సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: 2023లో రాష్ట్ర ప్రజలతో పాటు నాగర్ కర్నూల్ నియోజకవర్గ ప్రజలకు అంతా మంచి జరగాలని ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి తనయుడు, డెంటల్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కూచకుళ్ల రాజేశ్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆయన జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది ప్రతి ఒక్కరికి కలిసి రావాలని కోరారు. రైతులకు పాడిపంటలు కలగాలని ఆకాంక్షించారు. […]