ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. శనివారం రాత్రి వరకు రాష్ట్రంలో 3,00,937 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 8,348 కొత్త కేసులు గుర్తించినట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 11,596 మంది కరోనాతో మృతిచెందారు. కాగా లక్షా 65 వేల మంది వ్యాధినుంచి కోలుకున్నారు. దేశంలో అత్యధిక కేసులు మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి.
సారథి న్యూస్, మెదక్: మెదక్ జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో రైతువేదికల నిర్మాణాలను త్వరగా ప్రారంభించాలని కలెక్టర్ ధర్మారెడ్డి సూచించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్లో జిల్లాలోని ఆయా మండలాల ప్రత్యేకాధికారులతో సమావేశం నిర్వహించారు. రైతువేదికల నిర్మాణానికి జిల్లాలో 76 క్లస్టర్లుగా విభజించామన్నారు. పనుల పురోగతిని ఫొటోలు తీసి అప్లోడ్ చేయాలని సూచించారు. గ్రామాల్లో ఎలాంటి విద్యుత్ సమస్యలు తలెత్తినా వెంటనే స్పందించేలా సిబ్బందిని అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. సమావేశంలో పంచాయతీరాజ్ ఈఈ వెంకటేశ్వర్లు, డీఆర్డీవో శ్రీనివాస్, జిల్లా […]