సామాజిక సారథి, రాజేంద్రనగర్ : జల్ పల్లీ మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువు వద్ద వాకింగ్ ట్రాక్, సైకిల్ ట్రాక్ లు ఎర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులకు ఆదేశించారు. శుక్రవారం జల్ పల్లీ పెద్ద చెరువును స్థానిక ప్రజా ప్రతినిధిలతో కలసి మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముత్యాలమ్మ దేవాలయం నుండి మామిడిపల్లి వరకు సైకిల్ ట్రాక్, వాకింగ్ ట్రాక్ కూడా ఎర్పాటు చేయనున్నట్లు తెలిపారు. […]
గడపగడపకు బీఎస్పీ కార్యక్రమం నాలుగు రోజుల పాటు ఇక్కడే నేడు శిరసనగండ్ల నుంచి షురూ ఏర్పాట్లు పూర్తిచేసిన పార్టీ శ్రేణులు సామాజికసారథి, చారకొండ: రాష్ట్రంలో బహుజన సమాజ్‌పార్టీ మరింత దూకుడు పెంచింది. బహుజనుల రాజ్యాధికార సాధన దిశగా బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ఆర్ఎస్ ప్రవీణ్కుమార్అడుగులు వేస్తున్నారు. అన్నివర్గాల ప్రజలను ఆకట్టుకునేందుకు వారితో మమేకమవుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ప్రతి గ్రామానికి వెళ్తున్నారు. అందులో భాగంగానే నాగర్‌కర్నూల్‌జిల్లాలో ఇంటింటికీ బీఎస్పీ.. గడపగడపకు ఏనుగు […]
టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించుతాం సోనియమ్మ రాజ్యం తీసుకొద్దాం రాష్ట్రంలో 30 లక్షల సభ్యత్వ నమోదు కొడంగల్ లో ప్రారంభించిన రేవంత్ రెడ్డి సామాజిక సారథి, కొడంగల్: ఏఐసీసీ నాయకుడు రాహుల్ గాంధీ దగ్గర మాట ఇచ్చిన ప్రకారం తెలంగాణలో 30 లక్షల సభ్యత్వ నమోదును చేయిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం కొడంగల్ నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ర్టాన్ని సోనియాగాంధీ ప్రకటించిన రోజు […]
సారథి, ఎల్బీ నగర్: కాలనీల్లో సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తానని ఎంఆర్డీసీ చైర్మన్, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం ఆయన నియోజకవర్గంలోని మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని వీరన్నగుట్ట, షిర్డీసాయినగర్ కాలనీల్లో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను పరిశీలించారు. అనంతరం కాలనీలో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇంటర్నల్ లైన్స్, మిగతా డ్రైనేజీ పనులకు ప్రతిపాదనల ప్రకారం నిధులు మంజూరు చేయిస్తానని తెలిపారు. సీసీరోడ్లు, ఇతర సమస్యలను సత్వరమే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. […]
సారథి, ఎల్ బీ నగర్: శ్రీసాయి శాంతి సహాయ సేవాసమితి ఆధ్వర్యంలో లాలన వెల్ఫేర్ ఆర్గనైజేషన్ పర్యవేక్షణలో వనస్థలిపురం గణేశ్ టెంపుల్ లో ఆదివారం పలువురికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వాసవి బిజినెస్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ యేర్రం విజయ్ కుమార్ సతీమణి యెర్రం వనిత నిత్యావసర సరుకులు, రోబోటచ్ సంస్థ అధినేత యెర్రం బాలకృష్ణ సతీమణి ఉమాలక్ష్మి మాస్కులు, శానిటైజర్లను అందజేశారు. ముఖ్యఅతిథులుగా వనస్థలిపురం సీఐ మురళి మోహన్, స్ఫూర్తిసేవాసంస్థ అధ్యక్షుడు కొలిశెట్టి సంజయ్ […]
సారథి, మహేశ్వరం: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం ఆర్కే పురం డివిజన్ పరిధిలోని ఆర్కే పురం కాలనీలోని ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం ఆఖరి రోజు వైభవంగా జరిగాయి. మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు శాలువాతో సత్కరించి స్వామి వారి చిత్రపటాన్ని జ్ఞాపికగా అందజేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ జగిని రమేష్ గుప్త, కార్యనిర్వహణ […]
సారథి న్యూస్, యాచారం: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి గెలువుకోసం విశేషంగా కృషిచేయాలని మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా మంచాల మండల కేంద్రంలో కాంగ్రెస్ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రలోభాలకు గురిచేస్తోందని దుయ్యబట్టారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి కృష్ణాజలాల సాధనకు సీపీఎంతో కలిసి పోరాడి సాధించామని గుర్తుచేశారు. జడ్పీటీసీ నిత్యా నిరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సారథి న్యూస్, యాచారం: బీఫ్ తినేవారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ దిష్టబొమ్మను ఆదివారం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి గ్రామంలో దహనం చేశారు. కేవీపీఎస్ పిలుపుమేరకు కొత్తపల్లి గ్రామంలో భారీ ర్యాలీ తీసి రాజాసింగ్ దిష్టిబొమ్మతో ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో కేవీపీఎస్ రంగారెడ్డి జిల్లా కమిటీ సభ్యులు కావలి జగన్, ప్రజానాట్యమండలి రంగారెడ్డి జిల్లా కమిటీ సభ్యులు గోరెటి రమేష్, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు చిక్కుడు గుండాలు, ఎమ్మార్పీఎస్ […]