Breaking News

Day: June 24, 2020

పెట్రోధరలు తగ్గించండి

సారథి న్యూస్, హుస్నాబాద్: పెంచిన పెట్రోధరలను వెంటనే తగ్గించాలని సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్​రెడ్డి డిమాండ్​ చేశారు. కరీంనగర్​ జిల్లా హుస్నాబాద్​లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా అంతకంతకూ పెరుగుతున్నా.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకుండా ప్రజారోగ్యాన్ని గాలికొదిలాయని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా ఈ నెల 25న సీపీఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఆందోళనలు చేపడుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యులు ఎడ్ల వెంకట్రామిరెడ్డి, సీపీఐ జిల్లా […]

Read More

మామను చంపిన అల్లుడు అరెస్ట్​

నల్లగొండ, సారథి న్యూస్: పిల్ల నిచ్చిన మామను హత్యచేసిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండకు చెందిన చింతల గోపీ ఈ నెల 20న తన కుమారుడు రిత్విక్​కు పుట్టు వెంట్రుకల వేడుక చేశారు. ఈ కార్యక్రమానికి ఏపీలోని నందిగామ నుంచి అతడి మామ వంటిపులి వెంకటేశ్వర్లు వచ్చారు. తన కూతురును పుట్టింటికి తీసుకెళ్లేందుకు ఫంక్షన్నం​ అనంతరం నల్లగొండలోనే ఉండిపోయారు. మరునాడు మామా, అల్లుడు ఇంట్లోనే […]

Read More

పెట్రోలును దాటేసిన డీజిల్

న్యూఢిల్లీ: దేశంలో డీజిల్‌, పెట్రోల్‌ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. డీజిల్‌ ధర వరుసగా బుధవారం 18వ రోజు పెరిగింది. పెట్రోల్‌ ధరలు మాత్రం యథాతథంగానే ఉన్నాయి. దీంతో డీజిల్‌ రేటు పెట్రోల్‌ను మించిపోయింది. పెట్రోల్‌ ధర కంటే డీజిల్‌ ధర ఎక్కువగా ఉండడం ఇదే తొలిసారి. డీజిల్‌పైన 0.48 పైసలు పెంచారు. దీంతో ఢిల్లీలో రూ.79.40 ఉన్న డీజిల్‌ ధర ప్రస్తుతం రూ.79.88కి చేరింది. పెట్రోల్‌ ధర రూ.79.76గా ఉంది. ఈ 18 రోజుల్లో పెట్రోల్‌పై రూ.9.41, […]

Read More

రూమర్స్‌ వల్లే ఢిల్లీలో గొడవలు

న్యూఢిల్లీ: బీజేపీ లీడర్‌‌ కపిల్‌ శర్మ మద్దతుదారులు యాంటీ సీఏఏ, ఎన్నార్సీ ఆందోళన జరుగుతున్న ప్లేస్‌లో స్టేజ్‌కు నిప్పుపెట్టారని రూమర్‌‌ స్ర్పెడ్‌ అవడంతో ఢిల్లీలో గొడవలు చేలరేగాయని పోలీసులు అధికారి ఒకరు చెప్పారు. ఢిల్లీలో ఫిబ్రవరిలో జరిగిన యాంటీ సీఏఏ, ఎన్నార్సీ గొడవల్లో ఓ కానిస్టేబుల్‌ చనిపోయిన ఘటనపై పోలీసులు చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ చార్జ్‌షీట్‌ తయారు చేసినట్లు పోలీసులు చెప్పారు. ‘చాంద్‌బాగ్‌లో కపిల్‌మిశ్రా మద్దతుదారులు నిప్పుపెట్టారని చెప్పడంతో […]

Read More

హరితహారానికి అంతా రెడీ

సారథి న్యూస్, హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో గురువారం నిర్వహించే ఆరో విడత హరితహారం కార్యక్రమానికి అంతా రెడీచేశామని నగర మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. ఎమ్మెల్యే కాలనీలోని విజయ నర్సరీని బుధవారం ఆయన అధికారులతో కలిసి సందర్శించారు. 29 నర్సరీలు 50 లక్షల మొక్కలతో సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. హైదరాబాద్​నగర ప్రజలు విరివిగా పాల్గొని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు

Read More
షార్ట్ న్యూస్

కరోనాతో మరో ఎమ్మెల్యే మృతి

భారత్​లో కరోనా కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో15,968మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,56,183 కు చేరింది. గత 24 గంటలలో కరోనాతో 465 మంది మరణించగా, మొత్తం మరణాల సంఖ్య 14,476కు చేరింది. ఇప్పటివరకు 2,58,685 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం 1,83,022 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే తమోనాష్ ఘోష్ కరోనాతో బుధవారం […]

Read More

మున్సిపల్ ​నివేదిక ఆవిష్కరణ

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మున్సిపల్​శాఖ 20 19 – 20 వార్షిక నివేదికను బుధవారం మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మున్సిపల్​శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ఆవిష్కరించారు. టీఆర్ఎస్ ​ప్రభుత్వం మున్సిపాలిటీల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని మంత్రులు అన్నారు.

Read More

సొంత నిధులతో రైతు వేదిక

సారథిన్యూస్​, ఖమ్మం: ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో రాష్ట్రానికే ఆదర్శనీయంగా రైతు వేదిక నిర్మిస్తున్నామని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ పేర్కొన్నారు. రైతు వేదిక నిర్మాణపనులను బుధవారం మంత్రి పరిశీలించారు. ఈ రైతు వేదికను మంత్రి అజయ్​ రూ.40 లక్షలు సొంత నిధులు వెచ్చించి నిర్మిస్తున్నారు. మంత్రి వెంట కలెక్టర్​ ఆర్వీ కర్ణన్​, ఎమ్మెల్సీ బాలసాని, రైతుబంధు జిల్లా కన్వీనర్​ నల్లమల వెంకటేశ్వరరావు, ఏఎమ్సీ చైర్మన్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

Read More