సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా మహమ్మారి ధాటికి బంగారం ధరలు రికార్డు స్థాయిలో దూసుకెళ్తున్నాయి. మంగళవారంర 10 గ్రామాల బంగారం రూ.50,670కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లలో పుంజుకున్న ధరలు, దేశీయస్టాక్ మార్కెట్లలో అమ్మకాలు, దేశీయ కరెన్సీ రూపాయి బలహీనం నేపథ్యంలో పసిడికి డిమాండ్ పెరిగింది. కేజీ వెండి రూ.48,510 పలుకుతోంది. గ్రాము వెండి రూ.485.10 ఉంగా, 10 గ్రాముల వెండికి రూ.4,851 ఉంది.
ప్రముఖ నిర్మాత అల్లూ అరవింద్ ప్రారంభించిన ‘ఆహా’ ఓటీటీలో తమన్నా ఓ టాక్‌షో చేయనున్నట్టు సమాచారం. ఇందుకు బన్నీ ఆమెను ఒప్పించాడని టాక్. కరోనా ప్రభావంతో ఇప్పట్లో థియేటర్లు ఒపెన్ కావడం కష్టమే. ఈ నేపథ్యంలో తారలందరూ ఓటీటీ వెంట పడుతున్నారు. ఇప్పటికే కొన్ని సినిమాలు ఓటీటీలో విడుదలయ్యాయి. ఆర్జీవీ అయితే ఓటీటీని ఓ రేంజ్లో వాడేసుకుంటున్నారు. ఈ క్రమంలో సినిమాలు తగ్గిన మిల్కీ బ్యూటీ ఆహాలో టాక్ షోలో వ్యాఖ్యాతక చేసేందుకు ఒప్పుకున్నట్టు సమాచారం. ఈ […]
నాగ్‌పూర్: మద్యం దొరకలేదని శానిటైజర్ తాగిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన గౌతమ్ గోస్వామి (45) స్థానిక మున్సిపాలిటీలో క్లీనింగ్ వర్కర్‌గా పనిచేస్తున్నాడు. మద్యం దొరకపోవడంతో శానిటైజర్ తాగితే కిక్కు వస్తుందని భావించిన గోస్వామి తన ఇంట్లో ఉన్న శానిటైజర్‌ను తాగాడు. దీంతో అతడు అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన స్థానికులు అతడిని దవాఖానకు తీసుకెళ్లారు. అక్కడి వైద్యలు చికిత్సచేసి పంపించారు. రెండ్రోజుల అనంతరం ఆరోగ్యం క్షీణించి మృతిచెందాడు.
సారథి న్యూస్, కర్నూలు: గ్రామ, వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు ప్రజలకు మరింత చేరువవుతూ మెరుగైన సేవలు అందించాలని ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ సూచించారు. మంగళవారం కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలోని వర్కురు సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీచేసి పలు రికార్డులను పరిశీలించారు. రైతులకు వన్ బీ, అడంగల్ తదితర సర్టిఫికెట్లు జారీచేస్తూ వచ్చిన డబ్బును బ్యాంకులో జమ చేస్తున్నారా? అనే విషయాలను సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట జేసీ […]
సారథిన్యూస్, అనంతపురం: ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొన్న ఘటనలో ఓ లారీ డ్రైవర్ సజీవదహనమయ్యాడు. ఈఘటన అనంతరం జిల్లా తాడిపత్రి సమీపంలోని కడప రహదారిపై చోటుచేసుకున్నది. తాడిపత్రి నుంచి ఓ లారీ వరిపొట్టు లోడుతో వస్తున్నది. ఈ లారీని ఎదురుగా వస్తున్న మరో లారీ ఢీకొన్నది. ఈ ప్రమాదంలో మంటలు చెలరేగి ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన లారీడ్రైవర్ నిశార్ సజీవదహనం అయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు
సారథి న్యూస్, హైదరాబాద్: ఎక్కడైనా తింటే బిల్లు కడతాం. కానీ, కొన్ని ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు మాత్రం మీరు తినకున్నా సరే.. బిల్లు మాత్రం కట్టాల్సిందేనని చెబుతున్నాయి. ఇది విన్న విద్యార్థుల పేరెంట్స్ నోరెళ్ల బెడుతున్నారు. అనేక ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు, సెమీ రెసిడెన్షియల్‌గా నడుస్తున్నాయి. సెమీ రెసిడెన్షియల్ అంటే విద్యార్థి ఉదయం వెళ్లేటప్పుడు ఇంట్లో టిఫిన్ తిని స్కూలుకో, కాలేజీలో వెళ్తాడు. మధ్యాహ్నం భోజనం పెడతారు. సాయంత్రం క్లాసులు పూర్తయిన తర్వాత కూడా వారికి స్టడీ […]
సారథిన్యూస్, జనగామ: సెల్‌ఫోన్ కొనివ్వలేదని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం రాఘవాపురంలో చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన శ్రీకాంత్(20) కొంతకాలంగా సెల్ ఫోన్ కొనివ్వాలంటూ తల్లిదండ్రులు అడుతున్నాడు. ఆర్థికపరిస్థితి బాగా లేకపోవడంతో వారు కొనివ్వలేకపోయారు. దీంతో మనస్తాపం చెందిన శ్రీకాంత్ పురుగులమందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు అతడిని దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు.
ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని బురిగాంగ నదిలో పడవ బోల్తా పడి దాదాపు 32 మంది ప్రాణాలో కోల్పోయారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓల్డ్ ఢాకాలోని శ్యాంబజార్ ప్రాంతం వెంట సోమవారం ఉదయం 9:15 గంటలకు యమ్ ఎల్ మార్నింగ్ బర్డ్ అనే పడవ మునిగిపోయింది. ఆ సమయంలో పడవలో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ పడవ మరొకపడవను ఢీకొట్టడంతో దీనిలోకి నీరు చేరుకున్నది. పడవ సామర్థ్యం ప్రకారం 45 మంది ప్రయాణికులను మాత్రమే […]