సారథి, హుజూరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ క్యాంప్ ఆఫీసులో ఆయనకు వ్యతిరేకంగా ముద్రించిన కరపత్రాలు కలకలం సృష్టించాయి. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఎమ్మెల్యే ఆఫీస్ వద్ద ప్రజాఆరోగ్య పరిరక్షణ సంఘం పేరిట గుర్తు తెలియని వ్యక్తులు కరపత్రాలు వేసి వెళ్లిపోయారు. ఈటల అక్రమాస్తులపై సీబీఐ విచారణతో పాటు అతని బినామీలైన రంజిత్ రెడ్డి, వెంకట్రాంరెడ్డి ఇళ్లపై ఐటీదాడులు చేయాలని అందులో పేర్కొన్నారు. ఆయన ఎన్నికల్లో పోటీచేసినప్పుడు ఇచ్చిన ఆస్తుల అఫిడవిట్లను పరిశీలించి తప్పుడు లెక్కలు చూపినందుకు […]
సారథి, వేములవాడ: వంద పడకల ఆస్పత్రి సముదాయం చుట్టూ పరిసరాలను చదును చేసి శుభ్రంగా ఉంచాలని సంబంధిత అధికారులను రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ ఆదేశించారు. సోమవారం ఆయన వేములవాడ పట్టణం తిప్పాపూర్ లోని వంద పడకల ఆస్పత్రి సముదాయాన్ని పరిశీలించారు. ఐసీయూ, సాధారణ వార్డుల్లో ఏర్పాట్లను పరిశీలించారు. అవసరమైన పరికరాలు త్వరలోనే తీసుకొస్తామన్నారు. విద్యుత్ సదుపాయంతో సహా ఇతర మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. కలెక్టర్ వెంట డాక్టర్ మహేశ్ రావు, తదితరులు ఉన్నారు.
సారథి, రామడుగు: కరోనా సెకండ్ వేవ్ ఉధృతమవుతున్న నేపథ్యంలో అధిక మంది టెస్టులు చేసుకునేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. కరీంనగర్జిల్లా రామడుగు ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటుచేసిన టెస్టింగ్ సెంటర్ లో కరోనా పరీక్షల కోసం జనం బారులుదీరారు. కానీ టెస్టింగ్ కిట్లు లేకపోవడంతో చాలా మంది నిరాశతో వెనుదిరిగారు.
సారథి, రాయికల్: కరోనా ఉధృతి పెరుగుతున్న దృష్ట్యా వైరస్ నివారణ పరీక్షలు వేగవంతం చేయాలని కరీంనగర్ రాయికల్ మండల మహేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి చిలివేరి నాగరాజు అన్నారు. ప్రతిరోజు చేస్తున్న కరోనా ర్యాపిడ్ నిర్ధారణ పరీక్షలు సంఖ్యను పెంచాలన్నారు. వ్యాక్సిన్ కొరత అధికంగా ఉండటంతో తీవ్రఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వ్యాక్సిన్ వేయించుకోవడానికి మండల సామాజిక ఆరోగ్య కేంద్రానికి పెద్దఎత్తున ప్రజలు రావడంతో అక్కడ ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే వైరస్ ఎక్కువ మందికి అంటుకునే ప్రమాదం […]
సారథి ప్రతినిధి, రామగుండం: రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. సోమవారం రంజాన్ పండగను పురస్కరించుకుని మసీద్ ఇమామ్ లు, సదర్లు, మతపెద్దలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. పండుగ వేళ ముస్లింలకు కానుకలు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటుచేసి ఉచితంగా చదువులు అందిస్తున్నారని కొనియాడారు.కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగీ అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, జడ్పీటీసీ […]