Breaking News

Month: July 2020

మహిళ చేతిలో మోసపోయిన విశాల్​

ప్రముఖ తమిళ హీరో, నిర్మాత, నడిగర్​ సంఘం కీలకసభ్యడు విశాల్​ను ఆయన కార్యాలయంలో పనిచేసే ఓ మహిళ మోసగించింది. ఆరేండ్ల నుంచి సుమారు 45 లక్షలు కాజేసినట్టు సమాచారం. ఆమె తాజాగా ఓ భారీ ఇల్లు కొనుగోలు చేయడంతో ఈ విషయాలు బయటకు వచ్చాయి. ఈ మేరకు విశాల్‌ మేనేజర్‌ చెన్నైలోని విరుగంబక్కం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసాడు. సదరు మహిళ ఆదాయపన్ను కట్టాల్సిన డబ్బులు తన సొంత అకౌంట్‌కు బదిలీ చేసి ఆరేండ్లలో 45 లక్షలు […]

Read More
షార్ట్ న్యూస్

ఆలయంలో చోరీ

మునగాల, సారథి న్యూస్​ : మునగాల మండల కేంద్ర శివారులో ఉన్న హరిహరసుత అయ్యప్ప ఆలయంలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఆలయంలో ఉన్న హుండీని పగులగొట్టి భక్తులు స్వామి వారికి సమర్పించిన కానుకలను ఎత్తుకెళ్లినట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు స్థానిక పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. గతంలో మూడు సార్లు ఈ విధంగానే చోరీకి పాల్పడినట్లు ఆలయ నిర్వాహకులు వాపోయారు

Read More
మెదక్ జిల్లాలో కరోనా విజృంభణ

మెదక్ జిల్లాలో కరోనా విజృంభణ

సారథి న్యూస్, మెదక్: మెదక్ జిల్లాలో కరోనా వైరస్ రోజురోజుకూ విస్తరిస్తోంది. లాక్ డౌన్ సమయంలో కేవలం వేళ్లపై లెక్కపెట్టే కేసులు మాత్రమే ఉండగా, లాక్ డౌన్ సడలింపు ఇచ్చిన తర్వాత కరోనా పాజిటివ్ కేసులు దండిగా నమోదవుతున్నాయి. నెలరోజుల వ్యవధిలో జిల్లావ్యాప్తంగా 40 మందికి కరోనా ప్రబలడంతో గమనార్హం. జిల్లాలో ఇప్పటివరకు మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 45కు చేరింది. జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణం, తూప్రాన్, రామాయంపేట పట్టణాల్లో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. జిల్లాకు […]

Read More
మాస్కు లేకుంటే.. జరిమానే

మాస్కు లేకుంటే.. జరిమానే

సారథి న్యూస్, కర్నూలు: జిల్లాలో రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసు సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని ఎస్పీ కాగినెల్లి ఫక్కీరప్ప తెలిపారు. జిల్లాలో మాస్కు ధరించకుండా, నిబంధనలు ఉల్లంఘించిన 7,086 మందిపై కేసు నమోదు చేసి రూ. 5,77,350 జరిమానా విధించినట్లు ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్ప కాగినెల్లి ఆదివారం తెలిపారు. కరోనా కట్టడిలో భాగంగా మాస్కు ధరించకుండా నిర్లక్ష్యంగా తిరుగుతున్న వారిపై జిల్లా పరిధిలో జూన్‌ 24 నుంచి […]

Read More
కరోనా టెస్టింగ్‌.. శభాష్​

కరోనా టెస్టింగ్‌.. శభాష్​

సారథి న్యూస్​, కర్నూలు: ఆంధ్రప్రదశ్​లో రోజు రోజుకు కరోనా పాజిటివ్‌ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కర్నూలు, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో రికార్డు స్థాయిలో రోజుకు వందకుపైగా కేసు నమోదువుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆదేశా మేరకు రాష్ట్ర ప్రభుత్వం కరోనాను నివారించాన్న లక్ష్యంతో ఇంటింటికి వెళ్లి రక్తనమునాలను సేకరిస్తోంది. ఈ క్రమంలో కర్నూలులో రికార్డు స్థాయిలో లక్షకు పైగా శ్యాంపిల్స్‌ సేకరించినట్లు ఆదివారం కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ తెలిపారు. ఇప్పటి వరకు కర్నూలు జిల్లాలో మొత్తం పాజిటివ్‌ కేసులు 2,451 […]

Read More
చిరస్మరణీయుడు.. ధర్మవ్యాధుడు

చిరస్మరణీయుడు.. ధర్మవ్యాధుడు

సారథి న్యూస్, కర్నూలు: మాంసం విక్రయిస్తూ జీవించే వృత్తాంతాన్ని తెలియజేసిన మహనీయుడు ఆరెకటిక గురువు ధర్మవ్యాధుడని, ఆయన సిద్ధాంతాలు ఆచరణీయమని సంఘం నాయకుడు కటికె గౌతమ్‌ అన్నారు. ఆదివారం గురుపౌర్ణమిని పురస్కరించుకుని గురువర ధర్మవ్యాధుడి చిత్రపటానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు. మహాకవి ఎర్రన రచించిన మహాభారతంలోని అరణ్య పర్వశేషంలో ధర్మవ్యాదోపాఖ్యానం ద్వారా ధర్మవ్యాధుడి మాంసం విక్రయిస్తూ జీవించే వృత్తాంతం తెలియజేస్తూ హింస, అహింస సిద్ధాంతాలను తెలియజేయాశారని గుర్తుచేశారు. రాష్ట్రంలోని 8 లక్షల ఆరెకటికల కుటుంబాలకు ప్రత్యేక ఫెడరేషన్‌, […]

Read More
కరోనా కట్టడిలో విఫలం

కరోనా కట్టడిలో విఫలం

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. ఇతర రాష్ట్రాల్లో ఐసీఎంఆర్‌ నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు చేస్తున్నప్పటికీ తెలంగాణలో మాత్రం అలా జరగడం లేదన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ధన్వి హెల్త్‌ కేర్‌ ఆధ్వర్యంలో కరోనాపై ఆదివారం మీడియా ప్రతినిధులకు అవగాహన కల్పించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ప్రైవేట్​ప్రయోగశాలలకు ఐసీఎంఆర్‌ అనుమతిచ్చినా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. విస్తృతంగా పరీక్షలు నిర్వహించి, ప్రజల ప్రాణాలు కాపాడి, కేసుల సంఖ్య […]

Read More
సీఎం ఫామ్ హౌస్​లో ఉంటే కరోనా తగ్గుతుందా?

సీఎం ఫామ్ హౌస్​లో ఉంటే కరోనా తగ్గుతుందా?

సారథి న్యూస్, హైద‌రాబాద్: కరోనాతో చాద‌ర్‌ఘాట్‌లోని తుంబే హాస్పిటల్‌లో చేరిన ఫీవర్ ఆస్పత్రి డీఎంవో సుల్తానాకు కేవ‌లం 24గంటలకు రూ.1.15లక్షల బిల్లు వేయ‌డంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక వైద్యురాలికే ఇలాంటి ప‌రిస్థితి ఎదురైతే ఇక ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లే సాధారణ జ‌నం పరిస్థితి ఏమిటని పలువురు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై ఎంపీ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలి సెల్ఫీ వీడియోను రేవంత్‌రెడ్డి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఒక్క రోజుకు ఆస్పత్రి […]

Read More