సారథి న్యూస్, యాదాద్రి భువనగిరి: తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరవీరుడు దివంగత కాసోజు శ్రీకాంతచారి 11వ వర్ధంతి సందర్భంగా మోత్కూరు మండలం పొడి చెడు గ్రామంలో ఆయన విగ్రహానికి మంత్రులు ఈటల రాజేందర్, గుంటకండ్ల జగదీశ్వర్‌రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తుంగతుర్తి శాసనసభ్యుడు గాదరి కిషోర్ కుమార్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సారథి న్యూస్, నకిరేకల్: నకిరేకల్ మండలం పాలెం గ్రామంలో గురువారం నిర్వహించిన నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అంత్యక్రియల్లో సీఎం కె.చంద్రశేఖర్‌రావు పాల్గొని భౌతికకాయానికి నివాళులు అర్పించారు. నర్సింహ్మయ్య కుటుంబసభ్యులను ఓదార్చారు. ఆయన వెంట మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి, మహమూద్ అలీ, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, తెలంగాణ రాష్ట్ర రైతు […]
సారథి న్యూస్, ములుగు: రాష్ట్ర మహిళా స్రీ,శిశు సంక్షేమ, రాష్ట్ర దివ్యాంగుల సంక్షేమ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం వెబినార్ ద్వారా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమశాఖ స్పెషల్ సెక్రటరీ దివ్యా దేవరాజన్ మాట్లాడుతూ.. వైకల్యం మనిషికి మాత్రమేనని మనసుకు కాదని, ఆత్మవిశ్వాసంతో అంగవైకల్యం జయించాలని కోరారు. దివ్యాంగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి.. వారి భవిష్యత్ కు బంగారు బాటలు వేస్తోందన్నారు. కోవిడ్ […]