Breaking News

Day: August 20, 2020

మాళవిక కూతురుకు కరోనా

కరోనా మహమ్మారి సామాన్యులతోపాటు సెలబ్రిటీలను సైతం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రముఖ సినీ నేపథ్యగాయకుడు, గానగాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా సోకి ప్రస్తుతం చెన్నైలోని ఎంజీఎం దవాఖానలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. సింగర్లు సునీత, మాళవిక కూడా కరోనా బారినపడ్డారు. అయితే తాజాగా మరో విషాధకరమైన విషయం ఏమిటంటే.. మాళవిక రెండేండ్ల కుమార్తెకు కరోనా సోకింది. దీంతో మాళవిక కుటుంబం తీవ్ర ఆందోళన చెందుతోంది. మాళవిక తల్లిదండ్రులు కూడా కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం వారంతా హోంఐసోలేషన్​లో ఉండి చికిత్సపొందుతున్నారు. […]

Read More

70వేల కొత్తకేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతున్నది. గత 24 గంటల్లో 69,652 కొత్తకేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 28,36,925కు చేరుకున్నది. కాగా ఇప్పటివరకు 20,96,664 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో 58,794 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. కాగా ఇప్పటివరకు 53,866 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల్లో 6,86,395 మంది చికిత్స పొందుతున్నారు.

Read More
తెలంగాణలో 1,724 కరోనా కేసులు

తెలంగాణలో 1,724 కరోనా కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో గురువారం 1,724 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారినపడి 10 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు 729 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 97,424కు చేరింది. ఇప్పటివరకు 75,186 మంది చికిత్స అనంతరం కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 21,509 యాక్టివ్​కేసులు ఉన్నాయి. తాజాగా 1,195 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్​అయ్యారు. జీహెచ్​ఎంసీ పరిధిలో అత్యధికంగా 395 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. భద్రాద్రి […]

Read More
‘అపెక్స్ కౌన్సిల్’లో నిలదీద్దాం

‘అపెక్స్ కౌన్సిల్’లో నిలదీద్దాం

తెలంగాణలో కొత్తగా ప్రాజెక్టులేవీ చేపట్టలేదు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నవాటినే రీడిజైన్ చేశాం 25న సమావేశంలో అభ్యంతరాలను లేవనెత్తుదాం వ్యూహంపై సీఎం కె.చంద్రశేఖర్​రావు అధికారులకు దిశానిర్దేశం సారథి న్యూస్, హైదరాబాద్: ఈనెల 25న అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలన్న కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని సీఎం కె.చంద్రశేఖర్ రావు స్వాగతించారు. కేంద్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సందేహాలన్నింటినీ నివృత్తి చేస్తామని స్పష్టంచేశారు. నదీజలాల వినియోగం విషయంలో రాష్ట్రానికి ఉన్న అభ్యంతరాలను కూడా కౌన్సిల్ సమావేశంలో లేవనెత్తుతామని వెల్లడించారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం విషయంలో […]

Read More