సామాజికసారథి, బిజినేపల్లి: నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనుల పేరుతో టీఆర్ఎస్ నాయకులు కొనసాగిస్తున్న నల్లమట్టి వ్యాపారంపై ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయాలని బహుజన సమాజన్పార్టీ(బీఎస్పీ) నాయకులు డిమాండ్ చేశారు. దళితుల, చెరువు శిఖం భూముల్లో నల్లమట్టి తీయడానికి అనుమతులు ఎవరిచ్చారో సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. ప్రజల్లో నిజాయితీని నిరూపించుకోవాలని టీఆర్ఎస్ నాయకులకు సూచించారు. శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లిలోని అంబేద్కర్‌చౌరస్తాలో నిరసన తెలిపారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినదించారు. ఈ సందర్భంగా […]