు చట్టాన్ని అమలుచేయడం లేదన్నారు. ఆయనవెంటన గిరిజనసంఘం నాయకులు చాప శాంతమ్మ, సోడి రాంబాయి, పీర్ల చెన్నమ్మ తదితరులు […]

Read More

సబ్​రిజిస్ట్రార్​ పెద్దమనసు

సారథి న్యూస్, ములుగు: ములుగు జిల్లా కేంద్రంలో సబ్​రిజిస్ట్రార్​కు పనిచేస్తున్న తస్లీమా.. నిబద్ధతతో విధులు నిర్వర్తించడమే కాక తన వద్దకు వచ్చిన నిరుపేదలకు తోచిన సాయం చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాన్ని పోషించుకోలేక ఇబ్బందులు పడుతున్న నేపాల్​కు చెందిన ధీరజ్​ జోషి అనే గుర్ఖాకు గోధుమపిండి, నిత్యావసరసరుకులు పంపిణీ చేశారు. అనంతరం పందికుంట గ్రామానికి చెందిన అనిత అనే మహిళకు 25 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వారి పిల్లల చదువులకు సంబంధించిన బాధ్యత […]

Read More