Breaking News

జాతీయం

కొత్తకేసులు 63వేలు

ఢిల్లీ: మనదేశంలో కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. గత 24 గంటల్లో 63,490 కొత్తకేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 25 లక్షల 89 వేల 682 చేరుకుంది. మరోవైపు ఇప్పటివరకు కరోనాతో 49,980 మంది ప్రాణాలు కొల్పోయారు. 18,62,258 మంది కరోనా నుంచి కోలుకోగా.. 6,77,444 మంది వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. కాగా కరోనా, మరణాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. గత 24 గంటల్లో 944 మంది ప్రాణాలు కోల్పోయారు.

Read More
ఉప్పొంగిన సరళా తరంగం

ఉప్పొంగిన సరళా తరంగం

వనపర్తి సంస్థానాధీశుల కాలంలో నిర్మాణం ఆసియా ఖండంలోనే మొదటి ప్రాజెక్టు సారథి న్యూస్, వనపర్తి: ఇటీవల కురుస్తున్న భారీవర్షాలకు వనపర్తి జిల్లాలో వనపర్తి సంస్థానాధీశుల కాలం నాటి సరళాసాగర్​ సైఫన్లు దూకాయి. పరిసరాల ప్రాంతాలతో పాటు సరళాసాగర్​ ఎత్తిపోతల, కల్వకుర్తి లిఫ్ట్​ఇరిగేషన్​పథకాల నుంచి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఆటోమెటిక్​సైఫన్​సిస్టం నుంచి కృష్ణాజలాలు బిరబిరా పరుగులు తీస్తున్నాయి. సరళాసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 22 అడుగులు. ఆసియా ఖండంలోనే మొట్టమొదటి ప్రాజెక్టు ఇది.ఇదీ సైఫన్​ సిస్టంఆటోమేటిక్‌ […]

Read More
రష్యాలో వ్యాక్సిన్​ ఉత్పత్తి ప్రారంభం

రష్యాలో వ్యాక్సిన్​ ఉత్పత్తి ప్రారంభం

మాస్కో: ఇప్పటికే కరోనాకు వ్యాక్సిన్​ కనిపెట్టినట్టు ప్రకటించిన రష్యా.. వ్యాక్సిన్​ ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ మేరకు రష్యాకు చెందిన ఓ మీడియా సంస్థ వార్తాకథనాలను వెలువరించింది. మాస్కోలోని గమలేయా ఇన్​స్టిట్యూట్​ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్​ను ఆగస్టు చివరకు వరకు అందుబాటులోకి తీసుకొస్తామని రష్యా ప్రకటించింది. ఈ టీకాపై పలువురు శాస్త్రవేత్తలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయినప్పటికీ రష్యా మాత్రం వాక్సిన్​ తయారీలో నిమగ్నమైంది. కాగా రష్యా ప్రకటించిన వ్యాక్సిన్​ కోసం 20 దేశాలు ముందస్తు ఆర్డర్లు […]

Read More

మనశక్తిని ప్రపంచానికి చాటుదాం

ఢిల్లీ: మనదేశ శక్తిని ప్రపంచానికి ప్రపంచానికి చాటాలని ప్రధాని నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. 74 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానిమోడీ శనివారం ఢిల్లీలోని ఎర్రకోటపై ఏర్పాటుచేసిన మువ్వన్నెల జెండాను ఎగరవేశారు. అనంతరం త్రివిధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ‘ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారిని ఎదుర్కొంటుంది. మనం కూడా కరోనాతో రాజీలేని పోరాటం చేస్తున్నాం. కరోనాపై పోరాటంలో శక్తివంచన లేకుండా కృషిచేస్తున్న కరోనా వారియర్స్​కు (డాక్టర్లు, నర్సులు, వైద్యసిబ్బంది, […]

Read More
లవ్‌ అగర్వాల్‌కు కరోనా

లవ్‌ అగర్వాల్‌కు కరోనా

న్యూఢిల్లీ: కరోనా కోరలు చాచిన సమయం. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు.. నివారణ మార్గాలను ఎప్పటికప్పుడు మీడియా ద్వారా దేశప్రజలకు వెల్లడించేవారు. ఆయనే కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌. ప్రస్తుతం ఆయన కూడా కరోనా బారినపడ్డారు. వైద్యపరీక్షల అనంతరం తనకు కరోనా పాజిటివ్​గా తేలిందని ట్విటర్ ​వేదికగా వెల్లడించారు. నిబంధనల ప్రకారం తాను ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నట్టు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారంతా స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని కోరారు. కరోనాతో లాక్‌డౌన్‌ విధించిన […]

Read More
అశోక్​ గెహ్లాట్​ నెగ్గాడు

బలపరీక్షలో నెగ్గిన అశోక్​ గెహ్లాట్

జైపూర్​: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్​ బలపరీక్షలో నెగ్గారు. శుక్రవారం నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో తొలిరోజే విశ్వాస పరీక్ష పెట్టారు. బీజేపీ అవిశ్వాస తీర్మానం పెట్టక ముందే అశోక్ గెహ్లాట్​ తనంతట తాను విశ్వాస పరీక్షకు సిద్ధమయ్యారు. ఇందులో ఆయన నెగ్గారు. అనంతరం అసెంబ్లీ సమావేశాలను స్పీకర్​ ఈ నెల 21కి వాయిదా వేశారు. సచిన్ పైలట్ వర్గం పూర్తిగా సహకరించడంతోనే అశోక్ గెహ్లాట్​ విశ్వాస పరీక్షకు సిద్ధమయ్యారు.

Read More
కరోనా కొత్తకేసులు

మొత్తం కేసులు @ 24 లక్షలు

న్యూఢిల్లీ: మనదేశంలో కరోనా ఉగ్రరూపం దాల్చుతున్నది. ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 24,61,190 కు చేరుకున్నది. గత 24 గంటల్లోనే 64,553 కొత్తకేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపిన లెక్కల ప్రకారం.. ఇప్పటివరకు 48,040 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. 17,51,555 మంది కరోనానుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 6,61,595 మంది వివిధ దవాఖానల్లో చికిత్సపొందుతున్నారు.

Read More
చికెన్​ వింగ్స్​లో కరోనా ఆనవాళ్లు

చికెన్​వింగ్స్​లో కరోనా ఆనవాళ్లు

బీజింగ్​: చైనాలో మరోసారి కరోనా కలకలం రేపింది. గ్వాంగ్డాండ్​ ప్రావిన్స్​లోని షెన్​జెన్​ నగరానికి దిగుమతి అయిన నిలువచేసిన చికెన్​ వింగ్స్​లో కరోనా వైరస్​ ఆనవాళ్లు కనిపించడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఈ మాంసంతో కరోనా మరోసారి వ్యాప్తిస్తుందేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. బ్రెజిల్​లోని శాంటా కటారినా రాష్ట్రంలోని అరోరా ఎలిమెంట్​లోని ఓ ప్లాంట్​ నుంచి చికెన్​ వింగ్స్​.. షెన్​జెన్​కు దిగుమతి అయినట్టు సమాచారం. దీంతో దిగుమతి చేసుకున్న ఆహారపదార్థాల కొనుగోలు విషయంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని అక్కడి […]

Read More