బీజేపీ నాయకురాలు విజయశాంతి ధ్వజం సామాజికసారథి,హైదరాబాద్: రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం అధికార పార్టీ చెప్పు చేతుల్లో పనిచేస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదని బీజేపీ నాయకురాలు, మాజీఎంపీ విజయశాంతి విమర్శించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్‌రావు కుమారుడు రాఘవ ఇప్పించిన పోస్టింగ్‌లో ఉంటూ ఆయనకు వ్యతిరేకంగా వెళ్లలేని స్థితిలో పోలీసు అధికారులు ఉండిపోవడంతోనే రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను అడ్డంపెట్టుకుని అధికార పార్టీ నాయకులు, వారి కుమారులు, బంధువులు చేసే ఆగడాలు అన్నీఇన్నీ […]
ఆధ్యాత్మిక భావం వదిలి ఆదాయమార్గం వైపు మొగ్గు. పనిచేయని స్థానిక ఆలయ కమిటీ మంత్రము. ఈవో మార్పు దేనికి సంకేతం? సామాజిక సారథి, ఐనవోలు: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ శివ క్షేత్రాల్లో హన్మకొండ జిల్లాలోని ఐనవోలు మల్లిఖార్జున స్వామి ఆలయం చాలా ప్రసిద్ధ చెందినది. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా, గొల్ల కురుమల కొలిచే స్వామి మల్లికార్జున స్వామి. సంక్రాంతి నుండి మొదలు ఉగాది వరకు మూడు నెలల పాటు జరిగే స్వామి […]
మహబూబాబాద్ సిటీలో సుపారి గ్యాంగ్స్ హల్చల్ సీసీ కెమెరాల నిఘా అవసరం అంటున్న ప్రజలు? సామాజిక సారథి , మహబూబాబాద్: మహబూబాబాద్ పట్టణంలో రెండు సుపారి గ్యాంగ్స్ పట్టణానికి చెందిన బోళ్ల రాకేష్ రెడ్డిని కిడ్నాప్ చేసేందుకు తెగబడి విఫలమై పోలీసులకు చిక్కారు. ఖమ్మం పట్టణంకు చెందిన కొడకండ్ల సురేష్ ఎ.ఎన్.ఎక్స్(సిటీ కేబుల్) అనే వ్యక్తి మహబూబాబాద్ కు చెందినబోళ్ల రాకేష్ రెడ్డిని రెండు వాహనాల్లో సుమారు 10 మంది కిరాయి గుండాలతో కలిసి వచ్చి మహబూబాబాద్ […]
జిల్లా కలెక్టర్ హనుమంతరావు సామాజిక సారథి, సంగారెడ్డి: జిల్లాలో అర్హులందరూ జాప్యం చేయకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సూచించారు. దేశ వ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతున్నందున జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వ్యాక్సిన్ తీసుకోవడంలో నిర్లక్ష్యం చేయరాదన్నారు. టీకా పొందినవారికి ప్రమాదం లేదని, రెండు డోసులు టీకా పొందినవారు సురక్షితమన్నారు. కోవిడ్ నిబంధనల మేరకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ సూచించారు. ఎప్పటికప్పుడు చేతుల్ని శుభ్రం చేసుకోవాలన్నారు. […]
మనస్తాపంతో ఉపాధ్యాయిని ఆత్మహత్య ఇటీవలే ఆమెకు ట్రాన్స్ఫర్ సామాజికసారథి, నిజామాబాద్: ప్రభుత్వం చేసిన బదిలీలు ఉద్యోగుల గుండెలపై కుంపటిగా మారాయి. మనస్తాపానికి గురై ఆదివారం మరో ఉపాధ్యాయిని సూసైడ్ చేసుకున్నది. కుటుంబసభ్యుల కథనం.. నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం బాబాపూర్ కు చెందిన బేతల సరస్వతి (36) ప్రస్తుతం తమకు పక్కనే ఉన్న రెహత్‌నగర్ ప్రభుత్వ స్కూలులో టీచర్‌గా పనిచేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు, కేటాయింపుల్లో భాగంగా ఆమెను ఇటీవల కామారెడ్డి జిల్లా గాంధారి మండలం మర్లకుంటతండాకు […]
బీఎస్పీ రాష్ట్ర ముఖ్య సమన్వయకర్త డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ సామాజిక సారథి, నాగర్ కర్నూల్: తెలంగాణలోని ప్రతి పల్లెలో గడప గడపకు బహుజన సమాజ్ పార్టీని తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని బీఎస్పీ రాష్ట్ర ముఖ్య సమన్వయకర్త డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ అన్నారు. ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఉయ్యాలవాడ, తిమ్మాజిపేట మండల కేంద్రం, తాడూరు మండలం ఇంద్రకల్ గ్రామాల్లో బహుజన సమాజ్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన […]
సామాజిక సారథి, భూపాలపల్లి: దేశానికి వెన్నెముఖ అయిన రైతును రాజును చేయడానికి రైతు బంధు పథకంను ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకువచ్చారన్నారని ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు. ఆదివారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో వరంగల్ జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి రెడ్డి అధ్యక్షతన రంగవల్లుల జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొన్ని మహిళ మహారాణులు వేసిన ముగ్గుల ను పరిశీలించి అనంతరం విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. కార్యక్రమంలో మహిళ, శిశు […]
సామాజిక సారథి, నాగర్ కర్నూల్: ఇంజినీర్ల పని తనానికి నిలువుటద్దంగా నిలుస్తోంది. ఈ చిత్రం. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారి నుంచి మినీ ట్యాంక్ బండ్ (కేసరి సముద్రం చెరువు)కు వెళ్లే దారిలో ఇంటికి నల్ల కనెక్షను ఇచ్చిన పైపులైను పూడ్చకుండానే రహదారి వేశారు. బరువుకు అణిగే ప్లాస్టిక్ పైపుల్లోంచి నీరు ఎలా వస్తుందో ఆ ఇంజినీర్లకే తెలియాలి. ఇప్పటికే రహదారికి రెండు వైపులా పైపులైన్లు నిర్మించాలన్ననిబంధన ఉన్నా ఒకేవైపు నిర్మించి, రెండు వైపులా […]