Breaking News

Day: May 25, 2021

నాంపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నృసింహ జయంతి

నాంపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నృసింహ జయంతి

సారథి, వేములవాడ: వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి దత్తత దేవస్థానంగా ఉన్న నాంపల్లిగుట్టపై వెలసిన లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో దివ్య కల్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకం, నిత్యహోమం, సహస్రనామార్చన, వేదవిన్నపాలు నిర్వహించారు. తీర్థప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో అర్చకస్వాములు రమణాచారి, విజయసింహచారితో పాటు పర్యవేక్షకులు అల్లి శంకర్, ఇన్ చార్జ్ నూగురి నరేందర్ పాల్గొన్నారు.

Read More
ఇసుక రవాణాను అడ్డుకున్న రైతులు

ఇసుక రవాణాను అడ్డుకున్న రైతులు

సారథి, వేములవాడ: వేములవాడ రూరల్ మండల మూలవాగు పరీవాహక ప్రాంతలైన మల్లారం, జయవరం గ్రామాల నుంచి అక్రమంగా ఇసుక తరలింపును రైతులు అడ్డుకున్నారు. ఇసుకను తరలిస్తే భూగర్భజలాలు అడుగంటిపోయి బావులు ఎండిపోయి ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బావుల్లో నీళ్లు ఉంటేనే  వ్యవసాయం సాగదని రైతులు అన్నారు. అక్రమ రవాణా నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో ఇరుగ్రామాలకు చెందిన రైతులు వెంగళరావు రవి, మల్లేశం, బాబురావు, అశోక్, వేణు, శ్రీనివాస్, నర్సయ్య, […]

Read More
ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు అరికట్టాలి

ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు అరికట్టాలి

సారథి, రామాయంపేట: మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో వరి ధాన్యం కొనుగోలు సెంటర్లలో భారీఎత్తున అవినీతి జరుగుతోందని బీజేపీ నాయకులు ఆరోపించారు. మంగళవారం వారు విలేకరులతో మాట్లాడారు. మొన్న సుతారి పల్లి, నిన్న క్యాట్రియల్ గ్రామంలో రైతులను మోసం చేశారని ఆరోపించారు. ఒక్కో సంచికి 8కిలోల వరకు ఎక్కువ తూకం వేశారని, నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. రామాయంపేట పీఏసీఎస్ చైర్మన్, డైరెక్టర్లపై చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో బీజేపీ మండలాధ్యక్షుడు శివరాములు, పట్టణాధ్యక్షుడు శంకర్ గౌడ్, ప్రదానకార్యదర్శి […]

Read More
వాహనాల తనిఖీ

వాహనాల తనిఖీ

సారథి, చొప్పదండి: లాక్ డౌన్ లో భాగంగా మంగళవారం చొప్పదండి సీఐ కె.నాగేశ్వర్ రావు, ఎస్సై బి.వంశీకృష్ణ వాహనాలను తనిఖీచేశారు. లాక్ డౌన్ నిబంధనలు పాటించని మూడు వెహికిల్స్ ను సీజ్ చేశారు. 15 వాహనాలను ఫైన్ వేశారు. లాక్ డౌన్ సమయంలో అనవసరంగా బయటికి రావొద్దని సూచించారు. ఎలాంటి పనులు ఉన్నప్పటికీ ఉదయం 10 గంటలలోపే పూర్తిచేసుకోవాలని కోరారు.

Read More
వ్యాక్సిన్ తీసుకున్న ఎమ్మెల్యే

వ్యాక్సిన్ తీసుకున్న ఎమ్మెల్యే

సారథి, చొప్పదండి: కరీంనగర్ జిల్లా చొప్పదండి ప్రాథమిక వైద్య ఆరోగ్యకేంద్రంలో మంగళవారం చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కరోనా రెండో డోసు వాక్సిన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. ప్రజలు లాక్ డౌన్ కు సహకరించాలని కోరారు. ప్రజలు అవసరం ఉంటేనే బయటకు రావాలని సూచించారు. భౌతికదూరం పాటించాలన్నారు. రెండు మాస్కులు ధరించాలన్నారు. వాక్సినేషన్ తొందరగా పూర్తిచేసేందుకు ప్రభుత్వం గ్లోబల్ టెండర్లను పిలిచిందని ఎమ్మెల్యే తెలిపారు.

Read More