Breaking News

Day: June 8, 2020

కొత్తగా 92 కరోనా కేసులు

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో సోమవారం కొత్త 92 కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. మరో ఐదుగురు మహమ్మారి బారినపడి చనిపోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా రోగుల సంఖ్య 3,745కు చేరింది. చనిపోయిన సంఖ్య 144 కు చేరింది. వివిధ ఆస్పత్రుల్లో 1866 మంది ట్రీట్​మెంట్​ పొందుతున్నారు. తాజాగా, 393 మంది కరోనా పాజిటివ్​ పేషెంట్లను గాంధీ ఆస్పత్రి నుంచి క్వారంటైన్​కు తరలించినట్లు సూపరింటెండెంట్​ రాజారావు తెలిపారు. వీరిలో 310 మందిని హోం క్వారంటైన్​, మిగతా 83 […]

Read More

జర్నలిస్టులందరికీ కరోనా టెస్టులు

సారథి న్యూస్​, హైదరాబాద్​: జర్నలిస్టులందరికీ కరోనా వైద్యపరీక్షలు చేయించాలని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ను కోరారు. సోమవారం బీఆర్​కే భవన్ లో మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. విధుల నిర్వహణలో జర్నలిస్టులు జాగ్రత్తగా ఉండాలని మంత్రి సూచించారు. భౌతిక దూరం పాటించడంతో పాటు మాస్క్​లు కచ్చితంగా కట్టుకోవాలని కోరారు.

Read More

నిమ్స్​ను సందర్శించిన గవర్నర్​

సారథి న్యూస్​, హైదరాబాద్: నిమ్స్ హాస్పిటల్ ను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ సోమవారం సందర్శించారు. కరోనా మహమ్మారి బారినపడి చికిత్స పొందుతున్న డాక్టర్లు, వైద్యసిబ్బందిని ఆమె పరామర్శించారు. నిమ్స్‌లో ఇప్పటివరకు నలుగురు ప్రొఫెసర్లు, 8 మంది రెసిడెంట్‌ డాక్టర్లు, 8మంది పారామెడికల్‌ సిబ్బంది కరోనా బారినపడ్డారు. ధైర్యంగా ఉండాలని వారికి సూచించారు.

Read More

ప్రజల కనీస అవసరాలు తీర్చండి

సారథి న్యూస్​, హైదరాబాద్​: ప్రజల కనీస అవసరాలు తీర్చడంపై దృష్టి పెట్టాలని మున్సిపల్​, ఐటీశాఖ మంత్రి కె.తారకరామారావు ప్రజాప్రతినిధులు, అధికారులకు సూచించారు. కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లలో మౌలిక సదుపాయాల కల్పనపై సోమవారం హైదరాబాద్​లో సమీక్ష సమావేశం నిర్వహించారు. వానాకాలంలో సీజనల్​ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పారిశుద్ధ్యం, రోడ్ల నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. మోడ్రన్​ స్లాటర్ హౌస్ లు నిర్మించాలన్నారు. సమావేశంలో మంత్రులు గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యేలు […]

Read More

సైకిల్​ తొక్కుతూ వెళ్లి.. శవమై

సారథి న్యూస్, రామడుగు: ప్రమాదవశాత్తు ఓ బాలుడు బావిలో పడి చనిపోయాడు. ఈ విషాదకర సంఘటన సోమవారం కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్​ గ్రామంలో విషాదం నింపింది. గ్రామానికి చెందిన మల్లేశం కొడుకు రేవంత్​(9) ఆదివారం మధ్యాహ్నం సైకిల్​ తొక్కుతూ వెళ్లి ఇంటి ముందున్న బావిలో పడ్డారు. కొడుకు కనిపించడం లేదని వెతికిన తల్లిదండ్రులకు బావిలో శవమై కనిపించాడు. బావి యజమానిపై కేసు నమోదుచేసినట్లు ఎస్సై అనూష తెలిపారు.

Read More

ఈత సిరప్ ఆవిష్కరణ

సారథి న్యూస్​, హైదరాబాద్​: రవీంద్రభారతిలోని తన ఆఫీసులో తెలంగాణ ఫామ్ నీరా, ఫామ్ ప్రొడక్ట్ రీసెర్చ్ ప్రొడక్షన్, వేద ఫామ్ ప్రొడక్ట్స్ సంస్థ తయారుచేసిన తాటి బెల్లం, ఈత సిరప్ ఉత్పత్తులను మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ సోమవారం విడుదల చేశారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షుడు పల్లె లక్ష్మణరావు గౌడ్. టీఆర్ఎస్ నాయకులు ఆనంద్ గౌడ్, గౌడ సంఘం నాయకులు అంబాల నారాయణ గౌడ్, వింజమూరి సత్యంగౌడ్, భానుచందర్ పాల్గొన్నారు.

Read More

షేక్‌పేట తహసీల్దార్‌ సుజాత అరెస్ట్‌

సారథి న్యూస్​, హైదరాబాద్​: బంజారాహిల్స్‌ భూ వివాదం కేసులో షేక్‌పేట తహసీల్దార్‌ సుజాత సోమవారం అరెస్ట్‌ అయ్యారు. ఖలీద్‌ అనే వ్యక్తి నుంచి లంచం తీసుకున్నట్లు ఆధారాలు లభ్యం కావడంతో ఆమెను ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో ఆమెను మూడు రోజులుగా అవినీతి నిరోధక శాఖ అధికారులు విచారిస్తున్నారు. ఈ కేసులో రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ నాగార్జున రెడ్డి, బంజారాహిల్స్‌ సెక్టార్‌ ఎస్సై రవీంద్ర నాయక్‌ను ఇప్పటికే అధికారులు […]

Read More
షార్ట్ న్యూస్

కరాటే శిక్షణకు అనుమతివ్వండి

సారథి న్యూస్​,రంగారెడ్డి: లాక్​ డౌన్​ నేపథ్యంలో మూసి ఉంచిన కరాటే శిక్షణ కేంద్రాలను నిర్వహించేందుకు పర్మిషన్​ ఇవ్వాలని ఎల్బీనగర్ నియోజకవర్గం కరాటే మాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు టీవీ శ్రీరాములు, ఆర్గనైజర్స్ పి.శ్రీశైలం యాదవ్, జి.నాగరాజు లు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. సోమవారం కర్మన్​ఘాట్​ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో కరాటే మాస్టర్లు మీటింగ్​ నిర్వహించారు. ఈ శిక్షణ కేంద్రాలను నమ్ముకుని జీవనం సాగిస్తున్న మాస్టర్స్ తమ జీవనోపాధి కోల్పోయారని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ పోషణ పెనుభారంగా మారిందని, […]

Read More