సామాజికసారథి, హైదరాబాద్: టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్(టీఈటీ) ఫైనల్ కీ విడుదలైంది. బుధవారం టెట్ కన్వీనర్ రాధారెడ్డి కీని విడుదల చేశారు. జూలై 1వ తేదీన టెట్ ఫలితాలను విద్యాశాఖ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. జూన్ 27న ఫలితాలు విడుదల చేస్తామని తొలుత ప్రకటించారు. అయితే ఫలితాల విడుదల సమయం దగ్గరపడుతున్నా ఇంకా టెట్ ఫైనల్ కీ విడుదల కాలేదు. దీంతో ఒత్తిడికి గురవుతున్న టెట్ అభ్యర్థులు ఫైనల్ కీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ పరిస్థితుల్లో […]
జైభీమ్ యూత్ ఇండియా అధ్యక్షుడు ముకురాల శ్రీహరి సామాజికసారథి, హైదరాబాద్: రామంతాపూర్ లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూలులో దళిత, గిరిజన విద్యార్థులకు బుక్కులు ఇవ్వకుండా వివక్ష చూపడం సరికాదని జైభీమ్ యూత్ ఇండియా అధ్యక్షుడు ముకురాల శ్రీహరి అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ప్రకటనలో పేర్కొన్నారు. ఇక్కడ 1 నుంచి 12వ తరగతి వరకు 300 మంది చదువుతున్నారని తెలిపారు. సంక్షేమ శాఖ నుంచి డబ్బులు రాలేదనే సాకుతో బుక్స్ ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్నారని […]
సామాజికసారథి, వెల్దండ: ఓ పేదింటి గిరిజన బిడ్డ మంగళవారం వెలువడిన ఇంటర్మీడియట్ ఫస్టియర్ మంగళవారం వెలువడిన ఫలితాల్లో టాప్ లేపింది. నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం నగారాగడ్డ తండాకు చెందిన రాత్లావత్ శారద, సల్యానాయక్ వ్యవసాయ కూలీలు. వారి కూతురు రాత్లావత్ నందిని బాలానగర్‌లో గురుకుల విద్యాలయంలో ఇంటర్మీడియట్ బైపీసీ ఫస్టియర్ చదువుతోంది. 433/440 మార్కులు సాధించి అందరి శభాష్ అనిపించుకున్నది. కష్టపడి చదివి ఉత్తమ గ్రేడ్ సాధించింది. నందిని వెల్దండ ఎంపీపీ విజయ జైపాల్‌నాయక్ మరిది […]
పత్రికల పేర్లు చెప్పి డబ్బులు వసూలు యాత్రల పేరుతో జల్సాలు సామాజిక సారథి, బిజినేపల్లి: నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లిలో పలు దినపత్రికల పేరు చెప్పి పదిరోజుల నుంచి యాత్రల పేరిట డబ్బులు వసూలు చేస్తున్న ఆ నలుగురిపై రెండు రోజులుగా మండలవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ‘ఆ నలుగురు’గా పిలువబడేవారు ఏటా రెండుసార్లు మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఓ కారు తీసుకుని తెల్లవారింది మొదలు గ్రామాలపై పడి బెల్టుషాపులు, ఇసుక వ్యాపారులు, ఫర్టిలైజర్దుకాణాలు, కాంట్రాక్టర్లు, ప్రజాప్రతినిధులకు టార్గెట్ […]
సామాజికసారథి, హైదరాబాద్: జులై 1వ తేదీన టెట్(TET)ఫలితాలను విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం ఆమె విద్యాశాఖ పనితీరుపై సమీక్షించారు. టెట్ ఫలితాల వెల్లడిలో జాప్యం లేకుండా చూడాలని ఆదేశించారు. సమావేశంలో ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ, విద్యాశాఖ సంచాలకులు దేవసేన, ఎస్ఈఆర్టీ(SCERT) డైరెక్టర్రాధారెడ్డి, ప్రభుత్వ పరీక్షల సంచాలకులు కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
సామాజికసారథి, హైదరాబాద్: ఈ నెల 30వ తేదీన పదో తరగతి(tenth class) ఫలితాలను విడుదల చేయనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఈ మేరకు జూబ్లీహిల్స్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ కార్యాలయంలో ఏర్పాట్లు చేయాలని ఆమె సంబంధితశాఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.టెన్త్(ssc) ఫలితాల కోసంwww.bse.telangana.gov.in, www.bseresults.telangana.gov.inవెబ్సైట్లో సంప్రదించాలని కోరారు.
సామాజికసారథి, హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్మీడియట్ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్‌లో 63.32 శాతం, సెకండియర్‌లో 67.82 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి తెలిపారు. పాస్ కాని విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ నెల 30వ తేదీ నుంచి సప్లిమెంటరీ ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. ఫలితాల కోసం […]
సామాజిక సారథి, నాగర్ కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లిలో ఆనందగిరిపై ఇటీవల కొత్తగా నిర్మించిన వేంకటేశ్వర స్వామి ఆలయం ప్రతిష్టాపన మహోత్సవంలో గురువారం ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయనను ఆలయకమిటీ సభ్యులు సాదరంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో నాయకులు, అభిమానులు వెంకట్రామిరెడ్డి, తిరుపతయ్య, రాజేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.