సారథి న్యూస్, సూర్యాపేట: సీఎం కేసీఆర్ సంకల్పం మేరకే డబుల్ ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నామని మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట నియోజకవర్గం చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరిలో 82 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంత్రి ప్రారంభించారు. అలాగే 80 మంది లబ్ధిదారులు గృహప్రవేశం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని విధిగా అమలు చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, జడ్పీ చైర్పర్సన్ దీపిక పాల్గొన్నారు.
క్వారంటైన్‌కు ఇద్దరి తరలింపు సారథి న్యూస్, సూర్యాపేట : సూర్యాపేట జిల్లా, కోదాడ మండలం కూచిపూడి గ్రామంలో కరోనా కలకలం చెలరేగింది. కూచిపూడి గ్రామస్తులతో బంధుత్వం కలిగిన ఓ వ్యక్తి హైదరాబాద్‌లో ఎస్సైగా పనిచేస్తున్నాడు. ఆయన ఇటీవల అనారోగ్యానికి గురికాగా గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు హైదరాబాద్ వెళ్లి ఆయనను పరామర్శించి వచ్చారు. అయితే ఆ ఎస్సైకి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ రావడంతో ఆయనను కలిసిన వారిపై అధికారులు దృష్టి సారించారు. ఈ క్రమంలో […]
సారథి న్యూస్, యాదాద్రి భువనగిరి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా యాదగిరిపల్లి శివారులో ఏర్పాటుచేస్తున్న ప్రెసిడెన్షియల్ సూట్ లోని ఒక భవనం వద్ద స్లాబ్ బుధవారం కూలింది. ఈ ప్రమాదంలో కూలీలు అప్పన్న (శ్రీకాకుళం), చెన్నయ్య (మహబూబ్‌నగర్), వెంకటస్వామి (మహబూబ్‌నగర్), రాములు(తాండూర్) తీవ్రంగా గాయపడ్డారు. వీరిని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. విల్లా-6 స్లాబ్ నిర్మాణం చేస్తుండగా నాణ్యత లోపించి స్లాబ్ సుమారు 20అడుగు లోతు మేర కూలింది.
విజయవాడ హైవేపై ఘటన సారథి న్యూస్, యాదాద్రి భువనగిరి: డీసీఎం, బొలెరో వాహనం ఢీకొట్టిన ఘటనలో ఓ డ్రైవర్ మృతిచెందాడు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మల్కాపురం సమీపంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికుల కథనం.. విజయవాడ హైవే(ఎన్‌హెచ్ 65) పై మల్కాపురం వద్ద ఆగిన డీసీఎంను హైదరాబాద్ వైపు మామిడికాయల లోడ్ తో వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ఘటనలో బొలెరో వాహనం డ్రైవర్ అజయ్ కుమార్(20) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే […]