సారథి న్యూస్, రామాయంపేట: ప్రజలు ఎంతో నమ్మకంతో విశ్వాసంతో ఓట్లేసి గెలిపించిన సీఎం కుర్చీని ఎడమకాలు చెప్పుతో సమానమని చెప్పిన సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యన్ని, రాజ్యాంగ వ్యవస్థను అవమానించినట్లేనని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. ఫామ్ హౌస్ ను వదలని.. ప్రగతి భవన్ ను దాటని ముఖ్యమంత్రి రాజీనామా చేసి చేతనైనవారికి పాలన వ్యవస్థను అప్పగించాలని హితవుపలికారు. సోమవారం ఆయన నిజాంపేట మండల కేంద్రంలో బిర్యానీ సెంటర్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ప్రజలు ఓట్లేసి గెలిపించిన ఆ […]
సారథి న్యూస్, హైదరాబాద్: ఫిబ్రవరి 12 నుంచి 16వ తేదీ వరకు అలంపూర్ లో జరిగే జోగుళాంబదేవి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ సోమవారం ప్రగతి భవన్ లో సీఎం కె.చంద్రశేఖర్ రావును కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఆయన కలిసిన వారిలో దేవాదాయశాఖ మంత్రి ఏ.ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజ్, ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ రవిప్రకాశ్ గౌడ్ తదితరులు ఉన్నారు.
పంచాయతీల మాదిరిగానే నిర్ధిష్టమైన విధులు పంచాయతీలు నిధులను సంపూర్ణంగా వాడుకోవచ్చు ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ సారథి న్యూస్, హైదరాబాద్: స్థానిక స్వపరిపాలన సంస్థలను బలోపేతం చేసి, గ్రామీణాభివృద్ధిలో వారి పాత్రను మరింత క్రియాశీలం చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. గ్రామ పంచాయతీలకు ప్రస్తుతం ఇస్తున్న మాదిరిగానే జిల్లా, మండల పరిషత్ లకు కూడా నిధులు కేటాయిస్తామని, నిర్ధిష్టమైన విధులు అప్పగిస్తామని వెల్లడించారు. మండల, జిల్లాస్థాయి అధికారుల అనుమతులు అవసరం లేకుండానే, గ్రామ పంచాయతీలు […]
సారథి న్యూస్, హైదరాబాద్: ఈనెల 15 నుంచి ప్రాథమికోన్నత పాఠశాలలు, 22 నుంచి ప్రాథమిక పాఠశాలలను ప్రారంభించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టీఎస్ యూటీఎఫ్) రాష్ట్ర కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె.జంగయ్య, చావ రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి చిత్రారామచంద్రన్ కు లేఖ రాశారు. ఈనెల మొదటి 1 నుంచి 9, 10 ఆపై తరగతులు ప్రారంభమై సజావుగా కొనసాగుతున్నాయని వివరించారు. పొరుగు రాష్ట్రంలో కూడా […]