ఒమిక్రాన్ కేసుల పెరుగుదలతో అప్రమత్తం నైట్ కర్ఫ్యూతో పాటు మరిన్ని ఆంక్షలు న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఒమైక్రాన్ కేసులు పెరుగుతుండటంతో మరిన్ని ఆంక్షలకు సర్కార్ దిగింది. వైరస్ మరింత విస్తరించకుండా ఢిల్లీ సర్కార్ ‘ఎల్లో అలర్ట్’ ప్రకటించింది. వరుసగా రెండు రోజులుగా కొవిడ్ పాజిటివిటీ రేటు 0.5 శాతానికిపైగానే ఉంటుంది. దీంతో ఎల్లో అలర్ట్ ప్రణాళికను అమల్లోకి తీసుకురానున్నట్లు సీఎం అరవింద్ కేజీవ్రాల్ మంగళవారం మీడియాకు వెల్లడించారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలతో ఆదేశాలను త్వరలోనే విడుదల […]
చైనా వ్యవహారాల్లో ఆరితేరిన మిస్రీ న్యూఢిల్లీ: చైనా వ్యవహారాల నిపుణుడైన విక్రమ్ మిస్రీ జాతీయ భద్రతా ఉపసలహాదారుగా నియమితులయ్యారు. చైనా వ్యవహారాల్లో ఆరితేరిన విక్రమ్.. బీజింగ్ లో భారత రాయబారిగా పనిచేశారు. 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన ఆయన.. డిప్యూటీ ఎన్‌ఎస్‌ఏగా ఉన్న పంకజ్ సరణ్ నుంచి ఈనెల 31న బాధ్యతలను స్వీకరించనున్నారు. చైనాతో పాటు రష్యాలో కూడా భారత రాయబారిగా పనిచేసిన అనుభవం విక్రమ్‌కు ఉంది. అయితే ఎన్‌ఎస్సీఎస్ లో ఆయన చేరడంతో చైనా […]
ఐఐటీ కాన్పూర్ స్నాతకోత్సవంలో విద్యార్థులతో ప్రధాని నరేంద్రమోడీ కాన్పూర్ మెట్రోను ప్రారంభించి.. ప్రయాణించిన మోడీ, ఆదిత్యనాథ్ లక్నో: ప్రస్తుత పరిస్థితుల్లో నింపాదిగా ఉండాలని కోరుకోవడానికి బదులుగా సవాళ్లను ఎంచుకోవాలని విద్యార్థులకు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. ఇప్పుడు కొత్తవాటి గురించి భయం అనేదే లేదన్నారు. యావత్ప్రపంచాన్ని తెలుసుకునే సత్తా విద్యార్థులకు ఉందన్నారు. ‘ఫలానా విషయం తెలియదు’ అనే ప్రశ్నే ఇక లేదని, అత్యుత్తమమైనదాని కోసం అన్వేషణ, యావత్ప్రపంచాన్ని జయించాలనే కల ఉన్నాయని చెప్పారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ […]