Breaking News

Day: June 5, 2020

ఫ్లైట్స్ వస్తేనే వస్తా..

బాలీవుడ్ శృంగార తార సన్నీలియోన్ ప్రస్తుతం అమెరికా లాస్ ఏంజెల్స్ లో చిక్కుకుంది. ఓ వైపు సినిమాలు.. స్టార్ స్టక్ బ్యూటీ బిజినెస్ లతో బిజీగా ఉండే సన్నీలియోన్ తన పర్సనల్ విషయాలను సోషల్ మీడియాలో ఎప్పటిప్పుడు షేర్ చేస్తూనే ఉంటుంది. ముంబైలో నివాసముండే సన్నీ 2011లో మ్యూజిషియన్ డానియల్ ను పెళ్లి చేసుకుని ముగ్గురు పిల్లల తల్లిగా తన బాధ్యతలను మోయడమే కాదు స్టేట్స్ లో ఉండిపోయిన ఆమె అత్తగారి సంరక్షణార్థం అక్కడికెళ్లిందట. అత్తగారు పెద్ద […]

Read More

కరోనా కేసుల్లో ఇటలీని మించి

న్యూఢిల్లీ: మన దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకి విజృంభిస్తోంది. రోజు రోజుకు వేల కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఈ గ్రోత్‌ రేట్‌ ఇలానే కొనసాగితే ఇటలీని బీట్‌ చేస్తామని వైద్యాధికారులు చెప్పారు. కేంద్ర లాక్‌డౌన్‌లో సడలింపులు ఇచ్చిన తర్వాత కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. గురువారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 9,304 కేసులు నమోదవ్వడంతో కేసుల సంఖ్య 2,16,919కి చేరింది. ఈ కేసుల సంఖ్య ఇలానే పెరిగితే రెండ్రోజుల్లో దాదాపు 2, 34, 919కి చేరుతుందని […]

Read More

మలింగ.. వరల్డ్​ బెస్ట్​ యార్కర్ బౌలర్

న్యూఢిల్లీ: శ్రీలంక పేసర్ లసిత్ మలింగ.. ప్రపంచ క్రికెట్​లో అత్యుత్తమ యార్కర్ బౌలర్ అని టీమిండియా స్టార్ జస్​ప్రీత్​ బుమ్రా అన్నాడు. అంతర్జాతీయ క్రికెట్​లో సుదీర్ఘకాలంగా తన మిస్టరీ డెలివరీలతో ఇబ్బందులు పెడుతూనే ఉన్నాడన్నాడు. ‘మలింగ అలుపన్నదే లేకుండా బౌలింగ్ చేస్తాడు. అది కూడా బెస్ట్ యార్కర్లతో. అతని డెలివరీ కూడా పెద్దగా అర్థం కాదు. అర్థమైనట్లే ఉంటుంది కానీ ఆడడం చాలాకష్టం. ఇదే అతని బలం. అంతర్జాతీయ క్రికెట్​లో ఆ బలాన్ని ఇంకా కొనసాగించడం మరో […]

Read More

హైదరాబాద్ ఓపెన్ లేనట్లే

న్యూఢిల్లీ: కరోనా వైరస్ పెరుగుతున్న నేపథ్యంలో బ్యాడ్మింటన్ టోర్నీలు మరింత ఆలస్యంగా మొదలుకానున్నాయి. ఈ సీజన్​లో జరగాల్సిన టోర్నీలకు సంబంధించి రివైజ్డ్ షెడ్యూల్​ను ప్రకటించిన అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సంఘ (బీడబ్ల్యూఎఫ్) తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఈ క్రమంలో ఆగస్ట్ 11 నుంచి 16 వరకు జరగాల్సిన హైదరాబాద్ ఓపెన్​ను రద్దుచేసింది. సందిగ్దంలో ఉన్న ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ (జూన్‌ 2–7), కొరియా ఓపెన్‌ (నవంబర్‌ 24–29) టోర్నీలను కూడా రద్దు చేసింది. ప్రస్తుతం కొన్ని దేశాల్లో పరిస్థితులు వేగంగా […]

Read More

శ్రీనాథ్ తోనే మొదలైంది..

