అమరావతి: ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్లో గ్రామపంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ఖరారైంది. రెవెన్యూ డివిజన్ల వారీగా నాలుగు విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ను విడుదల చేసింది. గతంలో చేసిన ప్రకటనను రీ షెడ్యూల్ చేసింది. గత షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 5,9,13,17వ తేదీల్లో ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది. తాజాగా మార్పులు చేస్తూ ఫిబ్రవరి 9, 13, 17, 21 తేదీల్లో పోలింగ్నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఇక మొదటి దశ ఎన్నికలకు సంబంధించి జనవరి 29 నుంచి, […]
న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే వేడుకలు ఈ సారి విభిన్నంగా వినూత్నరీతిలో కొనసాగనున్నాయి. ఈ ఏడాది ఎన్నో కొత్త శకటాలు దర్శనమివ్వనున్నాయి. రఫేల్ యుద్ధవిమానాలను తొలిసారిగా ఈ ఏడాది పరేడ్‌లో ప్రదర్శించనున్నారు. గత సెప్టెంబర్‌లో ఫ్రాన్స్ నుంచి వచ్చిన ఈ విమానాలు భారత వైమానిక దళంలో చేరాయి. మొట్టమొదటిసారిగా మహిళా యుద్ధ పైలెట్ లెఫ్ట్‌నెంట్ భావనాకాంత్ ప్రదర్శనలో పాల్గొననున్నారు. భారత వాయుసేనకు చెందిన తేలికపాటి యుద్ధవిమానాలు, యుద్ధ హెలికాప్టర్లు, సుఖోయ్–30 విమాన శకటాలను భావన ముందుండి నడిపిస్తారు. రిపబ్లిక్ డే వేడుకల్లో […]
సారథి న్యూస్, పెద్దశంకరంపేట: సుకన్య సమృద్ధి యోజన పథకం ఆడ పిల్లలకు వరం లాంటిదని సంగారెడ్డి సబ్ డివిజన్ మెయిల్ ఆఫీసర్ శ్రీనివాస్ అన్నారు. సోమవారం పెద్దశంకరంపేట పోస్ట్ ఆఫీస్ లో పలువురు తల్లిదండ్రులకు ఈ పథకంపై అవగాహన కల్పించారు. కూతుళ్లు పుట్టిన తల్లిదండ్రులకు ఈ పథకం కొండంత అండగా ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు పోస్టాఫీసును సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో పెద్దశంకరంపేట ఎస్పీఎం అనిల్ కుమార్, బీపీఎంలు సుదర్శన్, రాఘవేందర్, గంగారాం మామయ్య, విజయ్ కుమార్, సిబ్బంది […]
సారథి న్యూస్, రామయంపేట: సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు మార్చి తర్వాత సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకుంటే రూ.ఐదు లక్షల ఆర్థిక సహాయం అందజేస్తామని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ప్రకటించారు. సోమవారం ఆమె నిజాంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. కరోనా సమయంలో రాష్ట్రానికి ఆదాయం తగ్గడంతో ఆసరా పింఛన్లు అందించడంలో ఆలస్యమైందన్నారు. మార్చి తర్వాత మండల కేంద్రంలో రెండెకరాల విస్తీర్ణంలో ఎంపీడీవో, తహసీల్దార్ […]
సారథి న్యూస్, బిజినేపల్లి: నాగర్కర్నూల్ జిల్లా పాలెం అలువేలు మంగ సమేత వేంకటేశ్వర స్వామి వారి ఆలయ హుండీని సోమవారం లెక్కించారు. నాలుగు నెలలకు సంబంధించి రూ.3,17,455 ఆదాయం సమకూరిందని ఆలయాధికారులు తెలిపారు. దేవాదాయశాఖ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇన్స్పెక్టర్ వీణా సమక్షంలో నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో ఎస్.ఆంజనేయులు, మాజీ చైర్మన్ నరసింహాస్వామి గుప్తా, సర్పంచ్ గోవిందు లావణ్య నాగరాజు, ఉపసర్పంచ్ చికొండ్ర రాములు, గ్రామపెద్దలు పాలది మల్లికార్జున్, ఎస్ బాలస్వామి, ఆనంద్, జగదీశ్, ఆలయ […]