సారథి న్యూస్, హైదరాబాద్: సినీ, రాజకీయ ప్రముఖులు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ప్రముఖ దర్శకుడు రాజమౌళికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఆయనతో పాటు కుటుంబసభ్యులకు కూడా కరోనా సోకినట్టు సమాచారం. ‘నేను, నా కుటుంబసభ్యులు కొద్ది రోజులుగా తేలికపాటి జ్వరంతో బాధపడ్డాం. అయితే ఆ తర్వాత జ్వరం తగ్గిపోయింది. కానీ మేము కరోనా టెస్ట్ చేయించుకున్నాం. మాకు కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. […]
అయోధ్య(ఉత్తరప్రదేశ్): అయోధ్యలోని రామాలయం భూమి పూజ కార్యక్రమానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మినహా ముఖ్యమంత్రులు ఎవరికీ ఆహ్వానం లేదని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు తాజాగా ప్రకటించింది. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేను భూమి పూజ కార్యక్రమానికి ఆహ్వానించలేదని విశ్వహిందూ పరిషత్ కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్ కుమార్ చెప్పారు. రామాలయం నిర్మాణం కోసం పోరాడిన కీలకవ్యక్తులైన లాల్ కృష్ణ అద్వాణీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి, వినయ్ కటియార్, సాథ్వీ రితంబర, మాజీ సీఎం కల్యాణ్ […]
సారథి న్యూస్, వరంగల్: కరోనా బారినపడి మరణించిన వారి దహనానికి ప్రత్యంగా శ్మశానవాటికల ఏర్పాటుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని మహానగర పాలక సంస్థ కమిషనర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. బుధవారం వారితో సమీక్షించారు. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్ల కోసం వేర్వేరుగా ప్రత్యేక స్థలాలను గుర్తించాలన్నారు. మృతదేహాలను శ్మశానవాటికలకు తరలించడానికి అంబులెన్సులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. డీఎఫ్ వో కిశోర్ ఆధ్వర్యంలో 12 మంది సిబ్బందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసినట్లు వివరించారు. హోం క్వారంటైన్‌కు మున్సిపల్ గెస్ట్‌హౌస్, […]
నూతన సెక్రటేరియట్ పై సీఎం కేసీఆర్ సారథి న్యూస్, హైదరాబాద్: నూతన సెక్రటేరియట్ నిర్మాణానికి సంబంధించిన డిజైన్లను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పరిశీలించారు. వీటిలో కొన్ని మార్పులను సూచించారు. కొత్త సెక్రటేరియట్ భవనం నిర్మాణంపై బుధవారం ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెక్రటేరియట్ లో అందరూ పనులు చేసుకోవడానికి అనుకూలంగా అన్ని సౌకర్యాలు ఉండేలా చూడాలని ఆదేశించారు. కొత్త సెక్రటేరియట్ లో మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులు, సలహాదారుల […]
సారథి న్యూస్, అలంపూర్: జూన్ నుంచి తమకు జీతాలు ఇవ్వడం లేదని.. ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటూ బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పీటీఐలు (పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్) ఆందోళన చేపట్టారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సుమారు 240 మంది పీటీఐలు పనిచేస్తున్నారు. వీరంతా సర్వ శిక్షా అభియాన్ కింద పనిచేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం తమను ఆదుకోవాలని.. తమకు జీతభత్యాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఇండ్ల వద్ద ఉండి కుటుంబసమేతంగా ఆందోళనకు దిగారు.
రాత్రిపూట కర్ఫ్యూ ఉండదు కేంద్ర హోంశాఖ అన్‌లాక్3.0 మార్గదర్శకాలు న్యూఢిల్లీ: అన్‌లాక్3.0 మార్గదర్శకాలను కేంద్ర హోంశాఖ బుధవారం విడుదల చేసింది. జూలై 31తో అన్‌లాక్ 2.0 గడువు ముగియనుండడంతో.. కేంద్రప్రభుత్వం తాజా మార్గదర్శకాలు విడుదల చేసింది. సినిమా హాళ్లు, వినోద పార్కులు, బార్లు మూసివేయాలని సూచించింది. స్విమ్మింగ్ పూల్స్, యోగా సెంటర్లు, జిమ్‌లకు కేంద్రం అనుమతిచ్చింది. విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లను మూసివేయాలని సూచించింది. రాత్రిపూట కర్ఫ్యూను ఎత్తివేసింది. ఎట్ హోం కార్యక్రమాలపై రాష్ట్రపతి, గవర్నర్లు నిర్ణయం తీసుకుంటారని […]
సారథి న్యూస్, నారాయణఖేడ్, కంగ్టి: కాలం మారుతున్నా కొద్దీ యాంత్రిక శక్తిపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. రైతులు వ్యవసాయ పొలంలో దుక్కులు దున్నేకాడి నుంచి పంటను తీసుకెళ్లే వరకు ప్రతిపనిలో యంత్రాలు, ట్రాక్టర్లను వాడుతున్నారు. కానీ సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో రైతులు పాతకాలం నాటి పద్ధతులనే వాడుతున్నారు. అందుకు ఈ ఫొటోలే నిదర్శనం. కంగ్టి మండల పరిధిలోని చాప్టా(కే) గ్రామంలో యూరియా, డీఏపీ మందు సంచులు, సేంద్రియ ఎరువులను […]
ఇప్పటికే అలవైకుంఠపురంలో చిత్రంలో పూజా హెగ్డే తన కాళ్ల అందాలతో యువతను కట్టిపడేసిన విషయం తెలిసిందే. ఆమె కాళ్ల అందానికి చిత్రపరిశ్రమలోని దర్శకులందరూ పడిపోయినట్టున్నారు. తాజాగా అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ అనే ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని బన్నీ వాస్ తన జిఎ 2 పతాకంపై నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్లోనూ పూజ తన కాళ్లతో అఖిల్ చెవులను టచ్చేస్తుంది. ఈ […]