సారథి న్యూస్, మెదక్: మొబైల్ కు ఆధార్ నంబర్ అనుసంధానం చేసేందుకు మీ- సేవా, ఈ-సేవా కేంద్రాలు మార్చి 31వ తేదీ వరకు రాత్రి 9గంటల వరకు పనిచేస్తాయని మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ తెలిపారు. కోవిడ్-19 వాక్సిన్ వేసుకునేందుకు పేరు నమోదుకు ఆధార్ ఆధారిత మొబైల్ ఓటీపీ ఆవశ్యకత ఉన్నందున ఈ వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని ఆయన తెలిపారు. మీ ఆధార్ కు మొబైల్ నంబర్ అనుసంధానం చేయడం కోసం ఆధార్ కేంద్రాలతో పాటు […]
సారథి న్యూస్, వెంకటాపురం: నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన ములుగు జిల్లా నూగురు వెంకటాపురం మండల కేంద్రంలోని కుమ్మరివీధికి చెందిన పూసం యశ్వంత్(20) అనే యువకుడి డెడ్‌బాడీ గురువారం పాలెం ప్రాజెక్టులో లభ్యమైంది. గ్రామస్తుల కథనం మేరకు.. పూసం యశ్వంత్ నాలుగు రోజుల క్రితం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో వారంతా వేరే బంధువుల ఇంటికి వెళ్లి ఉండొచ్చని భావించి ఆరా తీయలేదు. రెండురోజులైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో ఇంటి సభ్యులు […]
భక్తజనసంద్రమైన తిరుమల బండ భక్తిశ్రద్ధలతో రథసప్తమి వేడుకలు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ప్రత్యేకపూజలు సారథి న్యూస్, రామాయంపేట: మెదక్ జిల్లా నిజాంపేట మండలం చల్మేడ గ్రామంలో సుమారు 700 ఏళ్ల క్రితం స్వయంభూగా వెలిసిన తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు గురువారం వైభవంగా జరిగాయి. ముఖ్యఅతిథిగా హాజరైన మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందరెడ్డికి వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. స్వామివారి కల్యాణానికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. […]
సారథి న్యూస్, పెద్దశంకరంపేట: సమాజంలోని ఎంతో మంది పేదలు, అన్యాయానికి గురైన వారికి ఉచితంగా న్యాయ సహాయం అందించే గట్టు వామన్ రావు, అతని భార్యను దారుణంగా చంపివేయడం చాలా బాధాకరమని బ్రాహ్మణ సమాజం సేవా సంఘం నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సంస్థ మండలాధ్యక్షుడు రామచంద్రాచారి, క్రిష్ణశర్మ, నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ రావు, రంగన్న, ఫణి, రాము, అనంత్ రాజ్, రవి, […]