Breaking News

వైభవంగా బండమీది జాతర

వైభవంగా బండమీది జాతర

  • భక్తజనసంద్రమైన తిరుమల బండ
  • భక్తిశ్రద్ధలతో రథసప్తమి వేడుకలు
  • మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్​రెడ్డి ప్రత్యేకపూజలు

సారథి న్యూస్, రామాయంపేట: మెదక్​ జిల్లా నిజాంపేట మండలం చల్మేడ గ్రామంలో సుమారు 700 ఏళ్ల క్రితం స్వయంభూగా వెలిసిన తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు గురువారం వైభవంగా జరిగాయి. ముఖ్యఅతిథిగా హాజరైన మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందరెడ్డికి వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. స్వామివారి కల్యాణానికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణలో టీఆర్ఎస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ​ఎంతో ప్రాధాన్యమిస్తున్నారని అన్నారు. పురాతన తిరుమలస్వామి ఆలయానికి ఎలాంటి వాస్తుదోషం లేకుండా దేవాలయం చుట్టూ నాలుగు ఆలయ ప్రాకరాల నిర్మాణానికి రూ.1.15 కోట్లు మంజూరయ్యాయని, అలాగే ఫంక్షన్ హాల్ కు రూ.కోటి మంజూరైనట్లు తెలిపారు. ఆలయాభివృద్ధికి నెలనెలా ఆదాయం సమకూరేలా కృషిచేస్తామన్నారు. ఆలయ భూములను కాపాడుతామని అన్నారు. ఎంపీపీ సిద్ధరాములు, జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్, స్థానిక సర్పంచ్​ నర్సింహారెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు బాల్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ ఆకుల మహేందర్, వివిధ గ్రామాల సర్పంచ్​లు, అధికారులు పాల్గొన్నారు.