సారథి న్యూస్, మహబూబ్ నగర్: ఈ ఏడాది తొలిసారి 20 రోజుల ముందుగానే ఆదివారం జూరాల ప్రాజెక్టు నుంచి కుడి, ఎడమ కాల్వల ద్వారా నీటిని మంత్రి ఎస్.నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అబ్రహాం, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి విడుదల చేశారు. ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి నీరు జూరాల ప్రాజెక్టుకు చేరకపోయినా జూరాల కుడి ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేశారు. ఈ సారి ఎగువ భారీగా వర్షాలు […]
న్యూఢిల్లీ: తాను క్షేమంగా ఉన్నానని బాలీవుడ్ నటి హేమమాలిని స్పష్టం చేశారు. తనకు కరోనా సోకిందని, వెంటిలేటర్‌పై చికిత్సపొందుతున్నానని సోషల్‌మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలేనని ఆమె స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె ఆదివారం ఓ ట్వీట్ చేశారు. ‘సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు చూసి చాలా మంది నాకు ఫోన్లు చేస్తున్నారు. అవన్నీ అవాస్తవాలే. దయచేసి నా ఆరోగ్యం విషయంపై వదంతులు పుట్టించకండి. నాకు ఏమైనా ఇబ్బంది కలిగితే స్వయంగా నేనే చెప్తా. నా శ్రేయోభిలాషులు, […]
ఢిల్లీ: రాజస్థాన్‌లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. తన వెంట 30మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ ప్రకటించారు. రేపు రాజస్థాన్‌లో జరగబోయే కాంగ్రెస్ శాసనసభ సమావేశానికి తాను తన మద్దతుదారులైన ఎమ్మెల్యేలు హాజరు కావడం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. రాజస్థాన్‌లో మొత్తం 200 స్థానాలకు గానూ, కాంగ్రెస్‌కు 107 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. 12 మంది స్వతంత్రలు ఆపార్టీకి మద్దతు ఇస్తున్నారు. కాగా […]
ముంబై: బాలీవుడ్ నటి ఐశ్వర్య, ఆమె కూతురు ఆరాధ్యకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. వారిద్దరూ ప్రస్తుతం ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు. కాగా కరోనా సోకిన బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబచ్చన్, ఆయన కుమారుడు, నటుడు అభిషేక్ బచ్చన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే జయబచ్చన్‌కు తప్ప వారింట్లోని వారందరికీ కరోనా సోకింది. కాగా ఐశ్వర్య, ఆరాధ్య ఇంట్లోనే చికిత్స పొందుతున్నారని అభిషేక్ బచ్చన్ ట్వీట్ చేశారు. ఇటీవల వీరిని కలిసిన బాలీవుడ్ నటుల్లో ప్రస్తుతం […]
సారథి న్యూస్, బెజ్జంకి: రహదారులపై కల్వర్టులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని యువజన కాంగ్రెస్ నేత పోతిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఆరోపించారు. వర్షాకాలంలో కురిసిన భారీవర్షాలకు వాగులు, ఒర్రెలు పొంగి పొర్లుతున్నాయన్నారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని తాళ్లపల్లి, గూడెం, వడ్లూర్, బేగంపేట్, లక్ష్మీపూర్, ఎల్లంపల్లి, తలారివానిపల్లి గ్రామాలకు వెళ్లేదారుల్లో కల్వర్టులు లేక రాత్రివేళల్లో ప్రజలు అనేక రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించి కల్వర్టులు నిర్మించాలని డిమాండ్ చేశారు.
సారథిన్యూస్, రామడుగు: కురుమ యువ చైతన్యసమితి జిల్లా కమిటీని ఆదివారం ఎన్నుకొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా చిర్ర చందు, ఉపాధ్యక్షుడిగా గోరికే నరసింహ, జిల్లా అధ్యక్షుడిగా చిమ్మల్ల మహేశ్, రామడుగుమండలం ప్రధాన కార్యదర్శి గా పెద్ది వీరేశం చొప్పదండి మండలం ఉపాధ్యక్షులుగా బాగోతం అజయ్, జాతరకొండ మహేశ్, రాజన్నల తిరుపతి, ఒగ్గరి శ్రీనివాస్ కోశాధికారిగా ఎల్లమ్మల కృష్ణమరాజ్ తదితరులు ఎన్నికయ్యారు.
సారథి న్యూస్, హుస్నాబాద్: తోటి ప్రజాప్రతినిధిని కులం పేరుతో దూషించిన ఓ సర్పంచ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. కరీంనగర్ జిల్లా అక్కన్నపేట మండలం గండిపల్లి గ్రామంలో శనివారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపీటీసీ బానోతు ప్రమీళ హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ సృజనకు ఎంపీటీసీకి మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. ఈ క్రమంలో విచక్షణ కోల్పోయిన సర్పంచ్.. ఎంపీటీసీని కులం పేరుతో దూషించింది. సర్పంచ్‌తోపాటు ఆమె భర్త వంగపల్లి సంపత్‌కుమార్, అత్త అచ్చవ్వ, […]
ఇరిగేషన్‌శాఖలో నాలుగు విభాగాలు వద్దు ప్రత్యేక సమీక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటి రంగం ఉజ్వలంగా మారిందని, భారీ ప్రాజెక్టులు, కాల్వలు, రిజర్వాయర్లు అందుబాటులోకి వచ్చాయని, కోటికి పైగా ఎకరాలకు సాగునీరు అందించే గొప్ప వ్యవస్థ ఏర్పడిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న భారీ ప్రాజెక్టుల ద్వారా వచ్చే నదీ జలాలను వీలైనంత ఎక్కువ వ్యవసాయ భూములకు అందించే విధంగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని సూచించారు. ప్రాజెక్టుల […]