Breaking News

Month: July 2020

మొక్కలు ఎదిగితేనే సార్థకత

మొక్కలు ఎదిగితేనే సార్థకత

సారథి న్యూస్, మెదక్: మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని, వాటిని బతికిస్తేనే హరితహారం కార్యక్రమానికి సార్థకత ఉంటుందని మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి అన్నారు. శనివారం నర్సాపూర్ పట్టణంలోని తెలంగాణ మైనారిటీ బాలుర రెసిడెన్షియల్ స్కూలు ఆవరణలో కలెక్టర్ మొక్కను నాటి నీళ్లుపోశారు. స్కూలు ఆవరణలో వెయ్యి మొక్కలు నాటేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయడం ఎంతో అభినందనీయమన్నారు. వాటికి ట్రీ గార్డులను ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులకు మొక్కలను దత్తత ఇచ్చి కాపాడే […]

Read More
రైతులకు ఏ ఇబ్బంది రానివ్వం

రైతులకు ఏ ఇబ్బంది రానివ్వం

సారథి న్యూస్, మెదక్: రైతులకు ఏ ఇబ్బంది రానివ్వబోమని, పంటల సాగుకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తామని మంత్రి హరీశ్​రావు భరోసా ఇచ్చారు. శనివారం మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని శివంపేట మండలం కొత్తపేట, రత్నాపూర్ గ్రామాల్లో డంపింగ్ యార్డులను ప్రారంభించారు. కొత్తపేట గ్రామంలో మొక్కలు నాటి, రత్నాపూర్ గ్రామంలో రైతు వేదిక నిర్మాణానికి భూమిపూజ చేశారు. నాట్లు వేస్తున్న రైతుల వద్దకు వెళ్లి ఏయే పంటలు వేస్తున్నారు, పంట నియంత్రిత సాగు విధానంతో కలిగే లాభాలను […]

Read More
12 ఏండ్లయినా పరిహారం ఇవ్వరా?

12 ఏండ్లయినా పరిహారం ఇవ్వరా?

సారథి న్యూస్, హుస్నాబాద్: గౌరవెల్లి భూ నిర్వాసితులకు 12 ఏండ్లయిన పరిహారం ఇవ్వలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. ఈ మేరకు శనివారం నీటిపారుదల శాఖ సెక్రటరీ, సీఎం కేసీఆర్​కు లేఖలు రాశారు. గౌరవెల్లి ప్రాజెక్టు రీ డిజైన్​లో భాగంగా 1.4 నుంచి నుంచి 8.2 టీఎంసీల సమర్థ్యాన్ని పెంచడంతో ప్రాజెక్టు కింద రెండవసారి నిర్వాసితులు భూములను కోల్పోయారన్నారు. భూ నిర్వాసితులు ఏండ్ల తరబడి నష్టపరిహారం కోసం మంత్రులు, కలెక్టర్, ఎమ్మెల్యే, […]

Read More
చిట్టచివరి రైతు దాకా ‘రైతుబంధు’

చిట్టచివరి రైతు దాకా ‘రైతుబంధు’

దసరా నాటికి రైతు వేదికల నిర్మాణం కరోనా కష్టకాలంలోనూ రైతులకు సాయం యాజమాన్య హక్కు సమస్యలను పరిష్కరించాలి నియంత్రిత సాగు.. రైతుల్లో గొప్ప పరివర్తన ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం కె.చంద్రశేఖర్​రావు సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో రైతుబంధు సాయం అందని రైతులు ఏ మూలన ఎవరున్నా వెంటనే గుర్తించి, చిట్టచివరి రైతు వరకు అందరికీ ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం సూచించిన మేరకే రైతులు వందకు వందశాతం నియంత్రిత పద్ధతిలో […]

Read More
సీఎంగా కోట శ్రీనివాసరావు

సీఎంగా కోట శ్రీనివాసరావు

జులై 10న సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న ‘రోరి’ సినిమాలోని లుక్ రిలీజ్ చేశారు టీమ్ సభ్యులు. ఏ పాత్రకైనా హుందాతనాన్ని తెచ్చే కోట పొలిటికల్ క్యారెక్టర్స్ ఎన్నో పోషించారు. కానీ సీఎం పాత్రలో ఇప్పటిదాకా నటించలేదు. చరణ్ రోరి నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రోరి’ సినిమాలో ముఖ్యమంత్రి పాత్ర పోషించనున్నారు. శుక్రవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్​ను విడుదల చేశారు. ఆర్.రామన్న చౌదరిగా సెన్సిటివ్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్నారు […]

Read More
విలన్ పొన్నంబళానికి సీరియస్

విలన్ పొన్నంబళానికి సీరియస్

ఫైటర్ గా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన పొన్నంబళమ్ విలన్ గా అనేక సినిమాల్లో నటించి మెప్పించారు. 90లో విలన్ గా పొన్నాంబళమ్ బాగా ఫేమస్ అయ్యారు. తెలుగులో కూడా ఆయన చిరంజీవి, బాలకృష్ణ వంటి పెద్ద హీరోల చిత్రాలతో పాటు శ్రీకాంత్, జగపతిబాబు నటించిన చిత్రాల్లోనూ కీలకపాత్రల్లో విలన్​గా నటించారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో సినిమాలకు దూరంగా ఉంటున్నారు పొన్నంబళమ్. కాగా ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి క్షణించింది. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న పొన్నంబళమ్ చెన్నై […]

Read More
కరోనాను కంట్రోల్​ చేసేదెట్లా?

కరోనాను కంట్రోల్​ చేసేదెట్లా?

వణికిపోతున్న పల్లెజనం ఏపీలో కొత్త ప్రాంతాలకు మహమ్మారి సారథి న్యూస్, కర్నూలు: ఎక్కడో చైనాలో పుట్టిన కరోనా వైరస్‌ ఆంధ్రప్రదేశ్​లో పాగా వేస్తోంది. కరోనా వైరస్‌ నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇటీవలే ప్రభుత్వం కొన్ని ప్రైవేట్‌ ఆస్పత్రులకు కూడా చికిత్సల కోసం అనుమతులు ఇచ్చింది. కరోనా వైరస్‌ సోకిన వారికి ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యసేవలు పొందేలా ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం ట్రీట్​మెంట్​ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా ప్రజల్లో […]

Read More
తెలంగాణలో 1,178 కేసులు,

తెలంగాణలో 1,178 కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో శనివారం 1,178 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. తాజాగా కరోనా మహమ్మారి బారినపడి 9 మంది మృతిచెందారు. ఇప్పటి వరకు మొత్తంగా 348 మంది బలయ్యారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ ​కేసులు 33,402 కు చేరాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,62,171 టెస్టులు చేశారు. జీహెచ్​ఎం పరిధిలో 736 కేసులు నమోదయ్యాయి. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే రంగారెడ్డి జిల్లా 125, మేడ్చల్​101, సంగారెడ్డి 13, వరంగల్ అర్బన్​ 20, కరీంనగర్​24, సిరిసిల్ల […]

Read More