సారథి, రామడుగు: రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని కరీంనగర్జిల్లా రామడుగు ఎస్సై తాండ్ర వివేక్ గురువారం సూచించారు. వర్షానికి తడిసిన విద్యుత్ స్తంభాలు, గోడలను తాకవద్దని, ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉందన్నారు. గృహిణులు జే వైర్లపై బట్టలను ఆరవేయకూడదని హెచ్చరించారు. శిథిలావస్థలో ఉన్న మట్టి ఇళ్లు, గోడల మధ్య ఉండకూడదని కోరారు. ఇంటి ఆవరణలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు. ఉరుములు, మెరుపులు, గాలిదుమారం సమయంలో ప్రజలు, […]
20.80 క్వింటాళ్ల వరి ధాన్యం డబ్బులు నష్టపోయా.. ప్రజాప్రతినిధులు, అధికారులు న్యాయం చేయాలి సోషల్ మీడియా ద్వారా ఓ రైతు ఏకరువు సారథి, బిజినేపల్లి: తేమ సాకుతో తనను నిలువునా దోపిడీ చేశారని ఓ రైతు ఆక్రందన వ్యక్తం చేశాడు. తన బాధను సోషల్‌మీడియా ద్వారా గురువారం నాగర్కర్నూల్ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, కలెక్టర్ ఎల్.శర్మన్‌కు విన్నవించారు. తనకు అన్యాయం జరిగిందని న్యాయం చేయాలని కోరాడు. తన ఆవేదనను ఇలా పంచుకున్నాడు. ‘నా పేరు […]
సారథి, అలంపూర్(మానవపాడు): ఎలాంటి ఆదాయవనరు లేకపోయినా, చాలీచాలని వేతనాలతో గ్రామాల్లో ధూప దీప నైవేద్య పథకం కింద పనిచేసే అర్చకులను ఇటీవల కొందరు పెత్తందారులు వేధింపులకు పాల్పడుతున్నారని అర్చకసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనంద్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అర్చకులకు వచ్చే వేతనాల్లో తమకు వాటా ఇవ్వాలని వేధింపులకు పాల్పడటం శోచనీయమని పేర్కొన్నారు. ధూప దీప నైవేద్యం పథకం కింద ప్రభుత్వం ఇచ్చే రూ.ఆరువేల వేతనంలో రూ.రెండువేలు పూజాసామాగ్రికే సరిపోతుందని, […]