Breaking News

Month: May 2021

కరోనా, వేములవాడ, సెకండ్​వేవ్​, carona, vemulawada,

కరోనాతో టీచర్​ మృతి

సారథి, వేములవాడ: వేములవాడ పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు గుమ్మడి ప్రకాశ్ (45)అనారోగ్యంతో మృతిచెందారు. ఆయన మృతితో విషాదఛాయలు నెలకొన్నాయి. టీచర్​ గా ప్రకాశ్​ అందించిన సేవలను తోటి ఉపాధ్యాయులు, టీచర్లు కొనియాడారు.

Read More
పంటను దళారులకు అమ్ముకోవద్దు

పంటను దళారులకు అమ్ముకోవద్దు

సారథి, రామాయంపేట: రైతులంతా కరోనా నిబంధనలు పాటిస్తూ తప్పనిసరిగా మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించి ధాన్యాన్ని అమ్ముకోవాలని మెదక్​జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ పరుశురాం నాయక్ సూచించారు. మంగళవారం ఆయన నిజాంపేట మండల కేంద్రంలో గల సబ్ మార్కెట్ యార్డులోని వరి కొనుగోలు సెంటర్ ను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రతి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. రైతులు పంటను దళారులకు […]

Read More
యువకుడిని బలితీసుకున్న కరోనా

యువకుడిని బలితీసుకున్న కరోనా

సారథి, రామడుగు: కరోనా సెకండ్ వేవ్ యువకులను ఎక్కువగా బలి తీసుకుంటోంది. తాజాగా కరీంనగర్​జిల్లా రామడుగు మండల కేంద్రానికి చెందిన నీలం రాజు (34) అనే యువకుడు కరోనాతో మృతిచెందాడు. కొద్దిరోజులుగా కరోనాతో పోరాడుతూ మంగళవారం తుదిశ్వాస విడిచాడు. మృతుడికి అమ్మ నాన్న, తమ్ముడు, చెల్లి ఉన్నారు. తాను పెళ్లి చేసుకోకుండా కుటుంబభారాన్ని మోస్తున్నాడు. తమ కొడుకు లేడన్న నిజాన్ని తెలుసుకుని రాజు తల్లిదండ్రులు గుండెలు అవిసెలా రోదిస్తుండగా చూసిన ప్రతిఒక్కరూ కంటతడి పెట్టారు. నీలం రాజు […]

Read More
‘ప్రగతి’ నాగేశ్వర్​రావు కన్నుమూత

‘ప్రగతి’ నాగేశ్వర్​రావు కన్నుమూత

సారథి, రామడుగు: ప్రగతి విద్యాసంస్థల అధినేత మండవ నాగేశ్వరరావు కరోనాతో మంగళవారం సాయంత్రం గుంటూరు జిల్లా నరసరావుపేట ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నాగేశ్వర్ రావు స్వస్థలం గుంటూరు జిల్లా నరసరావుపేట. ఆయన 40 ఏళ్ల క్రితం రామడుగు మండలం గోపాల్ రావు పేటలో చైతన్య పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేశారు. అనంతరం మరో ఉపాధ్యాయుడు రాధాకృష్ణ, గోపాల్ రావు పేట గ్రామానికి చెందిన కర్ర శ్యాంసుందర్ రెడ్డి తో కలిసి ప్రగతి విద్యాలయాన్ని […]

Read More
రైల్వే పనులకు భూసేకరణ

రైల్వే పనులకు భూసేకరణ

సారథి, వేములవాడ: నూతనంగా నిర్మాణం చేపట్టే కొత్తపల్లి, మనోహరబాద్ రైల్వే బ్రాడ్ గేజ్ నిర్మాణ పనుల కోసం అణు పురం, నాంపల్లి గ్రామాల్లో ప్రజాసేకరణ కార్యక్రమం నిర్వహించారు. అణుపురంలో 15.12 ఎకరాలు, నాంపల్లిలో 47.0.7 ఎకరాలను సేకరించారు. సిరిసిల్ల రెవెన్యూ డివిజన్ అధికారికి గ్రామస్తులు సమ్మతి తెలిపారు. కార్యక్రమంలో వేములవాడ తహసీల్దార్ పి.మునీందర్, నక్క శ్రీనివాసస్, తహసీల్దార్ వేములవాడ రూరల్ నరేష్ ఆనంద్, ఎంపీడీవో మ్యాకల రవి, జడ్పీటీసీ జడల శ్రీనివాస్, ఎర్రం మధు పాల్గొన్నారు.

Read More
కరోనా టీకా తప్పనిసరి వేయించుకోవాలి

కరోనా టీకా తప్పనిసరి వేయించుకోవాలి

సారథి, మానవపాడు: కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపధ్యంలో ప్రతిఒక్కరూ కరోనా టీకా వేయించుకోవడంతో పాటు మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని డాక్టర్ సవిత సూచించారు. మంగళవారం జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో వ్యాక్సిన్ నేషన్ నిర్వహించారు. ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకుని కరోనా నివారణ టీకాను వేయించుకోవాలన్నారు. వ్యాక్సిన్ పై అపోహలు వద్దని ఆమె సూచించారు. ఏదైనా అత్యవసర పనిమీద బయటకొచ్చి ఇంటికి వెళ్లి తప్పనిసరిగా కాళ్లు, చేతులను సబ్బుతో పరిశుభ్రంగా కడుక్కోవాలని […]

Read More
ఈటల క్యాంప్ ఆఫీసులో కరపత్రాల కలకలం

ఈటల క్యాంప్ ఆఫీసులో కరపత్రాల కలకలం

సారథి, హుజూరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ క్యాంప్ ఆఫీసులో ఆయనకు వ్యతిరేకంగా ముద్రించిన కరపత్రాలు కలకలం సృష్టించాయి. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఎమ్మెల్యే ఆఫీస్ వద్ద ప్రజాఆరోగ్య పరిరక్షణ సంఘం పేరిట గుర్తు తెలియని వ్యక్తులు కరపత్రాలు వేసి వెళ్లిపోయారు. ఈటల అక్రమాస్తులపై సీబీఐ విచారణతో పాటు అతని బినామీలైన రంజిత్ రెడ్డి, వెంకట్రాంరెడ్డి ఇళ్లపై ఐటీదాడులు చేయాలని అందులో పేర్కొన్నారు. ఆయన ఎన్నికల్లో పోటీచేసినప్పుడు ఇచ్చిన ఆస్తుల అఫిడవిట్లను పరిశీలించి తప్పుడు లెక్కలు చూపినందుకు […]

Read More
వంద పడకల ఆస్పత్రిలో సదుపాయాల పరిశీలన

వంద పడకల ఆస్పత్రిలో సదుపాయాల పరిశీలన

సారథి, వేములవాడ: వంద పడకల ఆస్పత్రి సముదాయం చుట్టూ పరిసరాలను చదును చేసి శుభ్రంగా ఉంచాలని సంబంధిత అధికారులను రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ ఆదేశించారు. సోమవారం ఆయన వేములవాడ పట్టణం తిప్పాపూర్ లోని వంద పడకల ఆస్పత్రి సముదాయాన్ని పరిశీలించారు. ఐసీయూ, సాధారణ వార్డుల్లో ఏర్పాట్లను పరిశీలించారు. అవసరమైన పరికరాలు త్వరలోనే తీసుకొస్తామన్నారు. విద్యుత్ సదుపాయంతో సహా ఇతర మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. కలెక్టర్ వెంట డాక్టర్​ మహేశ్​ రావు, తదితరులు ఉన్నారు.

Read More