న్యూఢిల్లీ: భారత్​లో పేస్ బౌలింగ్ విప్లవం.. జవగల్ శ్రీనాథ్​లోనే మొదలైందని హైదరాబాద్ బ్యాట్స్​మెన్​ వీవీఎస్ లక్ష్మణ్ అన్నాడు. అప్పటివరకు స్పిన్​పై ఆధారపడిన టీమిండియాలో.. ఒక్కసారిగా మార్పు మొదలైందన్నాడు. అలా మొదలైన మార్పు.. ఇప్పుడు అద్భుత ఫలితాలను అందిస్తోందన్నాడు. ‘శ్రీనాథ్.. మైసూర్‌ నుంచి వచ్చిన ఓ ఘటికుడైన ఫాస్ట్ బౌలర్‌. భారత పేస్‌ బౌలింగ్‌ దళానికి ఓ ప్రేరణగా నిలిచాడు. ఓ విప్లవాన్ని రగిల్చాడు. ఆ విప్లవమే ఇప్పుడు ప్రపంచ స్థాయి పేస్ బౌలింగ్‌కు మార్గదర్శకమైంది. కఠిన పరిస్థితుల్లోనూ […]

Read More

యూఎస్ ఓపెన్​కు నాదల్​ డౌటే

వాషింగ్టన్: ఇప్పుడున్న పరిస్థితుల్లో యూఎస్ ఓపెన్​లో ఆడడం సందేహమేనని స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్​ అన్నాడు. రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేనన్నాడు. ‘యూఎస్ ఓపెన్​లో ఆడతావా? అని ఈ రోజు నన్ను అడిగితే నో అనే చెబుతా. రాబోయే రెండు నెలలో పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం. మెరుగైతే బరిలోకి దిగుతా. లేకపోతే కష్టమే. దీనిపై స్పష్టత ఇచ్చేందుకు మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఎందుకంటే న్యూయార్క్​లో కేసుల సంఖ్య చాలా ఎక్కువగా […]

Read More

యువరాజ్​ సింగ్​పై కేసు

న్యూఢిల్లీ: ఓ కులానికి సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో.. టీమిండియా మాజీ ఆల్​ రౌండర్ యువరాజ్ సింగ్​పై పోలీసు కేసు నమోదైంది. వివరాళ్లోకి వెళ్తే.. మొన్న రోహిత్​తో జరిగిన ఇన్​స్టాగ్రామ్​ లైవ్​లో యువరాజ్.. చహల్​ ప్రస్తావన తెచ్చాడు. కుటుంబ సభ్యులతో కలిసి చేసిన వీడియోలను చహల్ ఎందుకు పోస్ట్ చేస్తున్నాడని రోహిత్​ను అడిగాడు. వీళ్లకు ఏం పని లేదా? అంటే కాస్త కఠినస్వరంతో హెచ్చరించాడు. ఆ క్రమంలో ‘భంగి’ (బోయ కులం) అనే పదాన్ని ఉపయోగించడంతో వివాదం […]

Read More

ఛేజ్ కింగ్.. విరాటే

న్యూఢిల్లీ: భారీ లక్ష్యాలను ఛేదించడంలో విరాట్ కోహ్లీని మించిన మొనగాడు లేడన్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ విషయంలో సచిన్ కంటే కోహ్లీయే బెస్ట్ అన్న పీటర్సన్​ కు నేడు బ్రాడ్ హాగ్ తోడయ్యాడు. కాకపోతే సచిన్ స్థానంలో ఈసారి రోహిత్ వచ్చాడు. విరాట్, రోహిత్లో మెరుగైన బ్యాట్స్​మెన్​ ఎవరనే ప్రశ్నకు హాగ్ తనదైన శైలిలో విశ్లేషణ చేశాడు. ఛేదన పరంగా చూస్తే కోహ్లీయే ఓ మెట్టు పైన ఉంటాడని చెప్పాడు. అయితే రోహిత్, కోహ్లీని […]

Read More