సారథి, కోడేరు. అర్హులైన పేదలకు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన కొత్త రేషన్ కార్డులను నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలకు రూ.10 లక్షలు మంజూరు చేయించినట్లు తెలిపారు. కోడేరు మండలానికి అంబులెన్స్ సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. మండల కేంద్రంలో డబుల్ రోడ్డు నిర్మాణ పనులు కూడా ముమ్మరంగా సాగుతున్నాయని వివరించారు. కరోనా కారణంగా సంవత్సరన్నర కాలంగా […]
సారథి, రామడుగు: భారత మిస్సైల్స్ టెక్నాలజీ పితామహుడు, భారతరత్న, దివంగత రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ మహోన్నత వ్యక్తి అని విద్యావంతుల వేదిక సభ్యులు కొనియాడారు. మంగళవారం ఆయన వర్ధంతిని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని గ్రంథాలయం పక్కన రామడుగు విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అబ్దుల్ కలామ్ దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. కలామ్ ఆశయ సాధనకు యువత పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జక్కుల శ్రీను, […]
సారథి, కొల్లాపూర్: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్, పెంట్లవెల్లి మండలాల్లోని సోమశిల, మంచాలకట్ట, మల్లేశ్వరం గ్రామాల కృష్ణానది తీర ప్రాంతాలను సీఐ వెంకట్ రెడ్డి, ఎస్సై బాలవెంకటరమణ, సిబ్బందితో కలిసి ఆయన మంగళవారం పరిశీలించారు. సోమశిల కృష్ణానది పరీవాహక ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులను ఏర్పాటుచేశారు. నది ప్రవాహం ఉధృతంగా ఉన్నందున బోటింగ్ చేయడం, చేపలవేటకు వెళ్లడం, పర్యాటకులు నది నీటిలోకి దిగడం వంటి పనులు చేయకూడదని సూచించారు. ఈ సూచనలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని […]
సారథి, వెల్దండ: రేషన్ డీలర్లకు గౌరవ వేతనం రూ.30వేలు ఇవ్వాలని రేషన్ డీలర్ల సంఘం వెల్దండ మండలాధ్యక్షుడు జంగయ్య ప్రభుత్వాన్ని కోరారు. రేషన్ డీలర్ల సమస్యను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కు వినతిపత్రం అందజేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేషన్ డీలర్లు 25 ఏళ్లుగా చాలీచాలని కమీషన్లతో కాలం వెళ్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రేషన్ డీలర్ల కనీస వేతనం ఇవ్వాలని, జీవితబీమా వర్తింప చేయాలని, హమాలీ చార్జీలను ప్రభుత్వమే […]
ఆగస్టు 8న పార్టీ కోఆర్డినేటర్ రాంజీగౌతమ్ సమక్షంలో బీఎస్పీలో చేరిక నల్లగొండ ఎన్ జీ కాలేజీ గ్రౌండ్లో భారీ బహిరంగ సభకు శ్రీకారం సారథి, హైదరాబాద్: గురుకుల విద్యాలయాల సంస్థ పూర్వ కార్యదర్శి, ఇటీవలే వీఆర్ఎస్తీసుకున్న ఐపీఎస్ఆఫీసర్డాక్టర్ఆర్ఎస్ప్రవీణ్కుమార్బహుజన సమాజ్పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. తన అభిమానులు, అనుచరులతో కలిసి పెద్దసంఖ్యలో పార్టీ కోఆర్డినేటర్ రాంజీగౌతమ్సమక్షంలో ఆగస్టు 8న బీఎస్పీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అందుకోసం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కాలేజీ మైదానంలో ఐదులక్షల మందితో భారీ […]