Breaking News

Day: June 19, 2020

ఆటగాళ్లకు స్వేచ్ఛ ఇవ్వడం వల్లే

న్యూఢిల్లీ: సుదీర్ఘ కెరీర్లో ఎన్నో ఘనతలు సాధించిన బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్.. కెప్టెన్​గా మాత్రం విజయవంతం కాలేకపోయాడనే ఓ విమర్శ మాత్రం అలాగే ఉంది. అయితే దీనిపై చాలా మంది భిన్న అభిప్రాయాలను వెల్లడించారు. 1983 ప్రపంచకప్ విజేత టీమ్ సభ్యుడు మదన్​లాల్​ మాత్రం దీనిని అంగీకరించడం లేదు. సారథిగా సచిన్​ విఫలమయ్యాడని తాను అంగీకరించనని చెప్పాడు. ‘సచిన్ గొప్ప సారథి. కాదని ఎవరు చెప్పినా వాళ్లకు ఆటపై అవగాహన లేనట్లే. ఓ కెప్టెన్​గా అతను […]

Read More

ఆసీస్ బ్యాటింగ్ కోచ్ గ్రేమ్ హిక్​ పై వేటు

పెర్త్: కరోనా నేపథ్యంలో.. భారీగా ఖర్చులు తగ్గించుకునే పనిలో పడిన క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) మరో నిర్ణయం తీసుకుంది. సీఈవో కెవిన్ రాబర్ట్​ను తొలగించిన తరహాలోనే.. బ్యాటింగ్ కోచ్ గ్రేమ్ హిక్​ ను కూడా ఇంటికి సాగనంపింది. భారీ వేతనం ఇవ్వాల్సి వస్తుండటంతో.. అదనపు భారంగా భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చీఫ్ కోచ్ జస్టిన్ లాంగర్ వెల్లడించాడు. ‘అంబ్రోస్, వాల్ష్ బౌలింగ్​ను హెల్మెట్ లేకుండా ఆడటం ఎంత భయంకరగా ఉంటుందో.. కరోనాను కూడా ఎదుర్కోవడం అలాగే […]

Read More

జగన్నాథ రథయాత్ర వద్దు

న్యూఢిల్లీ/భువనేశ్వర్‌: చారిత్రక జగన్నాథ రథయాత్రను ఈ సారి నిర్వహించవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. జూన్​ 23 నుంచి ఒడిశాలోని పూరిలో రథయాత్ర ప్రారంభం కావలసి ఉన్నది. కాగా కరోనా విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో రథయాత్రను నిలిపివేయాలని ఓ స్వచ్ఛంద సంస్థ పిటిషన్​ దాఖలు చేసింది. రథయాత్రకు అనుమతిస్తే భారీగా ప్రజలు గుమిగూడతారని స్వచ్ఛంద సంస్థ తరఫున సీనియర్​ న్యాయవాది ముకుల్​ రోహతి వాదించారు. ఇతడి వాదనతో ఏకీభవించిన ధర్మాసనం రథయాత్రను నిలిపివేయాలని ఒడిశా ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూరీ […]

Read More

జోనల్‌ కమిషనర్‌కు కరోనా

సారథిన్యూస్​, హైదరాబాద్​: రాష్ట్రంలో టెస్టుల సంఖ్య పెంచడంతో కరోనా కేసులూ భారీగా నమోదవుతున్నాయి. గురువారం ఏకంగా 352 మందికి పాజిటివ్‌ వచ్చింది. రాష్ట్రంలో 300 మందికిపైగా పాజిటివ్‌ నమోదవడం ఇదే తొలిసారి. గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే 303 కేసులు వచ్చాయి. మరోవైపు జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఖైరతాబాద్‌ జోనల్‌ కమిషనర్‌కు వైరస్‌ సోకింది. 3 రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ అని తేలింది. సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లిలో నివాసం ఉండే సదరు ఐఏఎస్‌ అధికారిణి.. ప్రస్తుతం […]

Read More

నవ దంపతుల దుర్మరణం

ఏలూరు టౌన్‌: రోడ్డు ప్రమాదం నవదంపతులను బలిగొన్నది. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా పూళ్ల గ్రామం సమీపంలో జాతీయ రహదారిపై చోటుచేసుకున్నది. ప్రమాదంలో డ్రైవర్‌ కూడా మృతిచెందగా, వధువు సోదరుడు తీవ్రగాయాలతో బయటపడ్డాడు. విశాఖ జిల్లా సబ్బవరానికి చెందిన యడ్లపల్లి వెంకటేష్‌కు గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని గోవాడకు చెందిన ఆలపాటి మానస నవ్యతో ఈ నెల 14న రాత్రి గోవాడలో వివాహం జరిగింది. వివాహం అనంతరం గురువారం వధువు సోదరుడు భరత్‌తో కలిసి నవ దంపతులు […]

Read More

వకీల్​సాబ్​కు నో చెప్పిన శృతి

పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘వకీల్ సాబ్’ చిత్రంలో నటించేందుకు శృతి హాసన్​ ఒప్పుకోలేదని సమాచారం. బాలీవుడ్ ‘పింక్’ చిత్రానికి రీమేక్‌గా ఈ చిత్రం రూపొందుతున్నది. ఈ చిత్రంలో శృతిహాసన్​ పాత్రకు అంత ప్రాముఖ్యత లేకపోవడంతో ఆమె నటించేందుకు అంగీకరించలేదట. చాలా గ్యాప్​ తర్వాత తెలుగులో నటిస్తుండటంతో తక్కువ నిడివి ఉన్న పాత్రలు, ఐటమ్ సాంగ్స్ వంటివి చేయకూడదనే శృతి నిర్ణయం తీసుకుందట. ఈ చిత్రంలో శృతిహాసనే హీరోయిన్ అంటూ గత రెండు మూడు నెలలుగా […]

Read More

76 మంది జవాన్లకు గాయాలు

ఢిల్లీ: లద్దాఖ్‌లోని గాల్వన్‌ లోయలో భారత్‌, చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో 76 మంది ఇండియన్​ ఆర్మీ జవాన్లు గాయపడ్డారని సంబంధిత అధికారులు ప్రకటించారు. గాయపడినవారిలో 18 మంది లేహ్‌లోని హాస్పిటల్​లో చికిత్స పొందుతున్నారని, వారు 15 రోజుల్లో డ్యూటీలో చేరే అవకాశం ఉందన్నారు. కాగా మిగిలిన 56 మంది వివిధ హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్నారని, వారంతా రెండు వారాల్లో తిరిగి విధులకు హాజరవుతారని పేర్కొన్నారు. జూన్‌ 15 అర్ధరాత్రి తర్వాత గాల్వన్‌‌ లోయలోని పెట్రోల్‌ […]

Read More

రూ.140 కోట్లతో 42 చెక్ డ్యామ్​లు

సారథి న్యూస్​,నాగర్​కర్నూల్​: అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు పర్యవేక్షణకు ‘దిశ’ చక్కని వేదిక అని నాగర్​ కర్నూల్​ ఎంపీ, ‘దిశ’ కమిటీ చైర్మన్ పోతుగంటి రాములు అన్నారు. గురువారం నాగర్ కర్నూల్​ జిల్లా కేంద్రంలోని తిరుమల టవర్స్ లో నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ(దిశ) సమావేశం ఎంపీ అధ్యక్షత జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ రాములు మాట్లాడుతూ.. దిశ కమిటీ కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే నిధులు ఖర్చు, పథకాలు అమలు తదితరాలను […]

Read More