ఢిల్లీ: ఢిల్లీ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నది. గత 24 గంటల్లో కేవలం 1,211 కొత్తకేసులు మాత్రమే నమోదయ్యాయి. జూన్ 9 నుంచి ఇంత తక్కువ కేసులు నమోదవడం ఇదే తొలిసారి. కాగా ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో 1,22,793 మంది కరోనా బారిన పడ్డారు. 3,628 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 31 మంది మృతిచెందారు.
జైపూర్: రాజస్థాన్ రాజకీయ సంక్షోభంపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఆడియోలో ఉన్న గొంతు అతనిదే అని కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ అన్నారు. ఈ సందర్భంగా బీజేపీకి ఐదు ప్రశ్నలు సందించారు. ‘గజేంద్ర సింగ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. తన గురించి తెలిసిన వాళ్లే అది ఆయన వాయిస్ అని గుర్తుపట్టారు. అలాంటిది ఆయన ఆ పదవిలో ఎలా కొనసాగుతున్నారు? […]
జైపూర్: రాజస్థాన్‌లో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలెట్‌తో పాటు 18 మందికాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో అసెంబ్లీలో కాంగ్రెస్ బలం పడిపోయిన విషయం తెలిసిందే. వచ్చేవారం బలపరీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఆదివారం ఉదయం అశోక్ గెహ్లాట్ గవర్నర్‌ను కలిశారని తెలుస్తోంది. బీటీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు అశోక్ గెహ్లాట్‌కు మద్దతు ఇవ్వడంతో గెహ్లాట్ గవర్నర్‌ను కలిశారని చెప్పారు. సీఎం గెహ్లాట్ నివాసంలో జరిగిన సీఎల్పీ భేటీ సందర్భంగా కాంగ్రెస్‌కు తమ మద్దతు ఇస్తున్నట్లు […]
న్యూఢిల్లీ: మన దేశంలో అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్ నిర్వహించేందుకు వలంటీర్లు కావాలని ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ప్రకటించింది. సోమవారం నుంచి క్లినికల్ ట్రయల్స్ షురూ చేసేందుకు పర్మిషన్ వచ్చిన నేపథ్యంలో ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు నమోదు చేసుకోవాలని చెప్పింది. క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు ఎయిస్ ఎథిక్స్ కమిటీ ఒప్పుకోవడంతో ఈ ప్రకటన రిలీజ్ చేశారు. మొదటి ఫేజ్‌లో 375 మందిపై ఈ వ్యాక్సిన్ ప్రయోగించాల్సి ఉండగా, […]
న్యూఢిల్లీ: చైనాను దెబ్బతీసేందుకు మన సైన్యం సరికొత్త వ్యూహంతో ముందుకెళ్తోంది. ఈ మేరకు ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ) కొత్త భాషను నేర్చుకుంటుంది. ఐటీబీపీలోని 90వేల మంది చైనాలో ఎక్కువగా మాట్లాడే మాండరిన్ భాష నేర్చుకుంటున్నారు. ఇందు కోసం ప్రత్యేక కోర్సును డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. లద్దాఖ్‌లో ఇటీవల జరిగిన గొడవల నేపథ్యంలో ఐటీబీపీ తమ జవాన్ల కోసం మాండరిన్ కోర్సును నేర్పిస్తున్నారు. మన సైనికులు మాండరిన్ భాషను నేర్చుకుంటే చైనా సైనికులతో నేరుగా మాట్లాడేందుకు వీలుంటుందని, […]
సావిత్రి ఫేమ్ నాగ్అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ ఓ చిత్రంలో నటించనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని వైజయంతి సంస్థ నిర్మిస్తుంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ దీపికా పదుకొణే నటించనున్నది. ఈ విషయాన్ని స్వయంగా చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ ట్విట్టర్లో తెలియజేశాడు. టాలీవుడ్లో దీపికా తొలిసారి నటిస్తున్నారు. ‘రాజు స్థాయికి సరిపోయే రాణిని తేవాలి కదా, అందుకే చాలా ఆలోచించి దీపికాను ఎంపికచేశాం. ఇక పిచ్చెక్కిద్దాం’ అంటూ నాగ్అశ్విన్ ట్వీట్ చేశారు. ఈ […]
న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో అరుదైన ఘనత సాధించారు. మోదీ దేశ వ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా లక్షల సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో ప్రధాని మోదీ చురుకుగా ఉంటూ రాజకీయ, పాలనాపరమైన విషయాలను ప్రజలతో పంచుకుంటారు. తాజాగా ప్రధాని మోదీ తన ట్విటర్ ఖాతాలో 60 మిలియన్ల (6కోట్లు) ఫాలోవర్స్ మైలు రాయిని చేరుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న రాజకీయ నాయకుల్లో మోదీ […]
జంషడ్‌పూర్: ప్రతిభకు పేదరికం అడ్డుకాదని ఓ విద్యార్థిని నిరూపించింది. జార్ఘండ్ రాష్ట్రం జంషడ్పర్కు చెందిన నందితా హరిపాల్ సీబీఎస్ఈ 12 వతరగతిలో ని ఆర్ట్స్ విభాగంలో 83.8 శాతం మార్కులు సాధించి టాపర్‌గా నిలిచింది. నందిత తండ్రి టైలర్‌గా జీవనం సాగిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వారి కుటుంబం పేదరికంలో మగ్గుతున్నది. కూతురు నందిత జంషడ్‌పూర్ ఉమెన్స్ కళాశాలలో విద్యనభ్యసించింది. ‘నేను టాపర్‌గా నిలుస్తానని కలలో కూడా ఊహించలేదు. ఫలితాలు చూసి నాతోపాటు కుటుంబసభ్యులు ఎంతో సంతోషించారు. నేను […]