Breaking News

కర్నూలు

ఘనంగా మోడీ బర్త్​డే వేడుకలు

ఘనంగా మోడీ బర్త్​డే వేడుకలు

సారథి న్యూస్​, కర్నూలు: నగరంలోని బైరెడ్డి ఫంక్షన్ హాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 70వ జన్మదిన వేడుకలను డాక్టర్​బైరెడ్డి శబరి ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు కపిలేశ్వరయ్య, జిల్లా అధ్యక్షుడు రామస్వామి, కగ్గొలు హరీష్ బాబు, బీవీ సుబ్బారెడ్డి, జీఎస్ నాగరాజు, అంబిలి కాశీ విశ్వనాథ్, బైరెడ్డి దినేష్ రెడ్డి, హేమలతరెడ్డి, చింతలపల్లి రామకృష్ణ, శ్రీ జ్యోతి, సిలివెరి వెంకటేశ్, శివప్రసాద్ రెడ్డి, చల్లా దామోదర్ రెడ్డి, శ్రీనివాస ఆచారి పాల్గొన్నారు.

Read More
సచివాలయ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

సచివాలయ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

సారథి న్యూస్, కర్నూలు: ఈనెల 20 నుంచి 26వ తేదీ వరకు జరిగే గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు కలెక్టర్ జి.వీరపాండియన్ తెలిపారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ ఆడిటోరియంలో ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పరీక్షలు రాసేందుకు జిల్లాలోని ఆదోని, ఎమ్మిగనూరు, కర్నూలు, నంద్యాల, ఆళ్లగడ్డ, డోన్ ఆరు క్లస్టర్ పరిధిలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు వివరించారు. కర్నూలు జిల్లాలో మొత్తం 19 రకాల సచివాలయ ఉద్యోగ పరీక్షలకు 1,276 పోస్టులకు గాను […]

Read More
ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి

ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి

సారథి న్యూస్, కర్నూలు: రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్ 20న నిర్వహించనున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామక అర్హత పరీక్షల ఏర్పాట్లపై బుధవారం విజయవాడ నుంచి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పీఆర్ అండ్ ఆర్ డీ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, సెక్రటరీ గిరిజాశంకర్ తదితరులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్, జిల్లా ఎస్పీలు, జడ్పీ సీఈవోలతో వీడియో కాన్ఫరెన్స్​నిర్వహించారు. కర్నూలు కలెక్టరేట్ ​నుంచి కలెక్టర్ జి.వీరపాండియన్, ఎస్పీ డాక్టర్ కె.ఫక్కీరప్ప, జడ్పీ […]

Read More
ప్రజారోగ్యంతో చెలగాటం వద్దు

ప్రజారోగ్యంతో చెలగాటం వద్దు

సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు నగర పాలకసంస్థ కమిషనర్ డీకే బాలాజీ ఆదేశాల మేరకు సోమవారం నగరంలోని పలుచోట్ల మున్సిపల్​అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రజారోగ్యంతో చెలగాటమాడితే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. 5వ శానిటరీ డివిజన్ పరిధిలోని బుధవారంపేట సర్వజనాస్పత్రి ఎదురుగా ఉన్న అన్నపూర్ణ, స్పైసి హోమ్స్ హోటల్స్ ను పరిశీలించారు. కుళ్లిపోయిన మాంసపు వంటకాలను తయారుచేసి కస్టమర్లకు అందిస్తున్నట్లు గుర్తించిన శానిటరీ విభాగం అధికారులు దుకాణదారులకు రూ.11వేలు ఫైన్​వేశారు. 13వ డివిజన్ పరిధిలోని గాయత్రి ఎస్టేట్ లోని […]

Read More
ఆత్మకూరును ముంచెత్తిన వరద

ఆత్మకూరును ముంచెత్తిన వరద

నీట మునిగిన లోతట్టు కాలనీలు పరిశీలించిన ఎమ్మెల్యే, అధికారులు సారథి న్యూస్, ఆత్మకూరు(కర్నూలు): రెండు రోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు జిల్లాలోని ఆత్మకూరు పట్టణం జలమయంగా మారింది. సమీపంలోని వాగులు, వంకలు పోటెత్తడంతో వరద పట్టణంలోకి వచ్చిచేరింది. సోమవారం పట్టణంలోని పలు కాలనీల్లో ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి, జేసీ ఖాజామొయినుద్దీన్ స్థానిక అధికారులతో కలిసి పర్యటించారు. లోతట్టు కాలనీల్లో ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారు. ఇళ్లచుట్టూ నీళ్లు చేరిన వారికి స్కూళ్లలో ఆశ్రయం కల్పించారు. బాధితులకు ప్రభుత్వం నుంచి సాయం […]

Read More
మహిళా సాధికారతకు పెద్దపీట

మహిళా సాధికారతకు పెద్దపీట

సారథి న్యూస్, కర్నూలు: రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తోందని, ప్రతి సంక్షేమ కార్యక్రమ లబ్ధిని సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ జి.వీరపాండియన్ కోరారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటుచేసిన వైఎస్సార్ ​ఆసరా పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి మహిళకు ఇస్తున్న రుణాన్ని సద్వినియోగం చేసుకోకుండా పెట్టుబడిగా భావించి వ్యాపారం చేసుకోవాలన్నారు. నగరంలో మహిళా బజార్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ ​కార్పొరేషన్ ​కమిషనర్​ను కోరారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ డీకే […]

Read More
రెండు నెలల్లో ఓర్వకల్ ఎయిర్ పోర్ట్ నుంచి ఫ్లైట్స్​

రెండు నెలల్లో ఓర్వకల్ ఎయిర్ పోర్ట్ నుంచి ఫ్లైట్స్​

సారథి న్యూస్, కర్నూలు: రెండు నెలల్లో కర్నూలు, ఓర్వకల్ ఎయిర్ పోర్ట్ నుంచి కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభమవుతాయని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. సోమవారం ఆయన ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఇతర అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. రాయలసీమ అభివృద్ధిలో భాగంగా ఎయిర్ పోర్ట్ ను అత్యంత వేగవంతంగా అభివృద్ధి చేసేందుకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చర్యలు చేపట్టారని వివరించారు. పెండింగ్ ఉన్న 17 రకాల పనులను వీలైనంత వేగంగా పూర్తిచేయాలని సూచించారు. […]

Read More
పనుల్లో జాప్యం.. నగరవాసులకు ప్రాణసంకటం

పనుల్లో జాప్యం.. ప్రాణసంకటం

సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు నగరంలో డ్రైనేజీ గుంతలు పిల్లలు ప్రాణసంకటంగా మారాయని నేషనల్ ఉమేష్ పార్టీ అధ్యక్షురాలు హసీనాబేగం అన్నారు. ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. మరమ్మతులు పనుల్లో జాప్యం ద్వారా స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తవ్విన గుంతలను పూడ్చివేయాలని సూచించారు. కాలనీవాసులు పలు సమస్యలను తమ దృష్టికి తెచ్చారని ఆవేదన వ్యక్తంచేశారు.

Read More