సారథి, మానవపాడు: అంతా కలిసిమెలిసి బక్రీద్ పండుగను జరుపుకోవడం సంతోషకరమని జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు ఎస్సై సంతోష్ కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని జామియా మసీద్ కమిటీ, ఖలీల్ యూత్ ఆధ్వర్యంలో యువకులకు రెండేళ్ల క్రితం క్రికెట్ టోర్నీ నిర్వహించారు. కరోనా నేపథ్యంలో బహుమతులను ప్రదానం చేయలేదు. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని విజేతలకు మొదటి బహుమతి, సీనియర్ కెప్టెన్ శాలిబాషా జట్టుకు, జూనియర్స్ విభాగంలో మొదటి బహుమతి ఇద్రుస్ జట్టుకు ఎస్సై సంతోష్ కుమార్, మాడుగుల […]
సారథి, అలంపూర్(మానవపాడు): జోగుళాంబ గద్వాల జిల్లా అడిషనల్ కలెక్టర్ రఘురామశర్మ బుధవారం అలంపూర్ జోగుళాంబ, బాలబ్రహ్మశ్వర స్వామి ఆలయాలను దర్శించుకున్నారు. అనంతరం స్థానిక తహసీల్దార్ ఆఫీసు నుంచి జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ధరణి వెబ్సైట్ నుంచి అందిన ఫిర్యాదులపై సలహాలు, సూచనలు ఇచ్చారు. అలాగే ఊట్కూర్ గ్రామ శివారులో ఉన్న ప్రభుత్వభూమిలో గతంలో లావాణీ పట్టాలు ఇచ్చినా రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయకపోవడంతో రైతుల భూములను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ విషయమై […]
సారథి, కొల్లాపూర్: నాగర్కర్నూల్ జిల్లా కోడేర్ మండలం నర్సాయిపల్లి శివారులోని 30 ఎకరాల పోడు భూముల్లో ఫారెస్ట్అధికారులు మొక్కలు నాటుతుండగా సర్పంచ్ సత్యనారాయణ యాదవ్, రైతులు, ఇతర గ్రామస్తులు అడ్డుకున్నారు. ఫారెస్ట్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. దళితుల భూముల్లో మొక్కలు నాటొద్దని అడ్డుతగిలారు. సర్వేనం.357లో దళితులకు సంబంధించిన 30 ఎకరాల భూమిలో ఫారెస్ట్ అధికారులు మొక్కలు నాటడం ఏమిటని నిలదీశారు. ఫారెస్ట్ భూమి అయితే రికార్డుల్లో చూపించాలని వారు డిమాండ్ చేశారు. ‘మేము చదువుకోలేక భూముల గురించి […]
సారథి, కొల్లాపూర్: కొల్లాపూర్ ప్రాంతానికి చెందిన ప్రముఖ కవి, రచయిత ఆచార్య ఎల్లూరి శివారెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక డాక్టర్దాశరథి కృష్ణమాచార్యుల స్మారక పురస్కారం ప్రకటించడం హర్షణీయమని కొల్లాపూర్ కవులు, రచయితలు వేదార్థం మధుసూదన శర్మ, ఆమనికృష్ణ, డాక్టర్గూడెలి శీనయ్య, వేముల కోటయ్య, డాక్టర్రాంచందర్ రావు, మేనావత్ రాందాస్ నాయక్, గడ్డం వెంకటరమణ, ముమ్మిడి చంద్రశేఖరాచారి, పరశురాముడు తదితరులు బుధవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. కవిగా, రచయితగా, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతిగా, […]
సారథి, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ పీఆర్వో ఉపాధ్యాయుల చంద్రశేఖర్ రావు కరీంనగర్ జిల్లా నూతన కలెక్టర్కర్ణన్ ను బుధవారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల ఖమ్మం జిల్లా నుంచి బదిలీపై వచ్చిన ఆయన కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు. మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. అనంతరం వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయ అభిషేకం లడ్డూప్రసాదం అందజేసి ఆనందం వ్యక్తం చేశారు.
సారథి, కోడేరు(కొల్లాపూర్): నాగర్కర్నూల్ జిల్లా కోడేరు ప్రభుత్వ పశువైద్య కేంద్రంలో మూగజీవులకు మందులను అందుబాటులో ఉంచకుండా ప్రైవేట్ వ్యక్తులకు విక్రయిస్తున్న పశు వైద్యాధికారి డాక్టర్ భానుకిరణ్ పై చర్యలు తీసుకోవాలని యాదవ సంఘం మండల గౌరవాధ్యక్షుడు యాపట్ల శేఖర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం మందులు సరఫరా చేస్తుండగా, ఆయన మాత్రం మందులు ఇవ్వకుండా నాగర్ కర్నూల్, సింగోటంలోని ప్రైవేట్మెడికల్ షాపునకు చీటీలు రాస్తున్నారని పేర్కొన్నారు. రైతులు, గొర్రెల కాపరుల అవసరాన్ని ఆసరాగా చేసుకొని మందులను సింగయిపల్లిలో నిల్వచేసి […]
సారథి, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని గ్రామాల్లో ముస్లింలు బక్రీద్ వేడుకలు బుధవారం ఘనంగా జరుపుకొన్నారు. మండల కేంద్రంలోని జామా మసీద్ లో ముస్లిం సోదరులు త్యాగానికి ప్రతీక నిలిచే బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సదర్ ఖాజీ అబ్దుల్ మజీద్ మహమ్మద్, యూనుస్ మహమ్మద్, ఖదీర్, అసిఫ్, మొయిజ్, అదిల్, అజీజ్ పాల్గొన్నారు.
సారథి, వేములవాడ: త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగను ముస్లింలు బుధవారం వేములవాడ పట్టణంతో పాటు మండల కేంద్రాలు, గ్రామాల్లో భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. కరోనా నుంచి సమస్త భూప్రపంచాన్ని కాపాడాలని అల్లాహ్ను ప్రత్యేక ప్రార్థనలతో వేడుకున్నారు. వేములవాడ పట్టణంలోని జామే, మహ్మదీయ, ఆర్ఫా, మెయిన్, మదీనా మసీదుల్లో ప్రత్యేక నమాజు చేశారు. వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని నాంపల్లి ఇస్లాంనగర్, రుద్రవరం, శాత్రాజపల్లి, ఫజల్ నగర్ జామే మసీద్ లో మత గురువు బక్రీద్ పండుగ విశిష్టత, చారిత్రక […]