సామాజిక సారథి, చొప్పదండి: ధర్మారం మండలం దొంగతుర్తి ఉన్నత పాఠశాలలో గురువారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బాసర ఐఐఐటీలో సీటు సాధించిన ఇద్దరు విద్యార్థుల్లో ఒకరైన విద్యార్థిని కొప్పుల అంజలికి ప్రముఖ ఎన్ఆర్ఐ, ఆస్ట్రేలియాలో ఉంటున్న భీమనాతిని రాజశేఖర్ అందించి రూ.10వేల నగదు సాయాన్ని హెచ్ఎం ఎన్.అనురాధ, ఎస్ఎంసీ చైర్మన్జూంజిపెల్లి రాజయ్య అందజేశారు. విద్యార్థులను సర్పంచ్ పాలకుర్తి సత్తయ్య, ఉపసర్పంచ్ ముత్యాల చంద్రశేఖర్, ఎంపీటీసీ సభ్యుడు దాడి సదయ్య, ఉపాధ్యాయ బృందం అభినందించారు.
సామాజిక సారథి, అచ్చంపేట: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఏడురోజుల పాటు ‘స్మరిద్దాం ఈవేళ…’ పేరిట నిర్వహించిన ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో అచ్చంపేటకు చెందిన ప్రముఖ కవి, గాయకుడు, చిత్రకారుడు మండికారి బాలాజీ కి ద్వితీయ బహుమతి పొందారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, విద్యావేత్త చుక్కా రామయ్య , హృదయ భారతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మక్కపాటి మంగళ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మండికారి బాలాజీ […]
సామజిక సారథి, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని వెదిర కిమ్స్ లా కాలేజ్ లో శనివారం టీచర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రొఫెసర్లకు బొకే ఇచ్చి సన్మానించారు. సమాజంలో న్యాయవాద వృత్తి ఉన్నతమైందని కొనియాడారు. కార్యక్రమంలో లా కాలేజీ అడ్మిన్ రవీంద్ర, ప్రొఫెసర్లు వెంకటస్వామి, కిషన్, కొమురయ్య, రంగయ్య చారి, వేణుగోపాల్‌రావు, తిరుమలేష్, జలంధర్, మౌనిక, శ్రావణి, రజిత పాల్గొన్నారు.