Breaking News

ఆధ్యాత్మికం

సర్వభూపాల వాహనంపై శ్రీనివాసుడు

సర్వభూపాల వాహనంపై శ్రీనివాసుడు

తిరుపతి: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఎనిమిదో రోజు ఉదయం రథోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. అయితే ఈ ఏడాది కరోనా కారణంగా ఆలయం లోపలే వేడుకలు జరుగుతున్నందున రథోత్సవం స్థానంలో సర్వభూపాల వాహనాన్ని ఏర్పాటు చేశారు. అధికారం దుర్వినియోగం కాకుండా ఉండాలంటే వారు భగవత్‌ సేవా పరులు కావాలి. ఈ దివ్యమైన సందేశాన్ని సర్వభూపాల వాహన సేవ ఇస్తోంది.

Read More
నవరాత్రి మహోత్సవం

నవరాత్రి మహోత్సవం

మొదటి రోజు శైలపుత్రికగా జోగుళాంబ అమ్మవారు అక్టోబర్​ 25వ తేదీ వరకు వేడుకలు సారథి న్యూస్, అలంపూర్‌, మెదక్​: తెలంగాణ రాష్ట్రంలో ఏకైక శక్తిపీఠమైన అలంపూర్​ జోగుళాంబ అమ్మవారి ఆలయంలో శనివారం దేవీశరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కోవిడ్​19 నిబంధనల మేరకు ఆర్భాటాలకు దూరంగా సంప్రదాయాలు ఉట్టిపడేలా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి ప్రేమ్ కుమార్ తెలిపారు. ప్రతిరోజు జోగుళాంబ అమ్మవారిని నవదుర్గాల్లో ఒకరిగా అలంకరించి ఆరాధించడం ఆనవాయితీ. మొదటి రోజు కావడంతో జోగుళాంబ అమ్మవారు […]

Read More
మన్నెంకొండలో వైభవంగా తిరుచ్చిసేవ

మన్యంకొండలో వైభవంగా తిరుచ్చిసేవ

సారథి న్యూస్,​ దేవరకద్ర: మహబూబ్​నగర్ జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన మన్యంకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం స్వామివారి తిరుచ్చిసేవా కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ప్రతి శనివారం రాత్రి స్వామివారి తిరుచ్చి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆలయపాలకవర్గం వెల్లడించింది. కరోనా మహమ్మారి కారణంగా భక్తులు హాజరుకాలేదు. వేదపండితులు, పురోహితుల ఆధ్వర్యంలోనే ఈ ఘట్టం నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ మధుసూదన్ కుమార్, ఈవో శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్​ నిత్యానందచారి, ప్రధాన పూజారులు […]

Read More
ఘనంగా పల్లకీ సేవ

ఘనంగా పల్లకీ సేవ

సారథి న్యూస్, శ్రీశైలం: లోకకల్యాణం కోసం శ్రీశైలం దేవస్థానం వారు ఆదివారం రాత్రి మల్లికార్జునస్వామి, భ్రమరాంబ అమ్మవారికి పల్లకీ ఉత్సవం జరిపించారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవాసంకల్పాన్ని పఠించారు. తర్వాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ జరిపించారు. అనంతరం శాస్త్రోక్తంగా షోడశోపచారపూజలు జరిపించారు. తగిన జాగ్రత్తలతో భౌతికదూరం పాటిస్తూ పల్లకీ ఉత్సవాన్ని నిర్వహించామని ఈవో రామారావు తెలిపారు.

Read More
కుమారస్వామికి అభిషేకం

కుమారస్వామికి అభిషేకం

సారథి న్యూస్​, శ్రీశైలం(కర్నూలు): లోకకల్యాణం కోసం శ్రీశైలం దేవస్థానం ఆలయ ప్రాంగణంలోని సుబ్రహ్మణ్యస్వామి (కుమారస్వామి) వారికి విశేషపూజలు నిర్వహించారు. అభిషేకం, సుబ్రహ్మణ్య అష్టోత్తరం చేసిన అనంతరం సుబ్రహ్మణ్య స్తోత్రం పారాయణలు చేశారు. స్వామివారికి పంచామృతాలైన పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరినీళ్లు, పండ్ల రసాలతో విశేష అభిషేక కార్యక్రమం నిర్వహించారు. అర్చక స్వాములు భౌతిక దూరాన్ని పాటిస్తూ విశేషార్చనలు జరిపించారని ఈవో రామారావు తెలిపారు.

Read More
నందీశ్వర స్వామికి విశేషపూజలు

నందీశ్వర స్వామికి విశేష పూజలు

సారథి న్యూస్​, శ్రీశైలం(కర్నూలు): లోక కల్యాణం కోసం దేవస్థానం మంగళవారం ఆలయ ప్రాంగణంలో నందీశ్వరస్వామివారికి (శనగల బసవన్న స్వామివారికి) విశేషార్చనలు జరిపించింది. నందీశ్వరస్వామికి శాస్త్రోక్తంగా పంచామృతాలు, , ద్రాక్ష, బత్తాయి, అరటి మొదలైన ఫలోదకాలతో హరిద్రోదకం, కుంకుమోదకం, గంధోదకం, భస్మోదకం, రుద్రాక్షోదకం బిల్వోదకం, పుష్పోదకం, సువర్ణోదకం, ల్లికాగుండంలోని శుద్ధజలంతో అభిషేకం నిర్వహించారు. తర్వాత నందీశ్వరస్వామి వారికి నూతనవస్త్ర సమర్పణ, విశేషపుష్పార్చనలు చేశారు. తర్వాత నానబెట్టిన శనగలు నందీశ్వర స్వామికి సమర్పించారు.

Read More
బయలు వీరభద్రస్వామికి అభిషేకం

బయలు వీరభద్రస్వామికి అభిషేకం

సారథి న్యూస్, శ్రీశైలం(కర్నూలు): లోకకల్యాణం కోసం శ్రీశైలక్షేత్ర పాలకుడైన బయలు వీరభద్ర స్వామి వారికి మంగళవారం విశేషపూజలు జరిపించారు. బయలు వీరభద్రస్వామి వారు శివభక్తగణాలకు అధిపతి. అదేవిధంగా శ్రీశైల క్షేత్రపాలకుడిగా క్షేత్రానికి ప్రారంభంలో ఆరుబయట ఉండి, ఎలాంటి ఆచ్చాదన, ఆలయం లేకుండా దర్శనమిస్తాడు. ప్రసన్నవదనంతో కిరీట ముకుటాన్ని కలిగి దశభుజుడైన స్వామివారు పది చేతులలో వివిధ ఆయుధాలతో దర్శనమిస్తాడు. స్వామివారికి కుడివైపున దక్షుడు, ఎడమవైపున భద్రకాళి దర్శనమిస్తారు. ఈ స్వామిని దర్శించినంత మాత్రానే ఎంతటి క్లిష్ట సమస్యలైనా […]

Read More
అమ్మవారికి పల్లకీ ఉత్సవం

అమ్మవారికి పల్లకీ ఉత్సవం

సారథి న్యూస్, శ్రీశైలం: లోకకల్యాణం కోసం శ్రీశైలం దేవస్థానం వారు ఆదివారం రాత్రి మల్లికార్జునస్వామి, భ్రమరాంబ దేవి అమ్మవారికి పల్లకీ ఉత్సవం నిర్వహించారు. ప్రతి ఆదివారం, పౌర్ణమి మరియు మూలనక్షత్రం రోజులలో సర్కారు సేవగా ఈ ఉత్సవాన్ని జరిపిస్తారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవాసంకల్పాన్ని పఠిస్తారు. తర్వాత మహాగణపతిపూజ చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా షోడశోపచారపూజలు జరిపించారు. భౌతికదూరం పాటిస్తూ ఈ పల్లకీ ఉత్సవాన్ని అర్చకులు, వేదపండితులు నిర్వహించారని ఈవో […]

Read More