సారథి న్యూస్, అచ్చంపేట: మహాశివరాత్రి సందర్భంగా గురువారం నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ నల్లమలలోని భౌరాపూర్ చెంచుపెంటలో భ్రమరాంబదేవి, మల్లిఖార్జున స్వామి వారి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ దంపతులు, కలెక్టర్ ఎల్.శర్మన్ దంపతులు పాల్గొన్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని చెంచులు తమ ఆరాధ్యదైవంగా భావించే భ్రమరాంభ, మల్లిఖార్జున స్వామి కల్యాణఘట్టాన్ని జరిపిస్తుంటారు. నల్లమల నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
ఆ ఊరే ఆలయ ప్రాంగణంలో కట్టినట్టు ఉంటుంది. పరిసరాలన్నీ శాసనాలున్న చారిత్రాత్మక ప్రదేశంగా వెలుగొందుతోంది. ఒకప్పుడది గొప్ప ఆలయంగా విరాజిల్లింది. ప్రజలు మొక్కులు తీర్చుకొనే ఆధ్యాత్మిక కేంద్రంగా.. రాజులు పరిపాలన చేసే పాలనా కేంద్రంగా చరిత్రలో నిలిచిపోయింది పొట్లపల్లి. ఇక్కడి శివాలయం, శిలాశాసనం, తవ్వకాల్లో బయటపడిన వస్తువులకు ఎంతో విశిష్టత ఉంది. సారథి న్యూస్, హుస్నాబాద్: పొట్లపల్లి. క్రీ.శ 1066లో పశ్చిమ చాళుక్య రాజైన త్రైలోక్య మల్లన్న దేవరాయ కాలపు శిలాశాసనం పొట్లపల్లి చరిత్ర, ఆధ్యాత్మిక నేపథ్యాన్ని […]
వైభవంగా ప్రారంభమైన జాతర మహోత్సవం పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి, ఎమ్మెల్యేలు సారథి న్యూస్, పాపన్నపేట: మహాశివరాత్రి పర్వదినం రోజున పవిత్ర మంజీరా నది పాయల మధ్య వనదుర్గామాత సన్నిధిలో ఏడుపాయల జాతర గురువారం వైభవంగా ప్రారంభమైంది. ఓ వైపు శివనామస్మరణ, మరోవైపు దుర్గమ్మ నామస్మరణతో పరిసర ప్రాంతాలు మార్మోగాయి. గురువారం తెల్లవారుజామున పూజారులు అమ్మవారికి అభిషేకం, విశేష అలంకరణ, అర్చనలు నిర్వహించారు. ప్రభుత్వం తరపున ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు, మెదక్, నర్సాపూర్ ఎమ్మెల్యే లు పద్మాదేవేందర్ రెడ్డి, […]